షేవింగ్ జాగ్రత్తలు | Shaving Precautions | Sakshi
Sakshi News home page

షేవింగ్ జాగ్రత్తలు

Published Wed, Oct 19 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

షేవింగ్   జాగ్రత్తలు

షేవింగ్ జాగ్రత్తలు

బిరుసు గడ్డం ఉన్న పురుషుల్లో షేవ్ చేసుకోవడం చాలాసార్లు సమస్యాత్మకంగానే ఉంటుంది. గడ్డంలోనే కొన్ని చోట్ల వెంట్రుకలు ఒకే పాటర్న్‌లో లేకపోవడం, సుడి తిరిగి ఉండటం వల్ల అక్కడ షేవింగ్ మరింత ఇబ్బందిగా పరిణమిస్తుంది. సురక్షితమైన షేవింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షేవింగ్ మరింత సాఫీగా సాగి... చర్మం ఎర్రబారడం, మంట పుట్టడం వంటివి లేకుండా చూసుకోవచ్చు. షేవింగ్ సమయంలో పాటించాల్సిన కొన్ని సూచనలివి...


బాగా బిరుసుగా ఉన్న వెంట్రుకలు ఉండేవారు షేవింగ్‌కు ముందుగా న్యాప్‌కిన్‌ను లేదా టవల్‌ను వేడినీటిలో ముంచి గడ్డం తడిసి మెత్తబడేలా గడ్డం చుట్టూ దాన్ని చుట్టుకుని ఉండాలి. అలా చేశాక రొటీన్ షేవింగ్ కొనసాగిస్తే అప్పటికే తడిసి మెత్తబడ్డ వెంట్రుకలు తేలిగ్గా కట్ అవుతాయి.

 
గడ్డంలో కేశాలన్నీ మెలి తిరిగి ఉన్నచోట వెంట్రుకలు సరిగ్గా, సమంగా కట్ కాలేదని ఆ ఒక్కచోటే మాటిమాటికీ షేవ్ చేయకండి. ఒకటి లేదా రెండుసార్లు చేసి అలా వదిలేయండి. మీరు అసంతృప్తితో మళ్లీ మళ్లీ షేవ్ చేయడం వల్ల చర్మం ఒరుసుకుపోయి, రోజంతా గాయం బాధపెడుతూనే ఉంటుంది.

 
పైన పేర్కొన్న మెలితిరిగిన ప్రదేశాలు కాలర్ ఉన్న ప్రాంతంలో ఉన్నట్లయితే, గడ్డం గీసే సమయంలో ఒకవేళ అక్కడ బాగా ఒరుసుకుపోయేలా షేవ్ చేసినట్లయితే ఆ రోజు బిరుసైన కాలర్ ఉన్న షర్ట్స్ వేసుకోకండి. వీలైతే కాలర్ లేనివో లేదా మెత్తటి కాలర్ ఉండే డ్రస్సో వేసుకోండి.

 
మీకు బయటకు వెళ్లాల్సిన పనులేవీ లేకుండా ఉంటే మీ సెలవు రోజున వీలైతే గడ్డం గీయకుండా ఒక రోజు బ్రేక్ ఇవ్వండి. ఎలక్ట్రిక్ రేజర్ కంటే మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిదని గుర్తించండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ రేజర్‌తో షేవ్ చేసే సమయంలో వెంట్రుక అన్ని దిశల నుంచి కట్ అవుతుంది. ఒక్కోసారి దీని వల్ల వెంట్రుక మళ్లీ వెనక్కు వెంట్రుక మూలం (ఫాలికిల్)లోకి పెరిగే అవకాశం ఉంది. ఇది తర్వాతి షేవ్స్‌లో మరింత బాధాకరంగా పరిణమించవచ్చు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement