ఇరవై కోట్ల చీరలు అవసరం: మోదీ | we need to 20 crores saries, narendra modi | Sakshi
Sakshi News home page

ఇరవై కోట్ల చీరలు అవసరం: మోదీ

Published Sun, Jan 25 2015 9:50 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఇరవై కోట్ల చీరలు అవసరం: మోదీ - Sakshi

ఇరవై కోట్ల చీరలు అవసరం: మోదీ

వారణాసి: ఈ-కామర్స్ ను ఉపయోగించుకొని ప్రపంచ మార్కెట్ లో భారత్ ప్రధాన భూమిక పోషించాలని వ్యాపారస్తులకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మార్కెట్ కు సంబంధించి మాట్లాడిన మోదీ.. ఈ కామర్స్ మార్కెట్ లో భారత్ ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందన్నారు. " ఈ కామర్స్ మార్కెట్ లో సృజనాత్మకత, టెక్నాలజీని ఉపయోగించుకోవాలి.  రాబోయే ఇరవై ఏళ్లలో 20 కోట్ల మంది యువతులు వివాహానికి సిద్ధమవుతారు. వాళ్లందరి కోసం ఇరవై కోట్ల చీరలు అవసరమవుతాయి. ఇంతటి పెద్ద మార్కెట్ మీ కోసం ఎదురుచూస్తోంది'' అని మోడీ వస్త్ర వ్యాపారులనుద్దేశించి వ్యాఖ్యానించారు.

 

వ్యాపారులు ఉత్పత్తిలో నాణ్యతను పెంచి, మంచి డిజైన్లు రూపొందించి, మంచి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. వారణాసిలోని దాదాపు 40 వేల మంది ముస్లింలు దశాబ్దాలుగా వివిధ రకాల చేతివృత్తుల్లో ఉన్నారని ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement