సతీష్‌రెడ్డి క్షవరం కోసమే ‘పైడిపాలెం’ ప్రారంభం
సతీష్‌రెడ్డి క్షవరం కోసమే ‘పైడిపాలెం’ ప్రారంభం
Published Thu, Jan 12 2017 11:13 PM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె రూరల్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి క్షవరం కోసమే సీఎం చంద్రబాబు పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని వైఎస్‌ఆర్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన సృగృహంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.660 కోట్లతో పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. కేవలం 10 శాతం పనులు టీడీపీ హయాంలో కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభోత్సవంలో నిజాలు తెలుస్తాయనే ఉద్దేశంతో స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని సభకు రాకుండా హౌస్ అరెస్టు చేశారని, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వదిలేశారన్నారు. జీఎన్‌ఎస్ పనులు పూర్తికాకున్నా అప్పుడే పులివెందులకు నీరిచ్చినట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. గండికోట రిజర్వాయర్‌కు గోరుకల్లు ప్రాజెక్టు నుంచి జీఎన్‌ఎస్ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉందని, అయితే అక్కడి నుంచి అవుకు వరకు పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. దీంతో ఎస్‌ఆర్‌బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్‌కు గోరుకల్లు నుంచి నీటిని విడదల చేస్తున్నారన్నారు. ఎస్‌ఆర్‌బీసీ కాల్వలో సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఉందని, దీని వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివరామి రెడ్డి మాట్లాడుతూ గండికోటకు నీరు తీసుకెళ్లడం వల్ల ఇక్కడి రైతులకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నీటిని ఎస్‌ఆర్‌బీసీ కాల్వ ద్వారా కాకుండా జీఎన్‌ఎస్ ద్వారా తీసుకెళ్లాలన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు లభించే నీటివాటాపై ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్రాంతి సంబరాలకు కేటాయించే ని«ధులను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాలని కోరారు. రైతు సంఘం నాయకులు జయప్రకాష్‌రెడ్డి ఉన్నారు.
Advertisement