saries
-
రిలయన్స్ చీరలు కూడా వచ్చేస్తున్నాయ్...
సంప్రదాయ దుస్తులు, చీరల విభాగంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ (ఏబీఎఫ్ఆర్ఎల్), టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్ తదితర సంస్థలకు పోటీగా రిలయన్స్ రిటైల్ కూడా రంగంలోకి దిగుతోంది. కొత్తగా అవంత్రా పేరిట స్టోర్స్ చెయిన్‌ను ప్రారంభించనుంది. ప్రైవేట్ లేబుల్స్‌ను విక్రయించడంతో పాటు ప్రాంతీయంగా వీవర్ క్లస్టర్లతో పాటు నల్లి సిల్క్స్ .. పోతీస్ వంటి థర్డ్ పార్టీ బ్రాండ్లతో కూడా అవంత్రా జట్టుకట్టనుంది. ఆభరణాలు, యాక్సెసరీలు, టైలరింగ్ సరీ్వసులు కూడా అందించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలి స్టోరు బెంగళూరులో ఏర్పాటవుతుందని, ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించవచ్చని వివరించాయి. ఆభరణాల బ్రాండ్ అయిన తనిష్క్ సంప్రదాయ దుస్తుల్లోకి అడుగుపెట్టడం, ఏబీఎఫ్ఆర్ఎల్ కూడా సవ్యసాచి, తరుణ్ తహిలియాని వంటి దేశీ డిజైనర్ వేర్ బ్రాండ్స్‌లో వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో రిలయన్స్ అవంత్రా స్టోర్స్ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. -
చీరలు ఉచితం..మెడలోని బంగారం మాయం!
కరీంనగర్‌క్రైం: చీరలు పంచుతున్నారంటూ ఓ వ్యక్తి కరీంనగర్‌లోని వేంకటేశ్వర ఆలయం వద్ద బుధవారం మహిళ నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అల్గునూర్‌కు చెందిన వేముల లత కొత్తపల్లిలోని తన కూతురు వద్దకు వెళ్తూ తన కొడుకు మోటార్‌సైకిల్ పై నుంచి వేంకటేశ్వరాలయం వద్ద దిగింది. ఆటో స్టాండ్ వద్దకు నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి చీరలు ఉచితంగా పంచుతున్నారని, మెడలో బంగారం ఉంటే ఇవ్వరని చెప్పాడు. కాగా, పుస్తెలతాడు పేపర్లో చుట్టి బ్యాగ్‌లో వేసుకోవాలని అన్నాడు. పుస్తెలతాడు చుట్టిన పేపరు తీసుకుని.. ఖాళీ పేపర్‌ను లతకు ఇచ్చాడు. చీరలు తీసుకొస్తానంటూ వెళ్లి తిరిగి రాకపోవడంతో బ్యాగ్ తెరిచి చూడగా పుస్తెలతాడు కనిపించలేదు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు.. -
పసుపు కుంకుమ చీరల పంపిణి
సాక్షి, చిత్తూరు: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు అడుగడుగునా ఎలక్షన్ కోడ్‌ను యాధేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కునేపల్లిలో గ్రామంలో పసుపు- కుంకుమ చీరళలు, జాకెట్లు ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు. దీనిని గమనించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు చీరలతో వెళుతున్న ఆటోను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. జిల్లాలో ఇంతా జరుగుతున్నా ప్రభుత్వ అధికారలు పటించుకొవడం లేదని, దీనిపై టీడీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకొవాలని పోలీసులకు పిర్యాదు చేసిన వైస్సార్సీపీ కార్యకర్తలు. టీడీపీ నేతలకు అండగా కానిస్టేబుల్ బాబు నాయుడు రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఒక అధికారిగా వాళ్లను అడ్డుకొవాల్సింది పోయి వారికి మద్దతుగా నిలవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నాయకుల తాయిలాలను పట్టించిన స్థానికులను బెదిరించిన బాబు నాయుడు తీరుకు నిరసన చేయడంతో మరింత రెచ్చిపోయిన బాబు నాయుడు. మీరు మర్యాదగా నిరసన విరమించకుంటే మీతో పాటు మీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి మీద కుడా కేసు పెట్టాల్సి వస్తుందని వైస్సార్సీపీ నాయకులు, స్థానికులు హెచ్చరించాడు. వారు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడి నుంచి చిన్నగా తప్పుకున్న బాబు నాయుడు. -
చీరల @ రూ.10.. ఎగబడ్డ మహిళలు.. తొక్కిసలాట
-
రూ.10కే చీర.. తొక్కిసలాట
సాక్షి, సిద్ధిపేట: ఆఫర్ల పేరుతో సిద్ధిపేట పట్టణంలో ఓ వస్త్ర దుకాణం మహిళల ప్రాణాల మీదకు తెచ్చింది. పది రూపాయలకే చీర అని ప్రకటించడంతో సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు మహిళలు భారీగా తరలివచ్చారు. సిద్ధిపేట చుట్టుపక్కల నుంచి కూడా మహిళలు తరలిరావడంతో వీరిని అదుపు చేయడం దుకాణం నిర్వాహకులకు కష్టంగా మారింది. చవక ధరలో లభ్యమయ్యే చీరలను దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మహిళలకు గాయాలయ్యాయి. కొంతమంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ మహిళ నుంచి దుండగులు 5 తులాల బంగారం చోరీ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, సరైన ఏర్పాట్లు చేయకుండా తమను ఇబ్బంది పెట్టిన షాపింగ్ మాల్ నిర్వాహకులపై మహిళలు మండిపడుతున్నారు. మీ వ్యాపారం కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కాలేజీకి చీరలోనే రావాలి
జైపూర్: రాజస్తాన్ ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను ప్రకటించింది. కాలేజీలో చదివే అమ్మాయిలు జీన్స్, టీ షర్ట్స్, లెగ్గిన్స్ లాంటి దుస్తులు ధరించి కాలేజీకి రావొద్దని ఓ ప్రకటనలో తెలిపింది. సంప్రదాయ దుస్తులు సల్వార్-కమీజ్, చీరలో మాత్రమే కాలేజీకి హాజరు కావాలని సూచించింది. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనరేట్ అన్ని ప్రభుత్వ కాలేజీలకు లేఖలు పంపింది. కళాశాలల ప్రిన్సిపాల్స్.. బాలుర, బాలి కల దుస్తుల రంగు (డ్రెస్ కోడ్ కలర్)ను నిర్ణయించి ఈ నెల 12నాటికి తుది నివేదికను పంపాలని పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నంత కాలం డ్రెస్ కోడ్ వర్తిస్తుంది. అయితే బోధనా సిబ్బందికి డ్రెస్ కోడ్‌పై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యార్థులు, టీచర్లు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది తిరోగమ చర్య అని, ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పి తమ హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ హిస్టరీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. ప్రపంచం ఒక అడుగు ముందుకు సాగితే, భారత్ రెండు అడుగులు వెనక్కి వేస్తోందంటూ అభిప్రాయపడ్డారు. కనోరియా కాలేజీకి చెందిన విద్యార్థిని అంజలీ మాట్లాడుతూ.. ‘మాకు ఇప్పుడే స్వేచ్ఛ ఉంటుంది. పెళ్లి తర్వాత మేము జీన్స్, టీ షర్ట్స్ ధరించే చాన్స్ ఉండకపోవచ్చు. అప్పుడు మాకు అంత ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు కూడా మా ఇష్టం వచ్చిన డ్రెస్ ధరించొద్దు అనడం విచారకరమని’ అన్నారు. మరో విద్యార్థిని మాట్లాడుతూ.. అబ్బాయిలను కుర్తా పైజామా వేసుకురావాలని ఎందుకు బలవంతం చేయడం లేదు? స్త్రీ, పురుషులు సమానం అనే ప్రభుత్వం స్త్రీలపై మాత్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. డ్రెస్ కోడ్‌కు వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ‘బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోంది. వీరు డాక్లర్లు, ఇంజనీర్లను కోరుకోవడం లేదు. బాబాలను తయారు చేయాలని చూస్తోంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవింద్ సింగ్ ఆరోపించారు. కాగా డ్రెస్ కోడ్ అమలును ప్రభుత్వం సమర్థించుకుంది. క్యాంపస్‌లో క్రమశిక్షణ పెంపొందించడం కోసమే డ్రెస్‌కోడ్ అమలు చేస్తున్నామని పేర్కొంది. కళాశాల ప్రిన్సిపల్, నిర్వాహకులు కాలేజీ సంఘాలతో చర్చలు జరిపి, వారు ఏకాభిప్రాయానికి వచ్చాకే డ్రెస్ కోడ్ అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. -
ఇంటిప్స్
వంకాయ, అరటికాయ ముక్కలు కోయగానే నల్లబడిపోతాయి. అలా అవ్వకూడదంటే వాటిని వేసిన నీటిలో చెంచాడు పాలు కలపాలి.వానాకాలంలో బట్టలకు తరచూ బురద మరకలవుతుంటాయి. అవి పోవాలంటే వాటిని కాసేపు బంగాళా దుంపలు ఉడికించిన నీటిలో నానబెట్టి ఉతకాలి. వేయించిన అప్పడాలు, వడియాల వంటివి త్వరగా మెత్తబడకుండా ఉండాలంటే వాటిని ఉంచిన డబ్బా అడుగున కాస్త ఇంగువ చల్లాలి.క్యాబేజీ ఉడికించేటప్పుడు పచ్చివాసన వ్యాపించకుండా ఉండాలంటే అందులో చిన్న బ్రెడ్ ముక్కను వేస్తే సరి. పట్టుచీరలు ఉతికేటప్పుడు నీటిలో కాస్త నిమ్మరసం కలిపితే రంగులు వదలవు. పైగా జరీ అందంగా మెరుస్తుంది. -
ఇరవై కోట్ల చీరలు అవసరం: మోదీ
వారణాసి: ఈ-కామర్స్ ను ఉపయోగించుకొని ప్రపంచ మార్కెట్ లో భారత్ ప్రధాన భూమిక పోషించాలని వ్యాపారస్తులకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మార్కెట్ కు సంబంధించి మాట్లాడిన మోదీ.. ఈ కామర్స్ మార్కెట్ లో భారత్ ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందన్నారు. " ఈ కామర్స్ మార్కెట్ లో సృజనాత్మకత, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. రాబోయే ఇరవై ఏళ్లలో 20 కోట్ల మంది యువతులు వివాహానికి సిద్ధమవుతారు. వాళ్లందరి కోసం ఇరవై కోట్ల చీరలు అవసరమవుతాయి. ఇంతటి పెద్ద మార్కెట్ మీ కోసం ఎదురుచూస్తోంది'' అని మోడీ వస్త్ర వ్యాపారులనుద్దేశించి వ్యాఖ్యానించారు. వ్యాపారులు ఉత్పత్తిలో నాణ్యతను పెంచి, మంచి డిజైన్లు రూపొందించి, మంచి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. వారణాసిలోని దాదాపు 40 వేల మంది ముస్లింలు దశాబ్దాలుగా వివిధ రకాల చేతివృత్తుల్లో ఉన్నారని ఆయన తెలిపారు.