న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ సజ్జన్‌కుమార్ రాజీనామా చేశారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగాతేలి శిక్ష పడటంతో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సోమవారం ఢిల్లీ హైకోర్టు సజ్జన్‌కుమార్‌కు జీవిత ఖైదు విధించింది. 2,733 మంది మృతిచెందిన ఆ ఘటనలో శిక్ష పడిన తొలి రాజకీయ నేత సజ్జన్. 1984 నవంబర్ 1,2 తేదీల్లో జరిగిన అల్లర్లలో ఐదుగురు సిక్కులను హత్యచేసిన ఘటనలో సజ్జన్ పాత్ర నిరూపితమైంది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన అల్లర్లలో 2,733 మంది సిక్కులు చనిపోయారు. ఇందిరకి రక్షణగా ఉన్న సిక్కులే ఆమెను హత్య చేయడంతో సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి.
Comments
Please login to add a commentAdd a comment