shaving
-
షేవింగే అతడి ప్రాణాల మీదికి తెచ్చింది, నెల రోజులు కోమాలో!
ఇన్ గ్రోయిన్ హెయిర్ అమెరికాలో ఒక వ్యక్తిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. తీవ్రమైన బ్లడ్ ఇన్ఫెక్షన్ సెప్పిస్ బారిన పడ్డాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. బతికే అవకాశం చాలా తక్కువని చెప్పారు.చివరికి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కానీ అనూహ్యంగా.. కోలుకోవడం విశేషంగా నిలిచింది.. వివరాలు ఇలా ఉన్నాయి న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అమెరికాటెక్సాస్ రాష్ట్రానికి చెందిన36 ఏళ్ల స్టీవెన్ స్పైనాల్ గజ్జల వద్ద ఉన్న ఇన్గ్రోన్ హెయిర్‌ను తొలగించుకున్నాడు. దీనికి ఇన్ఫెక్షన్ సెప్సిస్ సోకి చివరికి సెప్సిస్షాక్కు దారి తీసింది. రక్తం గడ్డకట్టడం, డబుల్ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కి దారితీసింది. ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరింది. దీంతొ కోమాలోకి వెళ్లి పోయాడు. ఇక కష్టం అని ప్రకటించిన వైద్యులు చివరి ఆశగా వెంటిలేటర్‌పై ఉంచి దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించిన స్టీవెన్ కొద్దిగా కోలుకున్నాడు. మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని సోదరి మిచెల్ పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో సమాచారం ప్రకారం 2022 ఏడాది చివరల్లో అనారోగ్యానికి గురైన స్టీవెన్ 2023 చివరినాటికి కొద్దిగా బలం పుంజు కున్నాడంటూ స్టీవెన్ రికవరీ జర్నీనీ షేర్ చేసింది. ఇందు కోసం 8వేల డాలర్లు ఖర్చు అయినట్టు తెలిపింది. గోఫండ్‌మీ ద్వారా విరాళాలకోసం అభ్యర్థించింది. (ఇన్ గ్రోయిన్ హెయిర్: పురుషులు ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేకదిశలో(ఎదురు) షేవ్ చేసుకున్నా, కట్ అయినా వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే వీటిమీద రాంగ్ డైరెక్షన్లో వెంట్రుకలొస్తాయి. దీనికి సాధారణంగా వైద్య చికిత్స అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ షేవింగ్ జెల్ లేదా క్రీమ్ లాంటివి వాడతారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే సెప్సిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీన్నే " సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. మహిళలల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనా ప్రకారం ప్రతీ ఏడాది 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్ బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 270,000 మంది మరణిస్తున్నారు.) -
ఇదేం పోయేకాలం.. సెలూన్లో షేవింగ్ చేయించుకున్న మహిళ
బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు.. కలియుగంలో వింతలు, విచిత్రాలు జరగుతాయని. అందుకు తగ్గట్లే సోషల్ మీడియా వచ్చాక అవన్నీ నిజమనే సంఘనటలు చాలానే జరిగాయి. తాజాగా మరో వింత సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన వాళ్లంతా ఇదేం విచిత్రం అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఇలాంటి వింతలు చూస్తామనుకోలేదు అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?ఆ వింతైన సంఘటన ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా అబ్బాయిలు షేవింగ్ కోసం సెలూన్‌కి వెళ్తుంటారు. కానీ తాజాగా ఓ అమ్మాయి సెలూన్‌కి వెళ్లి షేర్ చేయించుకుంది. బార్బర్ ఆమె ముఖం మీద షేవింగ్ క్రీమ్ రాసి అబ్బాయిలకు చేసినట్లే షేవింగ్ చేశాడు. దీనికోసం మగవాళ్లకు వాడే బ్లేడ్‌నే ఉపయోగించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. 5జీ కదా.. అన్నీ మరుతుంటాయి. మహిళలు కూడా అన్నింట్లో సమానమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఏంటీ పిచ్చి పనులు? ఆమె నిజంగా అమ్మాయేనా అంటూ విస్మయం చెందుతున్నారు. బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఇలాంటి వింతలు జరుగుతాయని ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటూ స్పందిస్తున్నారు. గతంలోనూ ఇలాగే ఓ అమ్మాయి షేవింగ్ చేసుకున్న వీడియో ఒకటి టిక్‌టాక్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రోజూ షేవింగ్ చేయడం చర్మానికి మంచిదని, దీనివల్ల మృణకణాలు తొలిగిపోయి, చర్మం మరింత మృదువుగా, సహజసిద్ధంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. షేవింగ్ వల్ల ఎలాంటి హానీ జరగదని, దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని షేవింగ్ వెనుక తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది. -
ట్రాన్స్జెండర్ల పైశాచికం.. గుండు కొట్టించి.. ఆపై మూత్ర విసర్జన చేసి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఐదుగురు ట్రాన్స్‌జండర్లు కలిసి ఓ వ్యక్తికి గుండు కొట్టింటారు. అనంతరం అతనిపై మూత్రం పోశారు. అంతేకాకుండా బాధితుని వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. జులై 26న ఈ ఘటన జరిగింది. కాగా.. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాఫికుల్.. నిందితురాలి ఇంట్లో పనిచేసేవాడు. ఇటీవల అక్కడ పని మానేసి మరో ట్రాన్స్జండర్ ఇంట్లో పనిచేయడం ప్రారంభించాడు. ఈ మార్పుపై కోపాన్ని పెంచుకున్న నిందితురాలు.. రాఫికుల్ని మార్గమధ్యలో పట్టుకుని గుండు కొట్టించింది. అనంతరం అతనిపై మూత్రం పోశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్.. -
గుండు కొట్టించుకోవడానికి రెమ్యునరేషన్ పెంచిన హీరో
Suhas Demands More Remuneration For His Next Movie: ‘కలర్ ఫోటో’ఫేమ్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలె ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీలో నటించి ప్రశంసలు అందుకున్న సుహాస్ ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇవి కాకుండా మరో సినిమాకు కూడా రీసెంట్గా సైన్ చేశాడు. అయితే ఈ సినిమా కోసం సుహాస్ తన రెమ్యునరేషన్‌ను పెంచాడట. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ. 40 లక్షలు పారితోషికం అందుకుంటున్న సుహాస్ ఇప్పడు దానికి మరో రూ.5లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దీనికి కారణం ఏంటంటే..ఈ సినిమా మొత్తం సుహాస్ గుండుతోనే కనిపించాలట. దీంతో గుండుతో ఇతర సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో ఆ నష్టాన్ని భరించాలని మేకర్స్‌ని కోరడంతో వాళ్లు కూడా సుహాస్ అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. -
క్లీన్ షేవ్: తండ్రిని గుర్తుపట్టలేని పిల్లలు.. చివరికి!
కరోనా చాలామంది జీవితాల్లో రకరకాల మార్పులు తీసుకొచ్చింది. లాక్డౌన్ వల్ల దాదాపు చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చాలాకాలం వరకు షేవింగ్‌కు పనిచెప్పలేదు. జోనాథన్ నార్మోయిల్ అనే ఓ టిక్‌టాక్ యూజర్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యి జుట్టు బాగా పెంచేశారు. అయితే ఆ మధ్యకాలంలో సేమ్ హెయిర్‌స్టైల్ బోర్ కొట్టిందేమో ఒకేసారి షేవ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. అయితే చాలా కాలం తర్వాత ఒక్కసారిగా షేవ్ చేసుకునేసరికి తన ఇద్దరు కవల పిల్లల నుంచి ఊహించని రియాక్షన్ ఎదురైంది. కొన్ని నెలులుగా పెంచుతున్న గడ్డాన్ని ఒకసారిగా షేవ్ చేసుకోవడంతో పిల్లలిద్దరూ ఆతడని గుర్తుపట్టలేకపోయారు. తమ దగ్గరికి ఎవరో అపరిచిత వ్యక్తి వచ్చాడని గుక్కపెట్టి ఏడ్చేశారు. చిన్నారిని చేతుల్లోకి తీసుకోబోతుండగా, మరో చిన్నారి తన చేతిని అడ్డుపెట్టి తండ్రి నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంటుంది. దీనికి సంబంధించిన వీడియాను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే 40 లక్షల మందికి పైగానే ఈ వీడియోను చూశారు. ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. వీడియోను రీట్వీట్ చేస్తూ లక్షల్లో లైకుల వర్షం కురిపిస్తున్నారు. Father shaved for the very first time,watch his twin kids reaction reaction 😂😭😍 pic.twitter.com/6MJOlFSSCI — Aqualady𓃤 𓅇 𓅋 𓆘 (@Aqualady6666) March 4, 2021 చదవండి : (వైరల్: చేప కడుపులో తాబేలు చక్కర్లు!) (గడ్డం గీయటానికి రూ. 4 లక్షల గోల్డ్ రేజర్) -
కూతురి కోసం.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మరేదీ సాటిరాదు. పేగు తెంచుకుని బిడ్డ కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది మాతృమూర్తి. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసిందో మహిళ. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన కుమార్తెకు సంఘీభావంగా తల్లి సైతం తన జుట్టును షేవ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పోర్చుగీసుకు చెందిన లూసియానా అనే యువతి క్యాన్సర్ బారిన పడింది. ఈ నేపథ్యంలో తల్లి ఆమె జుట్టును కత్తిరిస్తుండగా చాలా ఉద్వేగానికి లోనయ్యింది. కూతురి బాధను గమనించిన తల్లి, ఆమెతో పాటు తన జుట్టును షేవ్ చేసుకోవడం ప్రారంభించింది. తల్లి చర్యతో ఒక్కసారిగా షాక్‌కి గురైన లూసియానా.. గుండు చేసుకోవద్దంటూ తల్లిని వారించినప్పటికీ ఆమె వినలేదు. బిడ్డకు తోడుగా నిలబడేందుకు తాను కూడా జుట్టును కత్తిరించేసుకుంది. ఎంతో ఎమోషనల్‌గా ఉన్న ఈ వీడియో ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. అమ్మ ప్రేమంటే ఇదే అనే క్యాప్షన్‌తో లూసియానా తన ఫేస్బుక్ అకౌంట్లో ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రాడాకారుడు రెక్స్ చాప్మన్ సైతం షేర్ చేశారు. ఇప్పటికే 2.3 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 68వేలకు పైగా లైకులు కురిపిస్తూ తల్లి ప్రేమకు సెల్యూట్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. This mother surprises her daughter — who is fighting cancer. Love. Break out the tissues...pic.twitter.com/eGkwggaIFK — Rex Chapman🏇🏼 (@RexChapman) January 26, 2021 -
మీ గడ్డం బిరుసుగా ఉందా?
కొంతమందికి గడ్డం చాలా బిరుసుగా ఉంటుంది. అలాంటి పురుషులకు షేవ్ చేసుకోవడం ఒక సమస్యగా ఉంటుంది. మరికొందరికి గడ్డంలోనే కొన్ని చోట్ల వెంట్రుకలన్నీ ఒకే పాటర్న్‌లో ఉండవు. అక్కడక్కడా సుడి తిరిగినట్లుగా ఉంటాయి. ఇలాంటప్పుడు షేవింగ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సురక్షితమైన షేవింగ్ కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షేవింగ్ ప్రక్రియ మెత్తగా, హాయిగా, సాఫీగా జరుగుతుంది. అంతేకాదు... చర్మం ఎర్రబారడం, మంట పుట్టడం వంటివి లేకుండా కూడా చూసుకోవచ్చు. షేవింగ్ ప్రక్రియ మృదువుగా జరిగిపోడానికి పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు/సూచనలివి... ►బాగా బిరుసుగా ఉన్న వెంట్రుకలు ఉండేవారు ఒక షేవింగ్‌కు ముందుగా న్యాప్కిన్ను లేదా టవల్‌ను వేడినీటిలో ముంచి గడ్డం తడిసి మెత్తబడేలా గడ్డం చుట్టూ దాన్ని కాసేపు చుట్టుకుని ఉండాలి. అలా చేశాక షేవింగ్ చేసుకుంటే... అప్పటికే వెంట్రుకలు బాగా తడిసి మెత్తబడి ఉండటం వల్ల అవి తేలిగ్గా కట్ అవుతాయి. ►గడ్డంలోని వెంట్రుకలు మెలి తిరిగి ఉన్నచోట అవి సరిగా కట్ కాలేదనుకోండి. అప్పుడు ఆ ఒక్కచోటే మాటిమాటికీ షేవ్ చేయకండి. ఒకటి లేదా రెండుసార్లు చేసి అలా వదిలేయండి. మీరలా మాటిమాటికీ షేవ్ చేయడం వల్ల చర్మం ఒరుసుకుపోయి మంట పుడుతుంది. ఆ గాయం మిమ్మల్ని రోజంతా బాధపెడుతూనే ఉంటుంది. ►గడ్డంలో సుడులు మెలితిరిగిన ప్రదేశాలు మీ షర్ట్ కాలర్ ఉండే ప్రాంతంలోనే ఉన్నట్లయితే, గడ్డం గీసే సమయంలో మీరక్కడ బాగా ఒరుసుకుపోయేలా షేవ్ చేసుకున్నట్లయితే... ఆ రోజున మాత్రం గట్టిగా, బాగా బిరుసుగా ఉండే కాలర్ ఉన్న షర్ట్స్ వేసుకోకండి. వీలైతే కాలర్ లేనివో లేదా మెత్తటి కాలర్ ఉండే డ్రస్ లాంటివో వేసుకోండి. ►మీకు బయటకు వెళ్లాల్సిన పనులేవీ లేకుండా ఉంటే మీ సెలవు రోజున వీలైతే గడ్డం గీయకుండా ఒక రోజు బ్రేక్ ఇవ్వండి. ►ఎలక్ట్రిక్ రేజర్ కంటే మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిదని గుర్తించండి. ఎందుకంటే ఎలక్ట్రిక్ రేజర్‌తో షేవ్ చేసుకునే సమయంలో వెంట్రుక అన్ని దిశల నుంచీ కట్ అవుతుంది. ఒక్కోసారి దీని వల్ల వెంట్రుక మళ్లీ వెనక్కు వెంట్రుక మూలం (ఫాలికిల్)లోకి పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతి షేవ్స్లో ఇది మరింత బాధాకరంగా పరిణమించే అవకాశాలుంటాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు మామూలు బ్లేడ్‌తో షేవ్ చేసుకోవడమే మంచిది. -
నిర్లక్ష్యం ఆమె కాలును.. తినేసింది !
లండన్ : నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా మారింది. మాంసం తినే ఓ క్రిమి ఆమె కాలును తీవ్రంగా తొలిచి తినేసింది. కుడికాలును షేవ్ చేసుకుంటుండగా అయిన చిన్నగాటు ప్రమాదకరంగా మారి కాలే తీసేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని బ్రీష్టన్‌కు చెందిన తాన్యా జెర్నోజుకో అనే మహిళ కొన్ని నెలల ముందు తన కుడికాలును రేజర్‌తో షేవ్ చేసుకుంటుండగా చిన్నగాయం అయ్యింది. అయితే చిన్న గాయమే కదా అని ఆమె ఊరకుండిపోయింది. కొద్దిరోజుల తర్వాత అది చిన్నపాటి నాణెం సైజులోకి మారింది. అయినా ఆమె పట్టించుకోకపోవటంతో అది ఏకంగా పెద్దసెల్‌ఫోన్ సైజులోకి పెరిగి చర్మానికి రంధ్రం చేసింది. ఇన్ఫెక్షన్ అలా పెరిగిపోవటంతో ఇక చేసేదేమీలేక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు రాసిన మందులు,క్రీములు ఇలా అన్నీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డాక్టర్లు చేసిన పరీక్షల్లో ఆమెకున్న క్రోనిక్ లెగ్ అల్సర్ కాస్తా గ్యాంగ్రెనే(దెబ్బతిన్న శరీర భాగం కుళ్లిపోయే స్థితి)గా మారిందని తేలింది. ఆమెకు డయాబెటిస్ ఉండటంతో గాయం మానటం కష్టమని, కాలును తీసేయటం మంచిదని డాక్టర్లు సలహాయిచ్చారు. డాక్టర్ల సలహా మేరకు ఆమె తన కుడి కాలును తీసేయించుకుంది. నిర్లక్ష్యమే తన ఈ పరిస్థికి కారణమని ఏ పరిస్థితిలోనూ నిర్లక్ష్యం కూడదని తాన్యా సలహా ఇస్తోంది. -
గడ్డం తీసుకున్నారో రూ.6700 ఫైన్!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో మరోసారి పన్నుల మోత మోగింది. ఎవరైనా గడ్డం గీసుకున్నా.. మహిళలు బిగుతుగా వస్త్రాలు ధరించినా భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సిందని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఓ అధ్యయనం ఒకటి చెప్పింది. వారి ఆదేశాల ప్రకారం ఇక నుంచి ఎవరైనా పురుషుడు గడ్డం గీసుకుంటే దాదాపు రూ.6వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ ఎవరైన మహిళ బిగుతుగా ఉండే వస్త్రాలు ధరిస్తే దాదాపు రూ.2 వేలు ఫైన్ చెల్లించాలి. ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ చాలా సమస్యలు ఎదుర్కుంటోంది. అందులో ఆర్థికపరమైన సమస్యది అగ్రభాగం. వారి జీవన మనుగడతోపాటు విపరీతమైన ఆయుధాలు ఉపయోగించే ఈ సంస్థకు ఇటీవల తీవ్రంగా ఆర్థికంగా లోటు ఉంది. ఈ నేపథ్యంలో వివిధ రూపాల్లో పన్ను వేసి అమాయకుల నుంచి భారీ మొత్తం సొమ్మును ముక్కు పిండి వసూలు చేయాలనుకుంటుంది. -
షేవింగ్, ట్రిమింగ్లు షరియా చట్టానికి విరుద్ధం..
ముజఫర్‌నగర్(ఉత్తరప్రదేశ్): గడ్డం తీయడం ఇస్లాం వ్యతిరేకమని ప్రముఖ ఇస్లామిక్ మత సంస్థ దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ ఫత్వా జారీచేసింది. దేవ్‌బంద్‌లోని ఓ సెలూన్ నడుపుతున్న మహమ్మద్ ఇర్షద్, మహమ్మద్ ఫర్ఖాన్ అనే వ్యక్తులు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈమేరకు స్పష్టం చేసింది. షేవింగ్, ట్రిమింగ్లు షరియా చట్టానికి విరుద్ధం కనుక అవి ఇస్లాం వ్యతిరేకమని ఫత్వా జారీ చేసిన దారుల్ ఇఫ్తా విభాగం పేర్కొంది. ‘ఏ మతానికి చెందిన వ్యక్తి గడ్డాన్నైనా గీయడానికి షరియా అనుమతించదు. ఈ వృత్తిలో ఉన్న వ్యక్తులు వేరే పనిలోకి వెళ్లేందుకు ప్రయత్నించాలి’ అని ఫత్వాలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేవ్‌బంద్‌లోని చుట్టపక్కల ప్రాంతాల్లోని క్షురకులు షేవింగ్ చేయడం ఆపేసి, తమ షాపుల ముందు ఫత్వా కాపీని ప్రదర్శించారు. -
మగాళ్లేనా షేవింగ్ చేసుకునేది?
గడ్డం పెరుగుతుంది కాబట్టి... మగాళ్లు షేవింగ్ చేసుకుంటారు. అది కామన్. మరి గడ్డం అడ్డంగా లేకపోయినా... ఆడాళ్లు షేవింగ్ చేసుకుంటే... దాన్ని ఏమంటారు? సింపుల్‌గా ‘మెంటల్’ అంటారు. ప్రస్తుతం బాలీవుడ్లో సోనమ్‌కపూర్‌ని ఉద్దేశించి అందరూ అదే అంటున్నారు. షేవింగ్ క్రీమ్‌ని గడ్డానికి పూసేసుకొని రేజర్‌తో షేవ్ చేసుకుంటూ ఫొటో షూట్ చేయించుకున్నారు సోనమ్. ఈ ఫొటో షూట్ చేసిన ఫొటోగ్రాఫర్ రోహాన్ శ్రేష్ఠ... వాటిని తిన్నగా తీసుకెళ్ళి తన ఫేస్బుక్లో పోస్ట్ చేసుకున్నాడు. అంతే... నిదానంగా సోనమ్ షేవింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. ఈవిడగారి వైనం చూస్తుంటే... మగాళ్లు షేవింగ్ చేసుకుంటున్నట్లే ఉందని, ‘పిచ్చిమాతల్లి పచ్చడంతా తిన్నది’ అన్న సామెత గుర్తొస్తుందని ఓ రేంజ్లో సోనమ్‌పై ఇంటర్నెట్లో జోకులు పేలుతున్నాయి. కొందరైతే... ఓ అడుగు ముందుకేసి సోనమ్ తండ్రి అనిల్‌కపూర్ మీద కూడా జోకులు పేలుస్తున్నారు. దీనిపై సోనమ్ స్పందిస్తూ -‘‘మగాళ్లలా లేడీస్ కూడా షేవింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది.. అని సరదాగా చేసిన పని అది. దాన్ని భూతద్దంలో చూస్తే ఎలా? నాపై ఎన్ని జోకులేసినా నేను ఫీలవ్వను. నాన్న గురించి అవాకులు చెవాకులు పేలితే మాత్రం ఊరుకోను ఖబడ్దార్’’ అని వార్నింగులు జారీ చేశారు సోనమ్. ఇంతకీ ఈ షేవింగు వ్యవహారం అనిల్‌కపూర్‌కి తెలిసిందో లేదో?! -
సింగిల్ బ్లేడే సురక్షితం!
సలహా కోట్లాది మంది మగాళ్లకి గడ్డం గీసుకోవడం ఓ దినచర్య. మగాడి జుట్టుకోసం కనిపెట్టిన ఉత్పత్తుల కంటే... ఈ గడ్డం కోసం వస్తున్న ఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు. రేజర్లు-వాటిలో రకాలకు అయితే లెక్కే లేదు. కానీ, ప్రతి అడ్వాన్స్డ్ వెర్షనూ మంచిదనుకోవడం తప్పు. దేని విషయంలోనైనా కూడా ఉపయోగాలు, నష్టాలు... రెండూ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక విలువైన సలహా ఏంటంటే... గడ్డం గీసుకునేటప్పుడు సింగిల్ బ్లేడ్ రేజర్ వాడటం మంచిదట. ఇపుడు నాలుగైదు బ్లేడ్లున్న రేజర్లు కూడా వస్తున్నాయి. వీటిని తరచూ వాడటం వల్ల ముఖచర్మంపై అనవసర ఒత్తిడి పడుతుంది. చర్మంలో మృదుత్వం పోతుంది. మంట పుడుతుంది. అందులే సింగిల్ బ్లేడే సేఫంటున్నారు నిపుణులు. దాన్ని వాడటం కాస్త పాత పద్ధతే అయినా చర్మానికి మాత్రం మంచిది. కాబట్టి... సింగిల్ బ్లేడుకి షిఫ్టయిపోండి!