ఫిఫా ప్రపంచకప్-2022 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్ పోరులో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యాయి. తొలి సెమీఫైనల్లో క్రోయోషియాను ఓడించి అర్జెంటీనా ఫైనల్లో అడుగుపెట్టగా.. రెండో సెమీఫైనల్లో మొరాకోను చిత్తు చేసిన ఫ్రాన్స్ చివరి పోరుకు సిద్దమైంది. ఈ నేపథ్యంలో.. గోల్డెన్ బూట్ అవార్డు రేసు ఆసక్తికరంగా మారింది.
గోల్డెన్ బూట్ అవార్డు ఎవరికి ఇస్తారు?
ఫిఫా ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. ఈ అవార్డును 1982 వరల్డ్‌కప్ నుంచి ఇవ్వడం ప్రారంభించారు. తొలుత ఈ అవార్డును గోల్డెన్ షూగా పిలిచేవారు. అయితే 2010లో దీన్ని గోల్డెన్ బూట్ అవార్డుగా మార్చారు.
ఫుట్‌బాల్ రారాజు ఎవరో?
ప్రస్తుత ప్రపంచకప్ గోల్డెన్ బూట్ రేసులో అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ, ఫ్రాన్స్ యువ సంచలనం కైలియన్ ఎంబాపె చెరో 5 గోల్స్‌తో సమంగా ముందంజలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం జరగనున్న ఫైనల్లో ఫుట్‌బాల్ రారాజు ఎవరో తేలిపోనుంది. అయితే వీరికి ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాడు ఒలివర్ గిరౌడ్, అర్జెంటీనా ప్లేయర్ జూలియన్ అల్వారెజ్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురుయ్యే అవకాశం ఉంది. గోల్డన్ బూట్ పోటీలో వీరిద్దరూ కూడా చెరో 4 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నారు.
గోల్డెన్ బూట్ టైబ్రేకర్స్ అంటే?
ఫైనల్ ముగిసే సమయానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆటగాళ్లు అత్యధిక గోల్స్‌తో సమంగా నిలిస్తే దాన్ని గోల్డెన్ బూట్ టైబ్రేకర్స్ అంటారు. ఈ సమయంలో ఎవరైతే అత్యధిక అసిస్ట్‌లు, తక్కువ నిమిషాలు ఆడి ఉంటారో వారిని విజేతగా నిర్ణయిస్తారు.
గోల్ చేసే స్కోరర్‌కు బంతిని పాస్ చేయడం లేదా క్రాస్ చేయడం చేస్తే ఆటగాడి ఖాతాలో అసిస్ట్ చేరుతుంది. కాగా అసిస్ట్‌ల ప్రకారం అయితే 3 అసిస్ట్‌లతో మెస్సీ ముందంజలో ఉండగా.. మబప్పే రెండు అసిస్ట్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక నిమిషాల ప్రకారం అయితే ఎంబాపె (477).. మెస్సీ (570) కంటే ముందు ఉన్నాడు.
గోల్డెన్ బాల్ రేసులో..
ఫిఫా ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి గోల్డెన్ బాల్ అవార్డు లభిస్తుంది. ఈ పోటీలో లియోనెల్ మెస్సీ, కైలియన్ ఎంబాపె , లుకా మోడ్రిక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment