
కరీంనగర్‌క్రైం: చీరలు పంచుతున్నారంటూ ఓ వ్యక్తి కరీంనగర్‌లోని వేంకటేశ్వర ఆలయం వద్ద బుధవారం మహిళ నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అల్గునూర్‌కు చెందిన వేముల లత కొత్తపల్లిలోని తన కూతురు వద్దకు వెళ్తూ తన కొడుకు మోటార్‌సైకిల్ పై నుంచి వేంకటేశ్వరాలయం వద్ద దిగింది. ఆటో స్టాండ్ వద్దకు నడిచి వెళ్తుండగా ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి చీరలు ఉచితంగా పంచుతున్నారని, మెడలో బంగారం ఉంటే ఇవ్వరని చెప్పాడు.
కాగా, పుస్తెలతాడు పేపర్‌లో చుట్టి బ్యాగ్‌లో వేసుకోవాలని అన్నాడు. పుస్తెలతాడు చుట్టిన పేపరు తీసుకుని.. ఖాళీ పేపర్‌ను లతకు ఇచ్చాడు. చీరలు తీసుకొస్తానంటూ వెళ్లి తిరిగి రాకపోవడంతో బ్యాగ్ తెరిచి చూడగా పుస్తెలతాడు కనిపించలేదు. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: పెళ్లైన మరుసటి రోజే షాకిచ్చిన వధువు..
Comments
Please login to add a commentAdd a comment