న్యూయార్క్‌కు చెందిన 'పెప్సికో ఇంక్' (PepsiCo Inc) లేస్ పొటాటో చిప్స్ కోసం ప్రేత్యేకంగా పండించిన పొటాటో రకానికి సంబంధించిన పేటెంట్ మీద కంపెనీ చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (PPVFR) అథారిటీ 2021లో పెప్సికో FC5 బంగాళాదుంప రకానికి మంజూరు చేసిన మేధో రక్షణను ఉపసంహరించుకుంది.
సీడ్ వెరైటీ మీద కంపెనీ పేటెంట్‌ను క్లెయిమ్ చేయలేమని రైతుల హక్కుల కార్యకర్త 'కవిత కురుగంటి' వాదించడంతో పెప్సికో పేటెంట్ కవర్‌ను అథారిటీ తొలగించింది. పేటెంట్ కవర్ రద్దుపై పెప్సికో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అధికార నిర్ణయంపై పెప్సికో చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా జులై 5 నాటి ఉత్తర్వులో తోసిపుచ్చారు.
(ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..)
మాకు ఆర్డర్ గురించి తెలుసు, అంతే కాకుండా దానిని సమీక్షించే ప్రక్రియలో ఉన్నామని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 1989లో భారతదేశంలో తన మొట్టమొదటి పొటాటో చిప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన US స్నాక్స్ అండ్ డ్రింక్స్ తయారీదారు, FC5 సీడ్ రకాన్ని రైతుల సమూహానికి సరఫరా చేసింది. వారు ఆ ఉత్పత్తులను కంపెనీకి ఒక స్థిరమైన ధరకు విక్రయించారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. దీనిని కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందని 2016లోనే వెల్లడించింది.
(ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!)
నిజానికి లేస్ కోసం వినియోగించే FC5 రకం బంగాళాదుంప చిప్స్ వంటి స్నాక్స్ చేయడానికి అవసరమైన తేమను కలిగి ఉంటాయి. కావున కంపెనీ వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి వినియోగించుకుంటోంది. అయితే 2019లో పెప్సికో కొంతమంది భారతీయ రైతుల మీద దావా వేసింది. కానీ సాగుదారులు ఈ పేటెంట్ ఉల్లంఘించారని ఆరోపించి ఉల్లంఘన కోసం 121050 డాలర్లను కోరినట్లు సమాచారం. చివరకు నెలరోజుల్లోనే పెప్సికో రైతులపై దావాలను ఉపసంహరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment