అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 75 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించిన మెస్సీ అరంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు అదనపు సమయంలో ఇంటర్ మియామి క్లబ్‌కు గోల్ అందించి 2-1 తేడాతో గెలవడంలో కీలకపాత్ర వహించాడు. కాగా మెస్సీకి ఇది 808వ గోల్ కావడం విశేషం. ఇక ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్లను G.O.A.Tగా అభివర్ణిస్తుంటారు.
ఈ సందర్భంగా మెస్సీపై అభిమానంతో GOAT అనే పదాన్ని చిప్స్(తినేవి) తయారు చేసే లేస్(Lays Chips) కంపెనీ మెస్సీ గోల్‌ను వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసింది. మెస్సీ తన కెరీర్లో 808వ గోల్ చేసిన తర్వాత అవే 808 మేకలతో మెస్సీ రూపం వచ్చేలో ఓ అద్భుతమైన ఫొటోను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 808 మేకలతో మెస్సీ రూపాన్ని క్రియేట్ చేసింది.
మెస్సీకి ట్రిబ్యూట్ అందిస్తూనే లేస్ తన చిప్స్ యాడ్‌ను రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)కు అర్థం వచ్చేలా.. మేకలతో ట్రిబ్యూట్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోలో 808 మేకలను సరిగ్గా మెస్సీ ముఖం వచ్చేలా నిల్చోబెట్టారు. పైన యాంగిల్ నుంచి చూస్తే మెస్సీ ముఖం స్పష్టంగా కనిస్తోంది.
+1 🐐 for the 808th goal for the G.O.A.T #Messi #GoatsForGoals pic.twitter.com/LUviACWR4p
— LAY'S (@LAYS) July 22, 2023
చదవండి: Cricketer Minnu Mani: భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం..
Comments
Please login to add a commentAdd a comment