Potato chips
-
చిప్స్ ఉండగా పూల చింత ఏల!
‘పెళ్లి ఉరేగింపు కారును దేనితో అలంకరిస్తారు?’ అనే ప్రశ్నకు టక్కున వినిపించే జవాబు... పువ్వులు. పూల కొరతో, ఖర్చు అనుకున్నారో.. వైవిధ్యం కోసమో ఏమో తెలియదుగానీ ఈ పెళ్లి కారును ΄పోటాటో చిప్స్ ప్యాకెట్స్‌తో అలంకరించారు. సత్పాల్ యాదవ్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. చిప్స్‌తో ముస్తాబైన ఈ పెళ్లి కారు గురించి నెటిజనులు సరదాగా స్పందించారు. ‘΄పోటాటో చిప్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే పబ్లిసిటీ ఇది’ ‘చిప్స్ అంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఇలానా!’ ‘చిప్స్‌కు బదులుగా ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో ముస్తాబు చేసి ఉంటే కారు వెంట జనాలు పరుగులు తీసేవారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
పెప్సికో కంపెనీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. కారణం ఏంటంటే?
న్యూయార్క్‌కు చెందిన 'పెప్సికో ఇంక్' (PepsiCo Inc) లేస్ పొటాటో చిప్స్ కోసం ప్రేత్యేకంగా పండించిన పొటాటో రకానికి సంబంధించిన పేటెంట్ మీద కంపెనీ చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (PPVFR) అథారిటీ 2021లో పెప్సికో FC5 బంగాళాదుంప రకానికి మంజూరు చేసిన మేధో రక్షణను ఉపసంహరించుకుంది. సీడ్ వెరైటీ మీద కంపెనీ పేటెంట్‌ను క్లెయిమ్ చేయలేమని రైతుల హక్కుల కార్యకర్త 'కవిత కురుగంటి' వాదించడంతో పెప్సికో పేటెంట్ కవర్‌ను అథారిటీ తొలగించింది. పేటెంట్ కవర్ రద్దుపై పెప్సికో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అధికార నిర్ణయంపై పెప్సికో చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా జులై 5 నాటి ఉత్తర్వులో తోసిపుచ్చారు. (ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..) మాకు ఆర్డర్ గురించి తెలుసు, అంతే కాకుండా దానిని సమీక్షించే ప్రక్రియలో ఉన్నామని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 1989లో భారతదేశంలో తన మొట్టమొదటి పొటాటో చిప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన US స్నాక్స్ అండ్ డ్రింక్స్ తయారీదారు, FC5 సీడ్ రకాన్ని రైతుల సమూహానికి సరఫరా చేసింది. వారు ఆ ఉత్పత్తులను కంపెనీకి ఒక స్థిరమైన ధరకు విక్రయించారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. దీనిని కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందని 2016లోనే వెల్లడించింది. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) నిజానికి లేస్ కోసం వినియోగించే FC5 రకం బంగాళాదుంప చిప్స్ వంటి స్నాక్స్ చేయడానికి అవసరమైన తేమను కలిగి ఉంటాయి. కావున కంపెనీ వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి వినియోగించుకుంటోంది. అయితే 2019లో పెప్సికో కొంతమంది భారతీయ రైతుల మీద దావా వేసింది. కానీ సాగుదారులు ఈ పేటెంట్ ఉల్లంఘించారని ఆరోపించి ఉల్లంఘన కోసం 121050 డాలర్లను కోరినట్లు సమాచారం. చివరకు నెలరోజుల్లోనే పెప్సికో రైతులపై దావాలను ఉపసంహరించుకుంది. -
ఆలూ తింటే వెయిట్ పెరుగుతామా?
-
వాటే ఐడియా!... లేస్ ప్యాకెట్లతో చీర!
This Saree Made Out of Potato Chips Wrapper: మనం ఏదైన చిప్స్ ప్యాకెట్ కొని తినేసిన తర్వాత కవర్ని ఎవరైన పడేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం కవర్లను పడేయకుండా దాచిపెట్టుకుంది. అది కూడా ఒకే రంగు ప్యాకెట్ కవర్లని కలెక్ట్ చేసింది. అయితే ఆ కవర్లని ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా! అసలు విషయంలోకెళ్తే...ఈ అమ్మాయికి బంగాళ దుంప చిప్స్ అంటే ఇష్టమో ఏమో మరీ. ఏకంగా బ్లూకలర్ లేస్ ప్యాకెట్ల కవర్లను కలక్ట్ చేసి మరీ చీరగా రూపొందించడమే కాక ధరించింది . అంతేగాక ఆమె తయారు చేసిన చీర ధరించి సందడి చేస్తున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు "చీరంటే ఇంటే ఇలా ఉండాలి" అని ఒకరు, ఇలాంటి వెర్రీ ఆలోచనలతో చీరల మీద విరక్తి తెప్పించకండి అని మరోకరు..ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by BeBadass.in (@bebadass.in) -
Viral Video: ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా?
చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్నాక్ ఐటమ్ చిప్స్‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఎప్పుడూ సూపర్ మార్కెట్‌కు వెళ్లిన సామాన్ల లిస్టులో చిప్స్ తప్పనిసరి. ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉన్నా.. దుకాణాల్లో దొరికే చిప్స్‌ను కొనుక్కొని తింటుంటారు. తాజాగా ఓ మహిళ చిప్స్ ప్యాకెట్లో ఉమ్మివేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు మహిళ చేసిన పాడు పనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిప్స్ ప్యాకెట్లో ఉమ్మిన మహిళ మేకప్ ఆర్టిస్ట్ లిబ్బి బర్న్స్‌గా గుర్తించారు. సంగీతకారుడు హంటర్ హేస్ మాజీ ప్రియురాలు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే తరువాత లిబ్బికి నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ఈ క్లిప్‌ను డిలీట్ చేసినప్పటికీ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతుంది. వీడియోలో.. అమెరికాలోని నాష్విల్లే కిరాణ దుకాణంలోకి వెళ్లిన లిబ్బి బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్‌ను తెరిచి అందులోంచి ఒకటి తీసుకొని రుచి చూస్తుంది. తనకు నచ్చకపోవడంతో చిప్స్ ప్యాకెట్లో ఉమ్మి మళ్లీ సీల్ చేసే ప్రయత్నం చేసింది. అనంతరం దాన్ని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. అంతేగాదు సీల్ చేసిన వాటర్ బాటిల్ నుంచి కూడా సిప్ తీసుకొని దానిని తిరిగి షెల్ఫ్‌లో ఉంచింది. షాప్‌లో నుంచి తీసిన టాయిలెట్ పేపర్‌తో నాలుకను తుడుచుకోవడం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చేస్తున్న ఆమె కెమెరా చూస్తూ నవ్వుతోంది. అయితే ఈ దృష్యాలన్నీంటిని వీడియో తీసిన వ్యక్తి గురించి ఎలాంటి సమాచారం లేదు. చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!! ఇంతలో, ఒక వ్యక్తి, లిబ్బి వద్దకు వచ్చి నువ్వు దొంగతనం చేస్తున్నావా అని అడిగాడు, దానికి ఆమె “నేను దొంగతనం చేయడం లేదు. నేను ఆ వస్తువులను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాను. నీ పని నువ్వు చూసుకో. నేను వాటిని ఎక్కడ ఉంచానో నాకు గుర్తుంది. ఇది నీకు సంబంధించినది కాదు’ అంటూ మండిపడింది. ఇక్కడితో వీడియో ముగియడంతో దీనిని చూసిన నెటిజన్లు.. ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా అంటూ లిబ్బి చర్యలపై ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇదంతా నిజం కాదని, వినోదం కోసం ఇలా వీడియో చేసిందని చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత, క్రోగర్ షాప్ యాజమాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తమ కస్టమర్ల భద్రత మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. ‘నాష్విల్లే డివిజన్లోని మా స్టోర్‌కు చెందిన ఓ వీడియో సర్క్యులేట్ అవుతున్నట్లు మాకు తెలిసింది. మేము వెంటనే దర్యాప్తును ప్రారంభించాం. దీని ద్వారా మహిళ వీడియోలో చూపించిన వస్తువులను షెల్ఫ్‌లో ఉంచలేదని తెలిసింది. ఆమె వాటిని కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ వీడియో ఫన్ కోసం తీసినప్పటికీ పలువురిని ఇబ్బందులకు గురిచేస్తోంది. వినియోగదారుల ప్యాకేజింగ్‌ను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని గుర్తుంచుకోవాలి’ అని తెలిపారు. చదవండి: Funny Video: ‘దండం పెడతా సార్, నన్ను ఇంటికాడ దింపండి, సీరియల్ చూడాలి’ -
