చిన్నారి అంతులేని ధైర్యం : కన్నీటి పర్యంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ | Brave Girl Honorary Freeport Officer Abigail Arias Story Goes Viral | Sakshi
Sakshi News home page

చిన్నారి అంతులేని ధైర్యం : కన్నీటి పర్యంతమైన పోలీస్‌ ఆఫీసర్‌

Sep 2 2024 4:27 PM | Updated on Sep 2 2024 5:01 PM

Brave Girl Honorary Freeport Officer Abigail Arias Story Goes Viral

చిన్న వయసులో అరుదైన కేన్సర్‌తో పోరాడుతూ తన కల నెరవేర్చుకోవాలని ఆశపడింది టెక్సాస్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి అబిగైల్ అరియాస్. ఆరేళ్ల వయసులో ఏళ్ల గౌరవ పోలీసు అధికారిగా ప్రమాణం చేస్తూ అక్కడున్నవారందరి గుండెల్ని బరువెక్కించింది. అంతేకాదు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న టెక్సాస్‌లోని ఫ్రీ పోర్ట్‌ అధికారి కంటతడి పెట్టిన వీడియో సంచలనంగా మారింది. అసలు స్టోరీ ఏంటంటే.

2012,  జూన్ 28న రూబెన్ , ఇలీన్ అరియాస్‌లకు అబిగైల్  అరియాస్‌   జన్మించింది.  అబిగైల్‌కు ఏతాన్‌కు అనే అన్నయ్య  కూడా ఉన్నాడు.   ఎంతో సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో  2017లో, అరియాస్‌కు ఫోర్త్‌ స్టేజ్‌ విల్మ్స్ ట్యూమర్ అనే అరుదైన కిడ్నీ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇలాంటి కేన్సర్‌లో పిల్లల్లోనే ఎక్కువ  కనిపిస్తుంది.  చికిత్సలో భాగంగా  ఆ చిన్నారి  ఒకటీ రెండూ కాదు, ఏకంగా 90 రౌండ్ల కీమోథెరపీలను, దాని  సైడ్‌ ఎఫెక్ట్స్‌ను ధైర్యంగా కనిపించింది.  కానీ ఆరు నెలలకే కేన్సర్‌మళ్లీ తిరగ బెట్టింది.  2018లో  ఊపిరితిత్తులకు పాకింది.  చివరకు ఈ మహమ్మారి ముందు అబిగైల్ అరియాస్‌ ధైర్యం ఓడిపోయింది.  2019, నవంబరులో ఆమె కన్నుమూసింది. కానీ చనిపోయే సమయంలో కూడా అంతే నిబ్బరంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. చాలా చిన్నవయసులో అంతటి నిబ్బరాన్నిచూపించిన ఆమె మరణంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గ

అయితే చనిపోవడానికి ముందు తన కలను సాకారం చేసుకునే క్రమంలో 2019 ఫిబ్రవరిలో అబిగైల్ ఫిబ్రవరిలో గౌరవ ఫ్రీపోర్ట్ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసింది. అద్భుతమైన చిరువ్వుతో మొత్తం డిపార్ట్‌మెంట్‌నే ఆకట్టుకుంది. ముఖ్యంగా  పోలీస్ యూనిఫాం ధరించి  అరియాస్‌ 758 పోలీస్‌ఆఫీసర్‌గా ధైర్యంగా తన సంఘాన్ని రక్షిస్తానని ,సేవ చేస్తానని వాగ్దానం చేసింది. ఈ‍ సందర్భంగా  ఫ్రీపోర్ట్ పోలీస్ చీఫ్ రేమండ్ గారివే కన్నీటి పర్యంతమైనారు. ఆమె జ్ఞాపకాలను శాశ్వతంగా పదిలపర్చుకున్నారు.

 ఆమె మనోధైర్యం, జీవితం పట్ల ఆమెకున్న స్ఫూర్తి ఫ్రీపోర్ట్‌ నుంచి అమెరికాలోని  పోలీసు డిపార్ట్‌మెంట్‌లకు దాకా చేరింది.  ఆమె కోసం ప్రార్థనలు చేశారు.  పాటలు పాడారు.  వరల్డ్ సిరీస్ గేమ్ 1కి ముందు ఆమె హ్యూస్టన్ ఆస్ట్రోస్ స్టార్ జోస్ అల్టువేని కలుసుకుంది. ఆమె చనిపోయిన తరువాత పోలీస్ చీఫ్ రేమండ్ గారివే సోషల్‌ మీడియాలో సంతాపం తెలిపారు. ఆఫీసర్‌ 758 కేన్సర్‌ ఫైడ్‌ పౌండేషన్‌ కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తీర్చేందుకు కృషి చేస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement