
వైరల్
‘పెళ్లి ఉరేగింపు కారును దేనితో అలంకరిస్తారు?’ అనే ప్రశ్నకు టక్కున వినిపించే జవాబు... పువ్వులు. పూల కొరతో, ఖర్చు అనుకున్నారో.. వైవిధ్యం కోసమో ఏమో తెలియదుగానీ ఈ పెళ్లి కారును ΄పోటాటో చిప్స్ ప్యాకెట్స్‌తో అలంకరించారు.
సత్పాల్ యాదవ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. చిప్స్‌తో ముస్తాబైన ఈ పెళ్లి కారు గురించి నెటిజనులు సరదాగా స్పందించారు.
‘΄పోటాటో చిప్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే పబ్లిసిటీ ఇది’
‘చిప్స్ అంటే ఎంత ఇష్టముంటే మాత్రం ఇలానా!’
‘చిప్స్‌కు బదులుగా ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో ముస్తాబు చేసి ఉంటే కారు వెంట జనాలు పరుగులు తీసేవారు’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి.
Comments
Please login to add a commentAdd a comment