shave
-
ఇదేం పోయేకాలం.. సెలూన్లో షేవింగ్ చేయించుకున్న మహిళ
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. కలియుగంలో వింతలు, విచిత్రాలు జరగుతాయని. అందుకు తగ్గట్లే సోషల్ మీడియా వచ్చాక అవన్నీ నిజమనే సంఘనటలు చాలానే జరిగాయి. తాజాగా మరో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ఇదేం విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వింతలు చూస్తామనుకోలేదు అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?ఆ వింతైన సంఘటన ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అబ్బాయిలు షేవింగ్ కోసం సెలూన్‌కి వెళ్తుంటారు. కానీ తాజాగా ఓ అమ్మాయి సెలూన్‌కి వెళ్లి షేర్ చేయించుకుంది. బార్బర్ ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి అబ్బాయిలకు చేసినట్లే షేవింగ్ చేశాడు. దీనికోసం మగవాళ్లకు వాడే బ్లేడ్‌నే ఉపయోగించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. 5జీ కదా.. అన్నీ మరుతుంటాయి. మహిళలు కూడా అన్నింట్లో సమానమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు? ఆమె నిజంగా అమ్మాయేనా అంటూ విస్మయం చెందుతున్నారు. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఇలాంటి వింతలు జరుగుతాయని ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటూ స్పందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ అమ్మాయి షేవింగ్ చేసుకున్న వీడియో ఒకటి టిక్‌టాక్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని, దీనివల్ల మృణకణాలు తొలిగిపోయి, చర్మం మరింత మృదువుగా, సహజసిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. షేవింగ్ వల్ల ఎలాంటి హానీ జరగదని, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని షేవింగ్ వెనుక తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. -
సతీష్‌రెడ్డి క్షవరం కోసమే ‘పైడిపాలెం’ ప్రారంభం
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె రూరల్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి క్షవరం కోసమే సీఎం చంద్రబాబు పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన సృగృహంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.660 కోట్లతో పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. కేవలం 10 శాతం పనులు టీడీపీ హయాంలో కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభోత్సవంలో నిజాలు తెలుస్తాయనే ఉద్దేశంతో స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సభకు రాకుండా హౌస్ అరెస్టు చేశారని, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వదిలేశారన్నారు. జీఎన్ఎస్ పనులు పూర్తికాకున్నా అప్పుడే పులివెందులకు నీరిచ్చినట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. గండికోట రిజర్వాయర్‌కు గోరుకల్లు ప్రాజెక్టు నుంచి జీఎన్ఎస్ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉందని, అయితే అక్కడి నుంచి అవుకు వరకు పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. దీంతో ఎస్ఆర్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు గోరుకల్లు నుంచి నీటిని విడదల చేస్తున్నారన్నారు. ఎస్ఆర్బీసీ కాల్వలో సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఉందని, దీని వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివరామి రెడ్డి మాట్లాడుతూ గండికోటకు నీరు తీసుకెళ్లడం వల్ల ఇక్కడి రైతులకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నీటిని ఎస్ఆర్బీసీ కాల్వ ద్వారా కాకుండా జీఎన్ఎస్ ద్వారా తీసుకెళ్లాలన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు లభించే నీటివాటాపై ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్రాంతి సంబరాలకు కేటాయించే ని«ధులను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాలని కోరారు. రైతు సంఘం నాయకులు జయప్రకాష్‌రెడ్డి ఉన్నారు. -
షేవింగ్ జాగ్రత్తలు
బిరుసు గడ్డం ఉన్న పురుషుల్లో షేవ్ చేసుకోవడం చాలాసార్లు సమస్యాత్మకంగానే ఉంటుంది. గడ్డంలోనే కొన్ని చోట్ల వెంట్రుకలు ఒకే పాటర్న్‌లో లేకపోవడం, సుడి తిరిగి ఉండటం వల్ల అక్కడ షేవింగ్ మరింత ఇబ్బందిగా పరిణమిస్తుంది. సురక్షితమైన షేవింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షేవింగ్ మరింత సాఫీగా సాగి... చర్మం ఎర్రబారడం, మంట పుట్టడం వంటివి లేకుండా చూసుకోవచ్చు. షేవింగ్ సమయంలో పాటించాల్సిన కొన్ని సూచనలివి... బాగా బిరుసుగా ఉన్న వెంట్రుకలు ఉండేవారు షేవింగ్‌కు ముందుగా న్యాప్కిన్ను లేదా టవల్‌ను వేడినీటిలో ముంచి గడ్డం తడిసి మెత్తబడేలా గడ్డం చుట్టూ దాన్ని చుట్టుకుని ఉండాలి. అలా చేశాక రొటీన్ షేవింగ్ కొనసాగిస్తే అప్పటికే తడిసి మెత్తబడ్డ వెంట్రుకలు తేలిగ్గా కట్ అవుతాయి. గడ్డంలో కేశాలన్నీ మెలి తిరిగి ఉన్నచోట వెంట్రుకలు సరిగ్గా, సమంగా కట్ కాలేదని ఆ ఒక్కచోటే మాటిమాటికీ షేవ్ చేయకండి. ఒకటి లేదా రెండుసార్లు చేసి అలా వదిలేయండి. మీరు అసంతృప్తితో మళ్లీ మళ్లీ షేవ్ చేయడం వల్ల చర్మం ఒరుసుకుపోయి, రోజంతా గాయం బాధపెడుతూనే ఉంటుంది. పైన పేర్కొన్న మెలితిరిగిన ప్రదేశాలు కాలర్ ఉన్న ప్రాంతంలో ఉన్నట్లయితే, గడ్డం గీసే సమయంలో ఒకవేళ అక్కడ బాగా ఒరుసుకుపోయేలా షేవ్ చేసినట్లయితే ఆ రోజు బిరుసైన కాలర్ ఉన్న షర్ట్స్ వేసుకోకండి. వీలైతే కాలర్ లేనివో లేదా మెత్తటి కాలర్ ఉండే డ్రస్సో వేసుకోండి. మీకు బయటకు వెళ్లాల్సిన పనులేవీ లేకుండా ఉంటే మీ సెలవు రోజున వీలైతే గడ్డం గీయకుండా ఒక రోజు బ్రేక్ ఇవ్వండి. ఎలక్ట్రిక్ రేజర్ కంటే మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిదని గుర్తించండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ రేజర్‌తో షేవ్ చేసే సమయంలో వెంట్రుక అన్ని దిశల నుంచి కట్ అవుతుంది. ఒక్కోసారి దీని వల్ల వెంట్రుక మళ్లీ వెనక్కు వెంట్రుక మూలం (ఫాలికిల్)లోకి పెరిగే అవకాశం ఉంది. ఇది తర్వాతి షేవ్స్లో మరింత బాధాకరంగా పరిణమించవచ్చు.