Lays Chips: పెప్సీకో కంపెనీకి భారత్‌లో ఎదురుదెబ్బ
Pepsico Lays Chips Potato Patent Rights Revoked In India: ప్రముఖ ఫుడ్ అండ్ స్నాక్ కంపెనీ ‘పెప్సీకో’కి భారత్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చిప్స్ తయారీ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన ఆలు వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో సొంతం మాత్రమే కాదనే తీర్పు వెలువడింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ హక్కుల్ని రద్దు చేస్తూ.. మొక్కల రకాల పరిరక్షణ & రైతు హక్కుల అధికార సంఘం Protection of Plant Varieties and Farmers' Rights (PPVFR) Authority శుక్రవారం తీర్పు వెలువరించింది. లేస్ చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళదుంప వంగడంపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తమపేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులెవరూ(ఒప్పంద పరిధిలో ఉన్నవాళ్లని మినహాయించి) వాటిని పండించడానికి వీల్లేదంటూ న్యూయార్క్‌కు చెందిన ఈ మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అయితే కేవలం పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తిగా రైతుల్ని నిలువరించడం కుదరని, అందుకు చట్టం సైతం అంగీకరించదంటూ PPVFR తీర్పు వెలువరించింది. ఈ మేరకు పెప్సీకో కంపెనీకి గతంలో జారీ అయిన పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. ‘రైతుల విత్తన స్వేచ్ఛ’ను ఉల్లంఘించకుండా ఇతర విత్తన, ఆహార సంస్థలను కూడా నిలువరించాలని ఈ సందర్భంగా PPVFRను రైతుల తరపున పిటిషన్ దాఖలు చేసిన కవిత కురుగంటి కోరుతున్నారు. ఇక ఈ వ్యతిరేక పరిణామంపై స్పందించేందుకు పెప్సీకో కంపెనీ నిరాకరించింది. ఏంటీ వంగడం.. ఎఫ్ఎల్-2027 (FC5) వెరైటీ పొటాటోలు. వీటిని లేస్ పొటాటో చిప్స్‌గా పేర్కొంటారు. చిప్స్ తయారీలో ఉపయోగించే ఈ వంగడాల్ని 2009లో భారత్‌లోకి తీసుకొచ్చింది పెప్సీకో కంపెనీ. సుమారు 12 వేల మంది రైతులకు వీటి విత్తనాల్ని అందించి.. తిరిగి దుంపల్ని చేజిక్కిచ్చుకునేలా ఒప్పందం ఆ సమయంలో కుదుర్చుకుంది. అంతేకాదు 2016లో ఈ వెరైటీ వంగడం మీద.. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్ చట్టం 2001’ ప్రకారం అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2019లో తమ హక్కులకు భంగం కలిగిందంటూ పెప్సీకో కంపెనీ దావా వేయడం ద్వారా ఈ వంగడం గురించి బయటి ప్రపంచానికి బాగా తెలిసింది. తమ ఒప్పందం పరిధిలోని లేని తొమ్మిది మంది గుజరాత్ రైతులు ఈ వంగడం పండిస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అందులో నలుగురు చిన్న రైతులపై 4.2 కోట్ల రూ.కు దావా వేసింది పెప్సీకో కంపెనీ. అయితే సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో కలగజేసుకుంది. దీంతో అదే ఏడాది మే నెలలో పెప్సీకో కంపెనీ కేసులు మొత్తం వెనక్కి తీసుకుంది. ఆ వెంటనే రైతు ఉద్యమకారిణి కవితా కురుగంటి.. పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ PPVFR ముందు ఒక అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న పీపీవీఎఫ్‌ఆర్.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. ‘‘అనేక మంది రైతులు కష్టాల్లో కూరుకుపోయారు, వారు చేస్తున్న ఉద్దేశ్య ఉల్లంఘనపై భారీ జరిమానా చెల్లించే అవకాశం ఉంది! ఇది కచ్చితంగా ప్రజా ప్రయోజనాలను ఉల్లంఘించడమే అవుతుంది’’ అన్న కవిత వాదనలతో పీపీవీఎఫ్‌ఆర్ ఏకీభవించింది. ‘రిజిస్ట్రేటర్లు తమ హక్కులు తెలుసుకోవాలి అలాగే రైతులనూ ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి వ్యవహారాల్లో హక్కులపై పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తి హక్కులుండవని చట్టంలో ఉంది. సీడ్ వెరైటీల మీద పేటెంట్లను చట్టం ఈ స్థాయిలో అనుమతించబోద’న్న విషయాన్ని గుర్తు చేశారు పీపీవీఎఫ్‌ఆర్ చైర్పర్సన్ కేవీ ప్రభు. చదవండి: బతుకు రోడ్డు పాలు.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కోటీశ్వరుడయ్యాడు -
చిప్స్ ప్యాకెట్లో అది చూసి షాక్ అయిన కస్టమర్..!
లండన్: ఇటీవల ఆన్లైన్లో వస్తువులు కొంటున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలా కొనుగోలు చేసిన వాటిలో ఒకటికి బదులు వేరొక వస్తువులు కస్టమర్లు అందుకున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు ఆనలైన్‌లోనే కాకుండా కొన్ని సార్లు ఆఫ్‌లైన్ కస్టమర్లకు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి ఆలూ చిప్స్ ప్యాకెట్ కొని తెరిచి చూడగా అందులో చిప్స్‌కు బదులు ఒక ఆలుగడ్డ ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. లింకన్షైర్లోని ఉప్పింగ్‌హామ్ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడైన డేవిడ్ బాయ్స్ ఈ నెల 17న కెటిల్ చిప్స్ ప్యాకెట్ కొన్నాడు. ఎంతో ఆశగా చిప్స్ తినాలని ఆ ప్యాకెట్ తెరిచి చూడగా అందులో ఒక బంగాళదుంప గడ్డ మాత్రమే ఉండడం చూసి ఖంగుతిన్నాడు. షాక్‌లోంచి తేరుకుని దాన్ని ఫొటో తీసి ట్విటర్లో పోస్ట్ చేయడంతో పాటు ఆ సంస్థ దృష్టికి తీసుకెళ్లాడు. ఆ పోస్ట్‌కి క్యాప్షన్‌గా.. ‘నేను ఈ రోజు కెటిల్ చిప్స్ ప్యాకెట్ తెరిచాను. అందులో క్రిప్స్ కనిపించలేదు. కేవలం బంగాళాదుంప గడ్డ మాత్రమే ఉందని తెలిపాడు. దీనిపై సదరు సంస్థ స్పందిస్తూ అతనికి క్షమాపణలు చెప్పింది. ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలియదని.. ఆ ప్యాకెట్‌ను వారికి అందజేస్తే తమ బృందం నుంచి వివరాలు సేకరిస్తామంటూ రీట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారి సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. So I opened a bag of @KETTLEChipsUK today to find no crisps. Just a whole potato. 😮 pic.twitter.com/PGEqGMqIWF — Dr David Boyce (@DrDavidBoyce) October 16, 2021 చదవండి: తల్లిదండ్రులకు షాకిచ్చిన చైనా.. ఇకపై పిల్లలు తప్పు చేశారో అంతే సంగతి.. -
ఒక్క ఆలూ చిప్.. ధర ఏకంగా రూ.14 లక్షలు
వెబ్‌డెస్క్: అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో ఊహించడం కష్టం. కొందరు ఎంత కష్టపడ్డా తగిన ఫలితం లభించక బాధపడతారు.. కానీ కొందరి జీవితంలో జరిగే సంఘటనలు చూస్తే.. చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరదాకి చేసే పనులు కూడా వారికి బాగా కలసివస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త కూడా ఈ కోవకు చెందినదే. తినే చిప్స్‌లో ఒకటి కాస్త వింతగా ఉండటంతో దాన్ని దాచుకోవాలని నిర్ణయించుకుంది ఓ బాలిక. ఆ తర్వాత దాన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్లోడ్ చేయడంతో చాలామంది దాన్ని వేలం వేయమని సూచించారు. వేలంలో ఆ చిన్న ఆలూ చిప్ ఏకంగా 14 లక్షల రూపాయల ధర పలికింది. నమ్మశక్యంగా లేని ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కి చెందిన 13 ఏళ్ల బాలిక రైలీ స్టువార్ట్‌కు బంగాళాదుంప చిప్స్ తినడం అంటే ఇష్టం. అందులోనూ ప్రముఖ బ్రాండ్ డోరిటోస్ ఆలూ చిప్స్ అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఓసారి రైలీ డోరిటోస్ చిప్స్ ప్యాకెట్ తీసుకువచ్చింది. దానిలో ఆమెకు ఓ చిత్రమైన చిప్ ముక్క కనిపించింది. అది మిగతా చిప్స్ ముక్కల్లా కాకుండా... సమోసాలాగా ఉబ్బినట్లు ఉంది. వెరైటీగా ఉండటంతో రైలీ దాన్ని దాచుకోవాలని భావించింది. ఈ క్రమంలో ఆ చిప్ ముక్కను వీడియో తీసి... టిక్‌టాక్‌లో ఉబ్బిన స్నాక్ పేరుతో అప్లోడ్ చేసింది. సమోసాలా భిన్నంగా ఉన్న ఈ ఆలూ చిప్ వీడియో తెగ వైరలయ్యింది. ఆ తర్వాత ఇది కాస్త ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా షేర్ అయ్యింది. ఇక టిక్‌టాక్‌లో దీనికి మిలియన్ల వ్యూస్ వచ్చాయి. విభిన్నంగా ఉన్న ఈ చిప్‌ని కొనేందుకు నెటిజనులు ఆసక్తి కనపర్చడంతో.. రిలే దాన్ని వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దాన్ని ఈబే సైట్లో లిస్ట్ చేసింది. చిప్ ఖరీదు ఒక్క డాలర్ కంటే తక్కువ కోట్ చేసింది. అయితే ఆశ్చర్యంగా గంటల వ్యవధిలోనే దాని విలువ 2 వేల డాలర్లకు చేరింది. ఆ చిప్ ముక్కకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది భారీగా డబ్బులిచ్చి కొనేందుకు ముందుకొచ్చారు. ఇలా వేలం కొనసాగుతూ ఉండగా... డోరిటోస్ కంపెనీకి ఈ విషయం తెలిసింది. ఆశ్చర్యపోయిన కంపెనీ... బిడ్డింగ్‌లో పాల్గొని అందరికంటే చాలా ఎక్కువగా 20,100 డాలర్లు(14,90,251 రూపాయలు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది. విషయం తెలిసి రిలే కుటుంబం సంతోషంతో ఉబితబ్బయ్యింది. ఇక ఏదో సరదాకు చేసిన పనికి ఇంత భారీ ఎత్తున డబ్బు వస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ సంతోషంతో గంతులు వేస్తుంది రిలే. ఎందుకు అంత ధరంటే.. ఒక చిన్న ఆలూ చిప్ ముక్కను రూ.14 లక్షలు పెట్టి కొనేందుకు డోరిటోస్ ముందుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనిపై కంపెనీ వివరణ ఇచ్చింది. "మరెవరైనా అయితే... ఆ ముక్కను కూడా తినేవారేమో... కానీ ఆ బాలిక క్రియేటివ్‌గా ఆలోచించింది. దాన్ని కూడా వ్యాపార కోణంలో చూసింది. దానితో బిజినెస్ చేసింది. ఆమె ధైర్యం మాకు నచ్చింది. ఆమెలో ఓ వ్యాపారవేత్తను మేం చూశాం. పైగా ఆమె కుటుంబం మా చిప్స్‌కి అభిమానులు. అందుకే ఇలా చేశాం" అని తెలిపింది. This 13-year-old was paid $20,000 by Doritos after finding a perfectly puffy chip 😱 pic.twitter.com/mFRfWVr5F0 — NowThis (@nowthisnews) August 20, 2021 -
‘పెప్సీ’ని వదిలే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రైతుల్ని వేధించినందుకు పెప్సీ కంపెనీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గుజరాత్ రైతులపై కేసులు ఉపసంహరించుకుంటే సరిపోదని, మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించాయి. ఈ వ్యవహారమై విజయవాడలో త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి రైతుల్ని చైతన్య పరచాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే పెప్సీ కంపెనీ నుంచి తమకు పరిహారం ఇప్పించాలంటూ బంగాళదుంప రైతులు కేసు వేయడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. చదవండి: (కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు) గుజరాత్లో ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపను సాగు చేసినందుకు గత రెండేళ్లలో 9 మంది రైతులపై పెప్సీ కంపెనీ ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ వ్యాజ్యాన్ని వేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన పెప్సీ కంపెనీ రైతులపై పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటామంటూ కొన్ని ఆంక్షలు విధించింది. అయితే బాధిత రైతులకు మద్దతు తెలుపుతున్న రైతు సంఘాల ఐక్య వేదిక పలు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు, సభలు నిర్వహించతలపెట్టింది. దీనికి అనుగుణంగా త్వరలో ఏపీలోని పలు ప్రాంతాలలో సదస్సులు జరుగనున్నాయి. -
పెప్సీపై సమరశంఖం
సాక్షి, అమరావతి: బహుళ జాతి కంపెనీ పెప్సీ ఉత్పత్తుల బహిష్కరణకు రాష్ట్ర రైతు సంఘాలు పిలుపిచ్చాయి. రైతుల ప్రయోజనాన్ని కాంక్షించే వారందరూ ఈ కంపెనీ లేస్ పేరిట తయారు చేస్తున్న బంగాళాదుంపల చిప్స్‌ను, పెప్సీ శీతల పానీయాన్ని దూరం పెట్టాలని విజ్ఞప్తి చేశాయి. దేశీయ రైతాంగంపై పెప్సీ కంపెనీ పెత్తనమేమిటంటూ ధ్వజమెత్తాయి. ఈ కంపెనీ తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు, కౌలు రైతుల సంఘం, సీఐటీయూ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, పెప్సీ ఉత్పత్తుల దహనం వంటి ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. గుజరాత్ రాష్ట్రంలో బంగాళదుంపలు పండించే రైతులపై పెప్సీ కంపెనీ పెట్టిన కేసుల్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశాయి. అంతర్జాతీయ ఒప్పందాల మాటున రైతులు సొంతంగా విత్తనాలు ఉత్పత్తి చేసుకునే వెసులుబాటును కంపెనీలు కాలరాస్తున్నాయని మండిపడ్డాయి. నాటి ఈస్టిండియా కంపెనీ దోపిడీకి ప్రస్తుత పెప్సీ కంపెనీ దోపిడీకి తేడా లేదని దుమ్మెత్తిపోశాయి. దేశంలోని రైతులు, పంటలు, ఆదాయాలు, ఆహార భద్రత, వ్యవసాయ స్వాతంత్య్రం, దేశ సార్వభౌమాధికారంపై పెప్సీ కేసు ప్రభావం చూపుతుందని విజయవాడలో ధర్నా చేసిన రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెప్సీ కంపెనీ తప్పుడు సంప్రదాయానికి శ్రీకారం చుడుతోందని, ఈ తీరును మొగ్గలోనే తుంచేయకపోతే మున్ముందు రైతులు విత్తనాన్ని తయారుచేసుకునే స్వాతంత్య్రాన్నే కోల్పోతారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పెప్సీ కంపెనీ వైఖరిని గర్హిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు సాగినట్టు రైతు సంఘాల నేతలు పి.పెద్దిరెడ్డి, పి.జమలయ్య, కేవీవీ ప్రసాద్ తదితరులు ప్రకటించారు. విత్తన స్వేచ్ఛను హరించే పీపీవీఎఫ్‌ఆర్ చట్టం (వంగడాల రకాలు, రైతుల హక్కుల చట్టం–2001)లోని సెక్షన్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారమై త్వరలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఇదీ వివాదం..! లేస్ బ్రాండ్ పేరిట చిప్స్ తయారీకి బహుళజాతి పెప్సీ కంపెనీ ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపపై గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. ఆ రకం దుంపను తాము గుర్తించిన రైతులు మాత్రమే సాగు చేసేలా గుజరాత్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది తెలియని నలుగురు గుజరాత్ రైతులు ఆ రకం దుంపను సాగు చేశారు. దీన్ని ఆక్షేపిస్తూ ఆ నలుగురి రైతులపై అహ్మదాబాద్ సిటీ కోర్టులో పెప్సీ కంపెనీ వ్యాజ్యం వేసింది. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ ఐదు లక్షల రూపాయలను నష్ట పరిహారంగా ఇప్పించాలని కోరింది. కోర్టు తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ రకం దుంపను సాగు చేయవద్దని ఆదేశించింది. ఈ సమయంలోనే పెప్సీ కంపెనీ.. కోర్టు బయట కేసును పరిష్కరించుకుంటామని కోరింది. అయితే తమ కంపెనీకి కేటాయించిన ఎఫ్‌సీ–5 రకం విత్తనాలను తమ నుంచే కొనుగోలు చేయాలని, పండించిన ఆ దుంపను తమ కంపెనీకే అమ్మాలని ఆంక్షలు పెట్టింది. భవిష్యత్‌లో ఈ విత్తనాలను సాగు చేయకుండా రైతులు తమతో ఒప్పందానికి రావాలని కూడా డిమాండ్ చేసింది. ఇది రైతులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పెప్సీ ఆంక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, తమపై పెప్సీ పెత్తనమేమిటని ఎఫ్‌సీ–5 రకం దుంపను సాగు చేసిన నలుగురు రైతుల్లో ఒకరైన వినోద్ కుమార్ తేల్చి చెప్పారు. పెప్సీ కంపెనీ ప్రతిపాదనను అంగీకరించినట్టయితే తాము తప్పు చేసినట్టవుతుందని వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ జరిగే జూన్ 12 నాటికి తాము రైతులు, రైతు సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం చెబుతామని కోర్టుకు నివేదించారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పోరుబాట పెప్సీ కంపెనీ తీరును తప్పుబడుతూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు పోరు బాట పట్టాయి. దీనికి నానాటికీ మద్దతు పెరుగుతోంది. దేశంలోని 190కి పైగా రైతు సంఘాలు, శాస్త్రవేత్తలు, కార్మిక సంఘాల నేతలు దేశ ప్రజలకు విజ్ఞాపన చేస్తూ పెప్సీ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపిచ్చారు. ఆ నలుగురు రైతుల తరఫున కేసును వాదిస్తున్న ఆనంద్ యాజ్ఞిక్ పెప్సీ ఒప్పందాన్ని అసంబద్ధమైందిగా అభివర్ణించారు. అధిక ధరకు రైతులు విత్తనాలు కొని, పంటను పండించిన తర్వాత తక్కువ ధరకు అమ్ముకోవాలని పెప్సీ కంపెనీ చెబుతోందని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. మొత్తం మీద ఇప్పుడు పెప్సీ కంపెనీ వ్యవహారం చినికి చినికి గాలివానలా తయారైంది. -
మల్టీప్లెక్స్ తిండితో మందబుద్ధి!?
బంగాళదుంప చిప్స్, బర్గర్, కూల్‌డ్రింక్... మల్టీప్లెక్స్ ఫుడ్ ఇది. వీకెండ్ ఎంజాయ్మెంట్లో భాగం ఈ ఆహారం. తినేటప్పుడు ఆనందాన్ని ఇచ్చినా వీటివల్ల శరీరంలో చెడు కొవ్వు పేరుకొంటుందనే హెచ్చరికలు పాతవే. అయితే వీటివల్ల మెదడు వికాసం కూడా ఆగిపోతుందని అంటున్నారు అధ్యయనకర్తలు. ప్రత్యేకించి 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలను ఇలాంటి ఆహారానికి దూరంగా ఉంచడమే మంచిదని వారు సూచిస్తున్నారు. పాశ్చాత్య ఆహారపు శైలిలో ఈ టేక్ అవే ఫుడ్ చాలా సహజమైనది. మనదేశంలో కూడా ఈ తరహా ఆహారం పట్ల ఎక్కువ ఆసక్తే ఉంది. నయా నగర జీవితంలో బర్గర్ల, బంగాళదుంప చిప్స్ ప్రాధాన్యం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అధ్యయనకర్తలకు ఈ ఆహారం మీద ప్రత్యేకమైన కోపం ఏమీ లేదు. వీటిని వండే విధానం, వీటిలోని కొవ్వులు, కార్బోహైడ్రేట్లు మెదడు శక్తిని తగ్గించి వేస్తాయన్నదే వారి వాదన. మరి ఇప్పటికైనా ఇలాంటి ఫుడ్‌కు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదేమో!