This Saree Made Out of Potato Chips Wrapper: మనం ఏదైన చిప్స్ ప్యాకెట్ కొని తినేసిన తర్వాత కవర్‌ని ఎవరైన పడేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం కవర్‌లను పడేయకుండా దాచిపెట్టుకుంది. అది కూడా ఒకే రంగు ప్యాకెట్ కవర్‌లని కలెక్ట్ చేసింది. అయితే ఆ కవర్లని ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా!
అసలు విషయంలోకెళ్తే...ఈ అమ్మాయికి బంగాళ దుంప చిప్స్ అంటే ఇష్టమో ఏమో మరీ. ఏకంగా బ్లూకలర్ లేస్ ప్యాకెట్ల కవర్లను కలక్ట్ చేసి మరీ చీరగా రూపొందించడమే కాక ధరించింది . అంతేగాక ఆమె తయారు చేసిన చీర ధరించి సందడి చేస్తున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు "చీరంటే ఇంటే ఇలా ఉండాలి" అని ఒకరు, ఇలాంటి వెర్రీ ఆలోచనలతో చీరల మీద విరక్తి తెప్పించకండి అని మరోకరు..ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment