
చాలామంది పలు రకాల ఆవిష్కరణలు సృష్టిస్తారు. అవన్నీ కూడా తాము ఎదర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆవిష్కరణలే. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి విస్తుపోయేలా కళ్లు చెదిరే ఒక సరికొత్త ఆవిష్కరణ సృష్టించాడు.
వివరాల్లోకెళ్తే....యూఎస్‌కి చెందిన బ్రియాన్ స్టాన్లీ అనే ఇంజనీర్ క్యాన్సర్ కారణంగా కన్నుని పోగొట్టుకున్నాడు. దీంతో అతను కృత్రిమ కన్నుని రూపొందించాడు. ఐతే అది మాములు కన్ను కాదు ఏకంగా లైట్‌లా వెలిగే కన్నుని తయారు చేశాడు. తానే స్వంతంగా ప్రోథెస్టిక్ కన్నుని రూపొందించాడు. తన కనుపాప ఫ్లాష్ లైట్‌లా వెలిగేలా రూపొందించాడు. ఈ కన్నుని టైటానియం సైబర్గ్ కన్నుగా పిలుస్తారు. ఇది ఒక హెడ్‌ల్యాంప్ లాగా పనిచేస్తుంది.
అదేనండి బొగ్గుగనుల్లో ఉండేవాళ్లు పెట్టుకునే క్యాప్‌ల్యాంప్‌లా ఉంటుందన్నమాట. చీకటిలో సులభంగా చదవడానికి ఉపకరిస్తుందని, పైగా ఈ లైట్ వేడిగా ఉండదని చెబుతున్నాడు స్టాన్లీ. అంతేగాదు ఈ ఫ్లాష్ లైట్ కన్ను బ్యాటరీ 20 గంటలు వరకు పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు బ్రియాన్ తన ప్రోథిస్టిక్ కన్నుని ఎలా రూపొందించాడో వివరిస్తూ...వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ మేరకు నెటిజన్లు వావ్ వాట్ ఏ ఆవిష్కరణ, సైన్స్‌తో ఏదైన సాధించవచ్చు అంటూ స్టాన్లీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.
(చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment