lays
-
‘ఆ చిప్స్ ప్రాణాంతకం’.. వేలాది ప్యాకెట్లు వెనక్కి..
పొటాటో చిప్స్‌ను తయారు చేసే ప్రముఖ బ్రాండ్ లేస్ (Lays) యూఎస్‌లో తమ క్లాసిక్ పొటాటో చిప్స్ (potato chips) ప్యాకెట్లను వేలసంఖ్యలో రీకాల్ చేసింది. కొన్ని ప్యాకెట్లలోని చిప్స్‌లో కొందరికి ప్రాణహాని కలిగించే ఒక అప్రకటిత అలెర్జీ కారకం ఉన్నట్లు వెల్లడైన తర్వాత వేలకొద్దీ ప్యాకెట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఫ్రిటో లే కంపెనీ ప్రకటించింది.ఈ మేరకు లేస్ ప్రకటించిన రీకాల్‌ను యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాజాగా క్లాస్ 1 రీకాల్‌గా వర్గీకరించింది. అంటే తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు లేదా మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూఎస్‌లోని ఒరెగాన్, వాషింగ్టన్‌లోని రిటైల్, ఆన్లైన్ స్టోర్లలో విక్రయించే 13-ఔన్స్ లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ 6,344 ప్యాకెట్లపై రీకాల్ ప్రభావం చూపుతుంది.సందేహాస్పదమైన లేస్ చిప్స్ తయారీలో తీవ్రమైన అలెర్జీ కారకమైన పాలను వినియోగించారు. ఎఫ్‌డీఏ ప్రకారం.. అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపించగల ఎనిమిది ప్రధాన ఆహార అలెర్జీ కారకాలలో పాలు ఒకటి. పాలకు అలెర్జీ ఉన్నవారు దద్దుర్లు, కడుపు తిమ్మిరి, మైకము, స్వర తంతులు ఉబ్బడం లేదా అపస్మారక స్థితి వంటి లక్షణాలకు గురయ్యే ఆస్కారం ఉంటుంది.చిప్స్‌లో పాలు ఉన్నట్లు గుర్తించిన ఓ కస్టమర్ లేస్ కంపెనీని అప్రమత్తం చేశారు. దీంతో లేస్ స్వచ్ఛందంగా రీకాల్‌ను ప్రారంభించింది. రీకాల్ ప్రత్యేకంగా ఒరెగాన్, వాషింగ్టన్‌లోని రిటైల్, ఈ-కామర్స్ అవుట్లెట్లలో విక్రయించే లేస్ క్లాసిక్ పొటాటో చిప్స్ 13-ఔన్స్ ప్యాకెట్లకు వర్తిస్తుంది. దీనికి సంబంధించి ఇంతవరకూ ఎటువంటి అలెర్జీ ప్రతిచర్యలు నమోదు కాలేదని, లేస్‌కు చెందిన ఇతర ఉత్పత్తులను రీకాల్ చేయడం లేదని డిసెంబరు 16 నాటి పత్రికా ప్రకటనలో ఫ్రిటో-లే పేర్కొంది.అలర్జీ కారకాలు ఉన్నాయన్న కారణంతో జారీ చేసిన రీకాల్ ఇదొక్కటే కాదు. గ్రానోలా బార్లు, పాన్కేక్ మిక్స్‌లు, సాస్‌లతో సహా మరో ఆరు ఆహార ఉత్పత్తులలో అప్రకటిత అలెర్జీ కారకాలు ఉండటంతో ఎఫ్‌డీఏ ఇటీవల ఆయా ఉత్పత్తుల రీకాల్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 75 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించిన మెస్సీ అరంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు అదనపు సమయంలో ఇంటర్ మియామి క్లబ్‌కు గోల్ అందించి 2-1 తేడాతో గెలవడంలో కీలకపాత్ర వహించాడు. కాగా మెస్సీకి ఇది 808వ గోల్ కావడం విశేషం. ఇక ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్లను G.O.A.Tగా అభివర్ణిస్తుంటారు. ఈ సందర్భంగా మెస్సీపై అభిమానంతో GOAT అనే పదాన్ని చిప్స్(తినేవి) తయారు చేసే లేస్(Lays Chips) కంపెనీ మెస్సీ గోల్‌ను వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసింది. మెస్సీ తన కెరీర్లో 808వ గోల్ చేసిన తర్వాత అవే 808 మేకలతో మెస్సీ రూపం వచ్చేలో ఓ అద్భుతమైన ఫొటోను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 808 మేకలతో మెస్సీ రూపాన్ని క్రియేట్ చేసింది. మెస్సీకి ట్రిబ్యూట్ అందిస్తూనే లేస్ తన చిప్స్ యాడ్‌ను రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)కు అర్థం వచ్చేలా.. మేకలతో ట్రిబ్యూట్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోలో 808 మేకలను సరిగ్గా మెస్సీ ముఖం వచ్చేలా నిల్చోబెట్టారు. పైన యాంగిల్ నుంచి చూస్తే మెస్సీ ముఖం స్పష్టంగా కనిస్తోంది. +1 🐐 for the 808th goal for the G.O.A.T #Messi #GoatsForGoals pic.twitter.com/LUviACWR4p — LAY'S (@LAYS) July 22, 2023 చదవండి: Cricketer Minnu Mani: భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. -
బట్టలే కాదు, చేతి వేళ్లను శుభ్రం చేసే వాషింగ్ మెషిన్ ఉందని మీకు తెలుసా!
సాయంత్రం చిరుతిళ్లు చాలామందికి అలవాటే! పకోడీలు, చిప్స్ వంటివి పంటి కింద కరకరలాడిస్తూ కబుర్లాడుకోవడం చాలామందికి ఇష్టమైన కాలక్షేపం. నూనెలో వేయించిన చిరుతిళ్లు తినేటప్పుడు మధ్యలో అదే చేత్తో మరో వస్తువు అందుకోవాలంటే, చెయ్యి కడుక్కోవడమో లేదా కనీసం టిష్యూపేపర్తో తుడుచుకోవడమో తప్పదు. పదే పదే చేతులు తుడుచుకోవాల్సిన పరిస్థితులు కొంత చిరాకు కలిగిస్తాయి. అంతేకాదు, టిష్యూపేపర్ వృథాకు దారితీస్తాయి. ఈ ఇబ్బందిని అరికట్టడానికే అంతర్జాతీయ చిప్స్ తయారీ సంస్థ ‘లేస్’ ఒక సరికొత్త పరికరాన్ని తీసుకొచ్చింది. ఈ బుల్లి పరికరంలో అరచెయ్యంతా పట్టదు గాని, వేళ్లు ఇంచక్కా పట్టేస్తాయి. దీని ఎత్తు 15 సెం.మీ., వెడల్పు 11 సెం.మీ. ఇందులో వేళ్లు పెడితే చాలు, ఇట్టే శుభ్రమైపోతాయి. ఇందులో వేళ్లు పెట్టగానే, దీని పైభాగంలోని సెన్సర్లు గుర్తించి, ఇందులోని సిలిండర్ నుంచి ఆల్కహాల్‌ను స్ప్రే చేస్తాయి. ఇందులోని వేడిమి వల్ల క్షణాల్లోనే వేళ్లు పొడిగా శుభ్రంగా తయారవుతాయి. యూఎస్బీ పోర్ట్ ద్వారా దీనిని చార్జింగ్ చేసుకుని ఇంచక్కా వాడుకోవచ్చు. వాడకాన్ని బట్టి పైభాగంలోని సిలిండర్ లో ఆల్కహాల్‌ను ఎప్పటి కప్పుడు రీఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది ఎంత ముచ్చటగా ఉన్నా, మార్కెట్లో దీనిని కొనుక్కోవాలంటే కష్టమే! ‘లేస్’ సంస్థ ఇప్పటి వరకు ఈ పరికరాలను ఐదింటిని మాత్రమే తయారు చేసింది. -
వాటే ఐడియా!... లేస్ ప్యాకెట్లతో చీర!
This Saree Made Out of Potato Chips Wrapper: మనం ఏదైన చిప్స్ ప్యాకెట్ కొని తినేసిన తర్వాత కవర్ని ఎవరైన పడేస్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం కవర్లను పడేయకుండా దాచిపెట్టుకుంది. అది కూడా ఒకే రంగు ప్యాకెట్ కవర్లని కలెక్ట్ చేసింది. అయితే ఆ కవర్లని ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా! అసలు విషయంలోకెళ్తే...ఈ అమ్మాయికి బంగాళ దుంప చిప్స్ అంటే ఇష్టమో ఏమో మరీ. ఏకంగా బ్లూకలర్ లేస్ ప్యాకెట్ల కవర్లను కలక్ట్ చేసి మరీ చీరగా రూపొందించడమే కాక ధరించింది . అంతేగాక ఆమె తయారు చేసిన చీర ధరించి సందడి చేస్తున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు "చీరంటే ఇంటే ఇలా ఉండాలి" అని ఒకరు, ఇలాంటి వెర్రీ ఆలోచనలతో చీరల మీద విరక్తి తెప్పించకండి అని మరోకరు..ఇలా రకరకాలుగా ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by BeBadass.in (@bebadass.in) -
Lays Chips: పెప్సీకో కంపెనీకి భారత్‌లో ఎదురుదెబ్బ
Pepsico Lays Chips Potato Patent Rights Revoked In India: ప్రముఖ ఫుడ్ అండ్ స్నాక్ కంపెనీ ‘పెప్సీకో’కి భారత్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చిప్స్ తయారీ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన ఆలు వంగడంపై హక్కులు పూర్తిగా పెప్సీకో సొంతం మాత్రమే కాదనే తీర్పు వెలువడింది. ఈ మేరకు పెప్సీకో పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ హక్కుల్ని రద్దు చేస్తూ.. మొక్కల రకాల పరిరక్షణ & రైతు హక్కుల అధికార సంఘం Protection of Plant Varieties and Farmers' Rights (PPVFR) Authority శుక్రవారం తీర్పు వెలువరించింది. లేస్ చిప్స్ తయారీకి ఉపయోగించే బంగాళదుంప వంగడంపై రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తమపేరిట ఉన్నందున పూర్తి హక్కులు తమవేనని, ఇతర రైతులెవరూ(ఒప్పంద పరిధిలో ఉన్నవాళ్లని మినహాయించి) వాటిని పండించడానికి వీల్లేదంటూ న్యూయార్క్‌కు చెందిన ఈ మల్టీనేషనల్ ఫుడ్ కంపెనీ మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. అయితే కేవలం పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తిగా రైతుల్ని నిలువరించడం కుదరని, అందుకు చట్టం సైతం అంగీకరించదంటూ PPVFR తీర్పు వెలువరించింది. ఈ మేరకు పెప్సీకో కంపెనీకి గతంలో జారీ అయిన పేటెంట్ హక్కుల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. ‘రైతుల విత్తన స్వేచ్ఛ’ను ఉల్లంఘించకుండా ఇతర విత్తన, ఆహార సంస్థలను కూడా నిలువరించాలని ఈ సందర్భంగా PPVFRను రైతుల తరపున పిటిషన్ దాఖలు చేసిన కవిత కురుగంటి కోరుతున్నారు. ఇక ఈ వ్యతిరేక పరిణామంపై స్పందించేందుకు పెప్సీకో కంపెనీ నిరాకరించింది. ఏంటీ వంగడం.. ఎఫ్ఎల్-2027 (FC5) వెరైటీ పొటాటోలు. వీటిని లేస్ పొటాటో చిప్స్‌గా పేర్కొంటారు. చిప్స్ తయారీలో ఉపయోగించే ఈ వంగడాల్ని 2009లో భారత్‌లోకి తీసుకొచ్చింది పెప్సీకో కంపెనీ. సుమారు 12 వేల మంది రైతులకు వీటి విత్తనాల్ని అందించి.. తిరిగి దుంపల్ని చేజిక్కిచ్చుకునేలా ఒప్పందం ఆ సమయంలో కుదుర్చుకుంది. అంతేకాదు 2016లో ఈ వెరైటీ వంగడం మీద.. ‘పీపీవీ అండ్ ఎఫ్ఆర్ చట్టం 2001’ ప్రకారం అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2019లో తమ హక్కులకు భంగం కలిగిందంటూ పెప్సీకో కంపెనీ దావా వేయడం ద్వారా ఈ వంగడం గురించి బయటి ప్రపంచానికి బాగా తెలిసింది. తమ ఒప్పందం పరిధిలోని లేని తొమ్మిది మంది గుజరాత్ రైతులు ఈ వంగడం పండిస్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అందులో నలుగురు చిన్న రైతులపై 4.2 కోట్ల రూ.కు దావా వేసింది పెప్సీకో కంపెనీ. అయితే సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంలో కలగజేసుకుంది. దీంతో అదే ఏడాది మే నెలలో పెప్సీకో కంపెనీ కేసులు మొత్తం వెనక్కి తీసుకుంది. ఆ వెంటనే రైతు ఉద్యమకారిణి కవితా కురుగంటి.. పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రద్దు చేయాలంటూ PPVFR ముందు ఒక అభ్యర్థన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న పీపీవీఎఫ్‌ఆర్.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పెప్సీకో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రద్దు చేసింది. ‘‘అనేక మంది రైతులు కష్టాల్లో కూరుకుపోయారు, వారు చేస్తున్న ఉద్దేశ్య ఉల్లంఘనపై భారీ జరిమానా చెల్లించే అవకాశం ఉంది! ఇది కచ్చితంగా ప్రజా ప్రయోజనాలను ఉల్లంఘించడమే అవుతుంది’’ అన్న కవిత వాదనలతో పీపీవీఎఫ్‌ఆర్ ఏకీభవించింది. ‘రిజిస్ట్రేటర్లు తమ హక్కులు తెలుసుకోవాలి అలాగే రైతులనూ ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి వ్యవహారాల్లో హక్కులపై పరిమితులు ఉంటాయే తప్ప.. పూర్తి హక్కులుండవని చట్టంలో ఉంది. సీడ్ వెరైటీల మీద పేటెంట్లను చట్టం ఈ స్థాయిలో అనుమతించబోద’న్న విషయాన్ని గుర్తు చేశారు పీపీవీఎఫ్‌ఆర్ చైర్పర్సన్ కేవీ ప్రభు. చదవండి: బతుకు రోడ్డు పాలు.. జేబులో చిల్లిగవ్వ లేకున్నా కోటీశ్వరుడయ్యాడు -
చిప్స్ కొంటే..ఉచిత డేటా : ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ తన వినియోగదారులకు ఆకట్టుకునేందుకు, ఉచిత ఇంటర్నెట్ డేటాను అందించేలా కొత్త మార్గాలతో వస్తోంది. తాజాగా లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ తదితర చిరుతిండి ప్యాకెట్లు కొంటే ఉచితంగా డేటాను అందిస్తోంది. 10 రూపాయల ప్యాకెట్‌తో 1 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది లేస్ చిప్స్, కుర్ కురే, అంకుల్ చిప్స్ డోరిటో ఇతర తినదగిన వస్తువుల ప్యాకెట్ కొనుగోలు చేసిన ప్రతిసారీ వారికి ఉచిత ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. ఈ ఉచిత ఇంటర్నెట్ డేటాను పొందాలంటే ప్యాకెట్ వెనుక భాగంలో ఉన్న ఉచిత రీఛార్జ్ కోడ్ కోసం వెతకాలి. ఆతరువాత ఈ కోడ్‌ను ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్లోడ్ చేసి,ఆపై మైకూపన్‌ల విభాగంలో నమోదు చేయాలి. అంటే ఎయిర్టెల్ వినియోగదారులు చిప్స్ కొనుగోలు చేసినప్పుడు, ప్యాకెట్ తో పాటు కూపన్‌ను తీసుకోవడం మర్చిపోకూడదు. 10 రూపాయల విలువైన చిప్స్ కొనుగోలు చేస్తే, ఒక జీబీ ఉచితం. అదే 20 రూపాయలు కొనుగోలు చేస్తే, 2 జీబీ ఉచిత ఇంటర్నెట్ డేటా లభిస్తుంది. అయితే రీడీమ్ చేసిన తేదీ నుండి మూడు రోజులు మాత్రమే ఈ ఉచిత డేటా చెల్లుతుంది. వినియోగదారులకు ఉత్తమ నెట్వర్క్ అనుభవాన్ని అందించేందుకు పెప్సికో ఇండియాతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పోకడలను సరిపోలే కొత్త వ్యూహాలను తాము అభివృద్ధి చేస్తామనీ, ఇందులో భాగంగానే ఎయిర్టెల్ తో భాగస్వామ్యం అని పెప్సికో ఇండియా సీనియర్ డైరెక్టర్ కేటగిరీ హెడ్ ఫుడ్స్ దిలేన్ గాంధీ తెలిపారు. వినియోగదారులు డిజిటల్ కంటెంట్ చూస్తూ, తమ ఉత్పత్తులను ఎంజాయ్ చేస్తారన్నారు. -
దిగొచ్చిన పెప్సీకో.. కేసులు వాపస్
గాంధీనగర్ : శీతల పానీయాల దిగ్గజం పెప్సీకో ఇండియా దిగొచ్చింది. గుజరాత్ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. తమ కంపెనీ పేరుతో భారత్‌లో రిజస్టర్ అయిన బంగాళాదుంపను తన అనుమతి లేకుండా పండిచారనే నేపంతో పెప్సీకో కంపెనీ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దాంతో ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో కంపెనీ దిగొచ్చింది. రైతుల మీద పెట్టిన కేసులను వాపస్ తీసుకుంటున్నట్లు కంపెని అధికార ప్రతినిధి ప్రకటించారు. ‘ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మా కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది’ అని సదరు అధికారి తెలిపారు. ఈ వివాదం ఈ ఏడాది ఏప్రిల్‌లో తెరమీదకొచ్చింది. తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ పెప్సీకో రైతుల మీద కేసులు పెట్టడమే కాక.. వారి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ అహ్మదాబాద్ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై కోర్టు కూడా… సానుకూలంగా స్పందించింది. రైతులు ఆ పంటను పండించడంపై స్టే విధించింది. అంతేకాక తమ అనుమతి లేకుండా ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను పండించినందుకు గాను రూ. కోటి జరిమానా చెల్లించాలంటూ పెప్సీకో.. రైతులను డిమాండ్ చేసింది. -
‘ఆలూ పండిస్తారా.. రూ. కోటి ఫైన్ కట్టండి’
గాంధీనగర్ : గంజాయి లాంటి పంట పండిస్తే నేరం కానీ.. బంగాళాదుంపలను పండిస్తే కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగకపోయినా మన దేశంలో మాత్రం జరుగుతాయి. ఎందుకంటే మన ప్రజా ప్రభుత్వాలకు.. కార్పొరేట్ కంపెనీలంటేనే మక్కువ ఎక్కువ. వాటి కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములను లాక్కుంటాయి.. అవసరమైతే నోటి కాడి కూడును కూడా లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు వడ్డిస్తాయి. ఈ విషయంలో అన్ని పార్టీలది ఒకటే విధానం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో చోటు చేసుకుంది. పెప్సీకో కంపెనీ బంగాళాదుంపలు పండిస్తున్నందుకు అక్కడి రైతుల మీద కేసులు పెట్టింది. ఆ వివరాలు.. అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసు పెట్టింది. లేస్ చిప్స్ తయారు చేయడం కోసం తాము వినియోగించే ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను భారత్‌లో తామే రిజిస్టర్ చేయించామని పెప్సీకో పేర్కొంది. కానీ గుజరాత్‌కు చెందిన రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం ఆలూని పండించారంటూ వారిపై కేసులు నమోదు చేసింది. పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామజిక కార్యకర్తలు, రైతులు పెప్సీకో చర్యలను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో 200 మందికి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. సదరు కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సామజిక కార్యకర్త ఈ విషయంపై స్పందిస్తూ.."పెప్సీకో కంపెనీ సాబర్కాంఠాలో 9 మంది రైతులపై కేసులు పెట్టింది. నలుగురు రైతుల మీద కోటి రూపాయల దావా.. మరో ఐదుగురి మీద రూ. 20 లక్షల దావా వేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి పెప్సీకో అధికారులు మాట్లాడుతూ.. ‘పెప్సీకో కంపెనీ సహకార వ్యవసాయ కార్యక్రమంలో వేల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వారికి మాత్రమే ఈ రకం బంగాళాదుంపలను పండించేందుకు అనుమతిచ్చాం. సదరు రైతులు పండించిన పంటను కూడా మేమే కొంటా. అలాంటిది ఇప్పుడు బయటి వారు కూడా ఇదే రకం బంగాళాదుంపలను పండిస్తే.. సహకార వ్యవసాయ కార్యక్రమంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది. వారి ప్రయోజనాలను కాపడటం కోసమే కోర్టును ఆశ్రయించాం’ అని పెప్సీకో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో సదరు కంపెనీ కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నలుగురు రైతులతో సెటిల్మెంట్ కుదుర్చుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం సదరు రైతులు పండించిన పంటను కంపెనీకే అమ్మాలి.. లేదా అసలు ఈ బంగాళాదుంపలను పండిచడమే మానుకోవాలంటూ షరతులు విధించింది. పెప్సీకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016 ఫిబ్రవరి 1న ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంప విత్తనాలను సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేసింది. దాని ప్రొటెక్షన్ పిరియడ్ జనవరి 31, 2031 వరకూ ఉన్నట్లు పెప్సీకో అధికారులు తెలిపారు. -
ఇంటిప్స్
వంకాయ, అరటికాయ ముక్కలు కోయగానే నల్లబడిపోతాయి. అలా అవ్వకూడదంటే వాటిని వేసిన నీటిలో చెంచాడు పాలు కలపాలి.వానాకాలంలో బట్టలకు తరచూ బురద మరకలవుతుంటాయి. అవి పోవాలంటే వాటిని కాసేపు బంగాళా దుంపలు ఉడికించిన నీటిలో నానబెట్టి ఉతకాలి. వేయించిన అప్పడాలు, వడియాల వంటివి త్వరగా మెత్తబడకుండా ఉండాలంటే వాటిని ఉంచిన డబ్బా అడుగున కాస్త ఇంగువ చల్లాలి.క్యాబేజీ ఉడికించేటప్పుడు పచ్చివాసన వ్యాపించకుండా ఉండాలంటే అందులో చిన్న బ్రెడ్ ముక్కను వేస్తే సరి. పట్టుచీరలు ఉతికేటప్పుడు నీటిలో కాస్త నిమ్మరసం కలిపితే రంగులు వదలవు. పైగా జరీ అందంగా మెరుస్తుంది. -
డబుల్ బెడ్రూం ఇళ్ళకు KTR శంకుస్థాపన