సాక్షి, చిత్తూరు: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశ్యంతో టీడీపీ నేతలు అడుగడుగునా ఎలక్షన్ కోడ్‌ను యాధేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం కునేపల్లిలో గ్రామంలో పసుపు- కుంకుమ చీరళలు, జాకెట్లు ఓటర్లకు పంపిణీ చేసేందుకు తీసుకెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు.
దీనిని గమనించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు చీరలతో వెళుతున్న ఆటోను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. జిల్లాలో ఇంతా జరుగుతున్నా ప్రభుత్వ అధికారలు పటించుకొవడం లేదని, దీనిపై టీడీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకొవాలని పోలీసులకు పిర్యాదు చేసిన వైస్సార్‌సీపీ కార్యకర్తలు.
టీడీపీ నేతలకు అండగా కానిస్టేబుల్ బాబు నాయుడు
రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఒక అధికారిగా వాళ్లను అడ్డుకొవాల్సింది పోయి వారికి మద్దతుగా నిలవడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నాయకుల తాయిలాలను పట్టించిన స్థానికులను బెదిరించిన బాబు నాయుడు తీరుకు నిరసన చేయడంతో మరింత రెచ్చిపోయిన బాబు నాయుడు. మీరు మర్యాదగా నిరసన విరమించకుంటే మీతో పాటు మీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్‌రెడ్డి మీద కుడా కేసు పెట్టాల్సి వస్తుందని వైస్సార్‌సీపీ నాయకులు, స్థానికులు హెచ్చరించాడు. వారు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడి నుంచి చిన్నగా తప్పుకున్న బాబు నాయుడు.
Comments
Please login to add a commentAdd a comment