Woman Getting Her Face Shaved In Salon; Video Goes Viral - Sakshi
Sakshi News home page

Woman Shaving Video: నిజమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం.. సెలూన్‌లో అమ్మాయి షేవింగ్‌

Aug 10 2023 11:56 AM | Updated on Aug 10 2023 12:58 PM

Woman Getting Her Face Shaved In Salon Video Goes Viral - Sakshi

బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. కలియుగంలో వింతలు, విచిత్రాలు జరగుతాయని. అందుకు తగ్గట్లే సోషల్‌ మీడియా వచ్చాక అవన్నీ నిజమనే సంఘనటలు చాలానే జరిగాయి. తాజాగా మరో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ఇదేం విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వింతలు చూస్తామనుకోలేదు అంటూ షాక్‌ అవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?ఆ వింతైన సంఘటన ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా అబ్బాయిలు షేవింగ్‌ కోసం సెలూన్‌కి వెళ్తుంటారు. కానీ తాజాగా ఓ అమ్మాయి సెలూన్‌కి వెళ్లి షేర్‌ చేయించుకుంది. బార్బర్‌ ఆమె ముఖం మీద షేవింగ్‌ క్రీమ్‌ రాసి అబ్బాయిలకు చేసినట్లే షేవింగ్‌ చేశాడు. దీనికోసం మగవాళ్లకు వాడే బ్లేడ్‌నే ఉపయోగించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. 5జీ కదా.. అన్నీ మరుతుంటాయి.

మహిళలు కూడా అన్నింట్లో సమానమే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు? ఆమె నిజంగా అమ్మాయేనా అంటూ విస్మయం చెందుతున్నారు. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఇలాంటి వింతలు జరుగుతాయని ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటూ స్పందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ అమ్మాయి షేవింగ్‌ చేసుకున్న వీడియో ఒకటి టిక్‌టాక్‌లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

రోజూ షేవింగ్‌ చేయడం చర్మానికి మంచిదని, దీనివల్ల మృణకణాలు తొలిగిపోయి, చర్మం మరింత మృదువుగా, సహజసిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. షేవింగ్‌ వల్ల ఎలాంటి హానీ జరగదని, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని షేవింగ్‌ వెనుక తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement