మెస్సీ వచ్చే.. గోల్ కొట్టే | Messi helps Argentina overcome Uruguay and top qualifying group | Sakshi
Sakshi News home page

మెస్సీ వచ్చే.. గోల్ కొట్టే

Published Sat, Sep 3 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

మెస్సీకి పాదాభివందనం చేస్తున్న అభిమాని

మెస్సీకి పాదాభివందనం చేస్తున్న అభిమాని

మెండోజా (అర్జెంటీనా): అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకుని తిరిగి అభిమానుల కోరిక మేరకు నిర్ణయాన్ని మార్చుకున్న అర్జెంటీనా స్టార్ మెస్సీ... పునరాగమనం చేసిన తొలి మ్యాచ్‌లోనే తన మ్యాజిక్ చూపించాడు.  దీంతో 2018 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ లో భాగంగా ఉరుగ్వేతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0తో నెగ్గింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగుస్తుందనగా 42వ నిమిషంలో మెస్సీ తక్కువ ఎత్తులో ఆడిన షాట్... జోస్ గిమెనెజ్ (ఉరుగ్వే)ను తాకుతూ గోల్‌పోస్టులోకి వెళ్లడంతో అర్జెంటీనా ఆధిక్యం సాధించింది. అయితే కొద్దిసేపటికే పాలో డిబాలా రెండో ఎల్లో కార్డ్‌కు గురవ్వడంతో ద్వితీయార్ధం అర్జెంటీనా 10 మందితోనే ఆడినా మ్యాచ్‌లో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement