
కూతురిని చూసి తల్లడిల్లిపోయిన తల్లి..ఆమెకు ట్రిమ్ చేస్తూ తాను కూడా గుండు గీసుకుంది. ఈ వీడియోను ఇప్పటికే 2.3 మిలియన్ల మంది వీక్షించారు.
ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మరేదీ సాటిరాదు. పేగు తెంచుకుని బిడ్డ కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది మాతృమూర్తి. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసిందో మహిళ. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన కుమార్తెకు సంఘీభావంగా తల్లి సైతం తన జుట్టును షేవ్ చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పోర్చుగీసుకు చెందిన లూసియానా అనే యువతి క్యాన్సర్ బారిన పడింది. ఈ నేపథ్యంలో తల్లి ఆమె జుట్టును కత్తిరిస్తుండగా చాలా ఉద్వేగానికి లోనయ్యింది. కూతురి బాధను గమనించిన తల్లి, ఆమెతో పాటు తన జుట్టును షేవ్ చేసుకోవడం ప్రారంభించింది.
తల్లి చర్యతో ఒక్కసారిగా షాక్‌కి గురైన లూసియానా.. గుండు చేసుకోవద్దంటూ తల్లిని వారించినప్పటికీ ఆమె వినలేదు. బిడ్డకు తోడుగా నిలబడేందుకు తాను కూడా జుట్టును కత్తిరించేసుకుంది. ఎంతో ఎమోషనల్‌గా ఉన్న ఈ వీడియో ప్రతీ ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. అమ్మ ప్రేమంటే ఇదే అనే క్యాప్షన్‌తో లూసియానా తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రాడాకారుడు రెక్స్ చాప్మన్ సైతం షేర్ చేశారు. ఇప్పటికే 2.3 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 68వేలకు పైగా లైకులు కురిపిస్తూ తల్లి ప్రేమకు సెల్యూట్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This mother surprises her daughter — who is fighting cancer. Love.
— Rex Chapman🏇🏼 (@RexChapman) January 26, 2021
Break out the tissues...pic.twitter.com/eGkwggaIFK