ఇంటిప్స్
వంకాయ, అరటికాయ ముక్కలు కోయగానే నల్లబడిపోతాయి. అలా అవ్వకూడదంటే వాటిని వేసిన నీటిలో చెంచాడు పాలు కలపాలి.వానాకాలంలో బట్టలకు తరచూ బురద మరకలవుతుంటాయి. అవి పోవాలంటే వాటిని కాసేపు బంగాళా దుంపలు ఉడికించిన నీటిలో నానబెట్టి ఉతకాలి.
వేయించిన అప్పడాలు, వడియాల వంటివి త్వరగా మెత్తబడకుండా ఉండాలంటే వాటిని ఉంచిన డబ్బా అడుగున కాస్త ఇంగువ చల్లాలి.క్యాబేజీ ఉడికించేటప్పుడు పచ్చివాసన వ్యాపించకుండా ఉండాలంటే అందులో చిన్న బ్రెడ్ ముక్కను వేస్తే సరి. పట్టుచీరలు ఉతికేటప్పుడు నీటిలో కాస్త నిమ్మరసం కలిపితే రంగులు వదలవు. పైగా జరీ అందంగా మెరుస్తుంది.