సాక్షి,హైదరాబాద్ : దళిత మహిళపై పోలీసుల దాడిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా? అని ప్రశ్నించారు. ‘ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అసలేం జరిగిందంటే
దాదాపు రెండు వారాల క్రితం షాద్‌నగర్ పట్టణంలో తాళం వేసి ఉన్న నాగేందర్ ఇంట్లో 20 తులాల బంగారం, 2 లక్షల నగదు చోరీకి గురైంది. చోరీకి గురైన నగలు తమ ఇంటి సమీపంలో ఉన్న ఓ మహిళ తీసిందేమోనన్న అనుమానం ఉందని నాగేందర్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జులై 24న షాద్‌నగర్ పట్టణంలోని రోజువారీ కూలీ, స్థానికంగా ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
అంతకంటే ముందు ఆమె భర్తని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్రహింసలకు గురి చేసి విడిచి పెట్టారు. ఆ తర్వాత బాధితురాల్ని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగంటల పాటు ఆమెను వేధించారు. చేయని దొంగతనాన్ని చేసినట్లు ఒప్పుకోవాలని షాద్‌నగర్ ఎస్సై (డిటెక్టివ్) రామిరెడ్డి బాధితురాలిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం మధ్యరాత్రి 2గంటల సమయంలో విడిచి పెట్టారు. తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
దళిత మహిళపై ఇంత దాష్టీకమా?
ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?
దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?
నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా..!
ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..!
కొడుకు ముందే చిత్ర… pic.twitter.com/d9ERDZnHJo— KTR (@KTRBRS) August 5, 2024
దళిత మహిళపై ఇంత దాష్టీకమా?
దళిత మహిళపై ఇంత దాష్టీకమా?.ఇదేనా ఇందిరమ్మ పాలన? ఇదేనా ప్రజాపాలన?. దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?.మహిళా అని కూడా చూడకుండా ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తారా?.నిక్కర్ తొడిగి, బూటు కాళ్లతో తన్నటమా!. ఇంత కర్కశత్వమా... సిగ్గు సిగ్గు..!.కొడుకు ముందే చిత్ర హింసలా?రక్షించాల్సిన పోలీసులతోనే రక్షణ లేని పరిస్థితా?. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో...మహిళలంటే ఇంత చిన్నచూపా..!.ఓ వైపు మహిళలపై అత్యాచారాలు, అవమానాలు మరోవైపు దాడులు, దాష్టీకాలు..!.యథా రాజా తథా ప్రజా అన్నట్లు ముఖ్యమంత్రే స్వయంగా ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. పోలీసులు మాత్రం మేమేమీ తక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆడబిడ్డలపై లాఠీఛార్జీలు, దాడులకు తెగబడుతున్నారు. ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment