Argentina star Messi
-
'మెస్సీని చూసేందుకు 808 మేకలు'.. అద్బుతాన్ని చూసి తీరాల్సిందే
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవలే ఇంటర్ మియామి క్లబ్ తరపున తొలి గోల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 75 గజాల దూరం నుంచి బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించిన మెస్సీ అరంగేట్రం మ్యాచ్‌లో ఫ్రీకిక్‌ను గోల్‌గా మలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అంతేకాదు అదనపు సమయంలో ఇంటర్ మియామి క్లబ్‌కు గోల్ అందించి 2-1 తేడాతో గెలవడంలో కీలకపాత్ర వహించాడు. కాగా మెస్సీకి ఇది 808వ గోల్ కావడం విశేషం. ఇక ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ ప్లేయర్లను G.O.A.Tగా అభివర్ణిస్తుంటారు. ఈ సందర్భంగా మెస్సీపై అభిమానంతో GOAT అనే పదాన్ని చిప్స్(తినేవి) తయారు చేసే లేస్(Lays Chips) కంపెనీ మెస్సీ గోల్‌ను వినూత్నరీతిలో సెలబ్రేట్ చేసింది. మెస్సీ తన కెరీర్లో 808వ గోల్ చేసిన తర్వాత అవే 808 మేకలతో మెస్సీ రూపం వచ్చేలో ఓ అద్భుతమైన ఫొటోను క్రియేట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న 808 మేకలతో మెస్సీ రూపాన్ని క్రియేట్ చేసింది. మెస్సీకి ట్రిబ్యూట్ అందిస్తూనే లేస్ తన చిప్స్ యాడ్‌ను రూపొందించింది. ఇందులో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (G.O.A.T)కు అర్థం వచ్చేలా.. మేకలతో ట్రిబ్యూట్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోలో 808 మేకలను సరిగ్గా మెస్సీ ముఖం వచ్చేలా నిల్చోబెట్టారు. పైన యాంగిల్ నుంచి చూస్తే మెస్సీ ముఖం స్పష్టంగా కనిస్తోంది. +1 🐐 for the 808th goal for the G.O.A.T #Messi #GoatsForGoals pic.twitter.com/LUviACWR4p — LAY'S (@LAYS) July 22, 2023 చదవండి: Cricketer Minnu Mani: భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం.. కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. -
అర్జెంటీనా సారథి మెస్సీ అందమైన కుటుంబం (ఫొటోలు)
-
FIFA WC: ఫుట్‌బాల్ రారాజు ఎవరో.. మెస్సీ మ్యాజిక్ చేస్తాడా?
ఫిఫా ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. తొలి సెమీఫైనల్లో క్రోయోషియాను ఓడించి అర్జెంటీనా ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ చివరి పోరుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో.. గోల్డెన్ బూట్ అవార్డు రేసు ఆసక్తికరంగా మారింది. గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి ఇస్తారు? ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డును 1982 వరల్డ్‌కప్ నుంచి ఇవ్వడం ప్రారంభించారు. తొలుత ఈ అవార్డును గోల్డెన్ షూగా పిలిచేవారు. అయితే 2010లో దీన్ని గోల్డెన్ బూట్ అవార్డుగా మార్చారు. ఫుట్‌బాల్ రారాజు ఎవరో? ప్రస్తుత ప్రపంచకప్ గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ, ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ ఎంబాపె చెరో 5 గోల్స్‌తో సమంగా ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫుట్‌బాల్ రారాజు ఎవరో తేలిపోనుంది. అయితే వీరికి ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాడు ఒలివర్ గిరౌడ్, అర్జెంటీనా ప్లేయర్ జూలియన్ అల్వారెజ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురుయ్యే అవకాశం ఉంది. గోల్డన్ బూట్ పోటీలో వీరిద్దరూ కూడా చెరో 4 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు. గోల్డెన్ బూట్ టైబ్రేకర్స్ అంటే? ఫైనల్ ముగిసే సమయానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు అత్యధిక గోల్స్‌తో సమంగా నిలిస్తే దాన్ని గోల్డెన్ బూట్ టైబ్రేకర్స్ అంటారు. ఈ సమయంలో ఎవరైతే అత్యధిక అసిస్ట్‌లు, తక్కువ నిమిషాలు ఆడి ఉంటారో వారిని విజేతగా నిర్ణయిస్తారు. గోల్ చేసే స్కోరర్‌కు బంతిని పాస్ చేయడం లేదా క్రాస్ చేయడం చేస్తే ఆటగాడి ఖాతాలో అసిస్ట్ చేరుతుంది. కాగా అసిస్ట్‌ల ప్రకారం అయితే 3 అసిస్ట్‌లతో మెస్సీ ముందంజలో ఉండగా.. మబప్పే రెండు అసిస్ట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక నిమిషాల ప్రకారం అయితే ఎంబాపె (477).. మెస్సీ (570) కంటే ముందు ఉన్నాడు. గోల్డెన్ బాల్ రేసులో.. ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు లభిస్తుంది. ఈ పోటీలో లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాపె , లుకా మోడ్రిక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం -
పీలే సరసన మెస్సీ
మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయనెల్ మెస్సీ మరో మైలురాయిని చేరుకున్నాడు. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే నెలకొల్పిన ఆల్‌టైమ్ క్లబ్ గోల్స్ రికార్డును సమం చేశాడు. బార్సిలోనా క్లబ్ తరఫున బరిలోకి దిగిన మెస్సీ స్పెయిన్ లీగ్ లా లిగా టోర్నీలో భాగంగా వాలెన్సియాతో జరిగిన మ్యాచ్‌లో గోల్ చేశాడు. దీంతో పీలే పేరిట ఉన్న 643 గోల్స్ రికార్డును మెస్సీ సమం చేశాడు. పీలే 1957 నుంచి 1974 వరకు సాంటోస్ క్లబ్‌కు ఆడి ఈ రికార్డు గోల్స్ చేశాడు. కాగా మెస్సీ 2004లో బార్సిలోనా జట్టులో చేరాడు. అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్న మెస్సీ తాజాగా పీలే మైలురాయిని చేరుకున్నాడు. స్పానిష్ లీగ్‌లోనే యూరోప్‌లో జరిగే టోర్నీల్లో కూడా మెస్సీ ప్రదర్శన నిలకడగా ఉంటుంది. 2018లో 366వ గోల్‌తో యూరోప్‌లోని మేటి లీగ్‌లలో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఘనత వహించాడు. ఈ క్రమంలో గెర్డ్ ముల్లర్ (జర్మనీ–365 గోల్స్) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ముల్లర్ పేరిట ఉన్న మరో రికార్డును మెస్సీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక గోల్స్ చేసిన ముల్లర్ (86 గోల్స్) రికార్డు కూడా ఇప్పుడు మెస్సీ పేరిటే ఉంది. 2012లో మెస్సీ 91 గోల్స్‌తో ముల్లర్ రికార్డును అధిగమించాడు. తన గోల్స్ మార్కును చేరుకొని తన సరసన నిలిచిన మెస్సీని బ్రెజిల్ జగది్వఖ్యాత పీలే అభినందనలతో ముంచెత్తాడు. -
పిచ్చి అభిమానంతో...
సాక్షి, తిరువనంతపురం: అభిమానం శృతి మించి విచక్షణ కోల్పోతే.. అది విపరీత అనర్థాలకు దారితీస్తుంది. కేరళలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వీరాభిమాని సూసైడ్ పాల్పడుతున్నట్లు లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, సెర్చ్ ఆపరేషన్‌తో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. కొట్టాయం జిల్లా అర్మనూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల డీనూ అలెక్స్ ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. మెస్సీకి డీనూ వీరాభిమాని. గురువారం రాత్రి జరిగిన అర్జెంటీనా-క్రోయేషియా మ్యాచ్‌ను తిలకించాడు. మ్యాచ్‌లో 3-0 తేడాతో అర్జెంటీనా ఘోర పరాభవం చెందింది. దీంతో మనస్థాపం చెందిన డీనూ... ‘నా ఫెవరెట్ టీం ఓడింది. మెస్సీ దారుణంగా నిరుత్సాహపరిచాడు. నాకు ఈ ప్రపంచంలో చూసేందుకు ఇంకా ఏం మిగల్లేదు. చావటానికి వెళ్తున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ’ అంటూ మళయాళంలో ఓ లేఖ రాసి పెట్టి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం నుంచి తమ కుమారుడు కనిపించకుండా పోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీనూ గదిలో అర్జెంటీనా జెర్సీ, పుస్తకాల్లో, గోడల మీద మెస్సీ ఫోటోలు, అభిమాన రాతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్ సాయంతో ఆ చుట్టుపక్కల గాలింపు చేట్టారు. అయితే వర్షాలతో సెర్చ్ ఆపరేషన్‌కు విఘాతం ఏర్పడుతోంది. బహుశా మీనాచిల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండియాలో ఫిఫా ఫీవర్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేరళ ముందు వరుసలో ఉంటుంది. -
మెస్సీ వచ్చే.. గోల్ కొట్టే
మెండోజా (అర్జెంటీనా): అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుని తిరిగి అభిమానుల కోరిక మేరకు నిర్ణయాన్ని మార్చుకున్న అర్జెంటీనా స్టార్ మెస్సీ... పునరాగమనం చేసిన తొలి మ్యాచ్‌లోనే తన మ్యాజిక్ చూపించాడు. దీంతో 2018 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ లో భాగంగా ఉరుగ్వేతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో నెగ్గింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగుస్తుందనగా 42వ నిమిషంలో మెస్సీ తక్కువ ఎత్తులో ఆడిన షాట్... జోస్ గిమెనెజ్ (ఉరుగ్వే)ను తాకుతూ గోల్‌పోస్టులోకి వెళ్లడంతో అర్జెంటీనా ఆధిక్యం సాధించింది. అయితే కొద్దిసేపటికే పాలో డిబాలా రెండో ఎల్లో కార్డ్‌కు గురవ్వడంతో ద్వితీయార్ధం అర్జెంటీనా 10 మందితోనే ఆడినా మ్యాచ్‌లో విజయం సాధించింది.