brave girl
-
చిన్నారి అంతులేని ధైర్యం : కన్నీటి పర్యంతమైన పోలీస్ ఆఫీసర్
చిన్న వయసులో అరుదైన కేన్సర్‌తో పోరాడుతూ తన కల నెరవేర్చుకోవాలని ఆశపడింది టెక్సాస్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి అబిగైల్ అరియాస్. ఆరేళ్ల వయసులో ఏళ్ల గౌరవ పోలీసు అధికారిగా ప్రమాణం చేస్తూ అక్కడున్నవారందరి గుండెల్ని బరువెక్కించింది. అంతేకాదు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న టెక్సాస్‌లోని ఫ్రీ పోర్ట్ అధికారి కంటతడి పెట్టిన వీడియో సంచలనంగా మారింది. అసలు స్టోరీ ఏంటంటే.2012, జూన్ 28న రూబెన్ , ఇలీన్ అరియాస్లకు అబిగైల్ అరియాస్ జన్మించింది. అబిగైల్‌కు ఏతాన్కు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఎంతో సంతోషంగా జీవితం కొనసాగుతున్న తరుణంలో 2017లో, అరియాస్కు ఫోర్త్ స్టేజ్ విల్మ్స్ ట్యూమర్ అనే అరుదైన కిడ్నీ కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇలాంటి కేన్సర్‌లో పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. చికిత్సలో భాగంగా ఆ చిన్నారి ఒకటీ రెండూ కాదు, ఏకంగా 90 రౌండ్ల కీమోథెరపీలను, దాని సైడ్ ఎఫెక్ట్స్‌ను ధైర్యంగా కనిపించింది. కానీ ఆరు నెలలకే కేన్సర్మళ్లీ తిరగ బెట్టింది. 2018లో ఊపిరితిత్తులకు పాకింది. చివరకు ఈ మహమ్మారి ముందు అబిగైల్ అరియాస్ ధైర్యం ఓడిపోయింది. 2019, నవంబరులో ఆమె కన్నుమూసింది. కానీ చనిపోయే సమయంలో కూడా అంతే నిబ్బరంగా ఉండటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. చాలా చిన్నవయసులో అంతటి నిబ్బరాన్నిచూపించిన ఆమె మరణంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. గఅయితే చనిపోవడానికి ముందు తన కలను సాకారం చేసుకునే క్రమంలో 2019 ఫిబ్రవరిలో అబిగైల్ ఫిబ్రవరిలో గౌరవ ఫ్రీపోర్ట్ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసింది. అద్భుతమైన చిరువ్వుతో మొత్తం డిపార్ట్‌మెంట్‌నే ఆకట్టుకుంది. ముఖ్యంగా పోలీస్ యూనిఫాం ధరించి అరియాస్ 758 పోలీస్‌ఆఫీసర్‌గా ధైర్యంగా తన సంఘాన్ని రక్షిస్తానని ,సేవ చేస్తానని వాగ్దానం చేసింది. ఈ సందర్భంగా ఫ్రీపోర్ట్ పోలీస్ చీఫ్ రేమండ్ గారివే కన్నీటి పర్యంతమైనారు. ఆమె జ్ఞాపకాలను శాశ్వతంగా పదిలపర్చుకున్నారు.A police chief in Texas was brought to tears when he swore in a 6-year-old girl as an honorary officer. She has an incurable cancer, and wants to become a cop so she can fight the "bad guys in her body" 💖 pic.twitter.com/Muc2moj0l6— Kevin W. (@Brink_Thinker) August 29, 2024 ఆమె మనోధైర్యం, జీవితం పట్ల ఆమెకున్న స్ఫూర్తి ఫ్రీపోర్ట్ నుంచి అమెరికాలోని పోలీసు డిపార్ట్మెంట్లకు దాకా చేరింది. ఆమె కోసం ప్రార్థనలు చేశారు. పాటలు పాడారు. వరల్డ్ సిరీస్ గేమ్ 1కి ముందు ఆమె హ్యూస్టన్ ఆస్ట్రోస్ స్టార్ జోస్ అల్టువేని కలుసుకుంది. ఆమె చనిపోయిన తరువాత పోలీస్ చీఫ్ రేమండ్ గారివే సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు. ఆఫీసర్ 758 కేన్సర్ ఫైడ్ పౌండేషన్ కేన్సర్‌తో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తీర్చేందుకు కృషి చేస్తోంది. -
Daughter Save Father: సాయుధులతో ఒంటరిగా పోరాడి..
పదిహేడేళ్ల అమ్మాయి. ఏడో తరగతితోనే చదువు ఆపేసింది. పనికిమాలిన పిల్ల అంటూ ఊర్లో అంతా హేళన చేశారు. తనను ఎవరు ఏమన్నా నవ్వుతూ భరించింది. కానీ, కన్నవాళ్లకు ఆపదొస్తే చూస్తూ ఊరుకుంటుందా?. శివంగిల దూకి రక్షించుకుంది.ఛత్తీస్‌గఢ్ జారా గ్రామంలో ఆగష్టు 7వ తేదీ సాయంత్రం.. సోమ్దర్ కొర్రం అనే వ్యక్తి ఇంటిపైకి ఆయుధాలతో ఎనిమిది మంది వచ్చారు. పదునైన ఆయుధాలతో మెడ మీద వేటు వేయాలని ప్రయత్నించారు. కానీ, ఆయన తప్పించుకోవడంతో అది ఛాతీలో దిగబడింది. ఆ వెంటనే మరో దెబ్బతో ఆయన ప్రాణం తీయాలని ప్రయత్నించారు. అయితే..ఇంట్లో తండ్రికి భోజనం వడ్డిస్తూ ఆ అలికిడి విన్న కొర్రం కూతురు సుశీల.. ఒక్క దూటున వాళ్ల మధ్యకు చేరింది. తండ్రిని చుట్టుముట్టిన నలుగురు ఆగంతకులపై పిడిగుద్దులు గుప్పించింది. ఆ పెనుగులాటలో ఒకరి చేతిలో గొడ్డలి లాక్కుని.. కింద రక్తపు మడుగులో ఉన్న తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది. అయితే..బయట నలుగురు కాపలా.. లోపల నలుగురు. వాళ్లతో ఎక్కువసేపు ఒంటరిగా పోరాడలేనని ఆమెకు అర్థమైంది. సాయం కోసం గట్టి గట్టిగా కేకలు వేసింది. ఆ కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరారు. అప్రమత్తమైన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సాయంతో జగదల్పూర్లోని దిమ్రాపాల్ ఆస్పత్రికి తీవ్రంగా గాయపడ్డ తండ్రిని తీసుకెళ్లింది. సకాలంలో చికిత్స అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో.. ఇది మావోయిస్టుల పనని తొలుత ప్రచారం జరిగింది. కానీ, పోలీస్ విచారణలో కాదని తేలింది. భూ తగాదాలతో ఆయన చిన్న తమ్ముడే ఈ దాడి చేయించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.अपने पिता की जान बचाने के लिए एक बेटी 8 हथियार बंद नक्सलियों से भिड़ गई... बहादुर बेटी की कहानी देख लीजिए @gyanendrat1#Chhattisgarh #Narayanpur #NaxalAttack #CGNews #SeedheMuddeKiBaat #GyanendraTiwari #VistaarNews pic.twitter.com/d6PFOlsOnf— Vistaar News (@VistaarNews) August 6, 2024 Video Credits: Vistaar News -
శెభాష్ జునియా! సాహస బాలికకు నేషనల్ బ్రేవరీ అవార్డు
సాక్షి, హైదరాబాద్ (అల్వాల్): ఆడపిల్ల అబల కాదు సబల అని నిరూపించింది అల్వాల్‌కు చెందిన జునియా ఈవ్లిన్. బాలిక జునియా ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ (ఐసీసీడబ్యూ) సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని అందజేసింది. గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జునియా ఈవ్‌లిన్‌కు ఈ నెల 17న ఢిల్లీలో పురస్కారాన్ని అందజేసింది. ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి భయందోళనకు గురికాకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, తమ్ముడిని కాపాడుకోవడంతోపాటు తోటివారిని రక్షించించి సాహస బాలల పురస్కారాన్ని అందుకుంది. వివరాలివీ... మచ్చబొల్లారంలో నివసించే జోసఫ్‌రాయ్, అభిజేర్‌ల కుమార్తె జునియా ఆవ్‌లిన్(14) అల్వాల్‌లోని సెయింట్ మైఖేల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 2022 ఆగస్టు 15న జునియా తన తండ్రి, తమ్ముడితో కలిసి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో జునియా తలకు గాయమైంది. తండ్రి అపస్మారక స్థితికి చేరాడు. తమ్ముడు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సమయంలో జునియా ధైర్యాన్ని కోల్పోకుండా తనను తాను రక్షించుకొని తండ్రి, సోదరుడికి సపర్యలు చేసి వారు స్పృహలోకి వచ్చేలా చేసింది. అనంతరం ఆటోలో ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించింది. మరో ప్రయాణికురాలు, ఇద్దరు చిన్నారులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించి సఫలం అయింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జునియా తలకు అయిన గాయానికి మూడు కుట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ సంస్థ ఏటా అందించే సాహస బాలల పురస్కారాన్ని జునియా ఈవ్‌లిన్‌కు అందజేసింది. తన కూతురి ధైర్య సాహసానికి గర్వపడుతున్నానని ఈ సందర్భంగా తండ్రి జోçసఫ్‌రాయ్ ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
తమ్ముడి కోసం చిట్టితల్లి సాహసం
ఇటీవల న్యూయార్క్ బ్రోన్క్స్ వీధిలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లో ఓ వ్యక్తిని వెంటాడుతూ ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తుపాకి తుటా నుంచి తప్పించుకునే క్రమంలో ఆ వ్యక్తి ఎదురుగా వెళ్తున్న అక్కాతమ్ముడి చాటున దాక్కునే ప్రయత్నం చేశాడు. మరోవైపు తుపాకి చేత పట్టుకున్న వ్యక్తి కాల్పులు ఆపలేదు. ఈ క్రమంలో తన తమ్ముడిని కాపాడుకునేందుకు బుల్లెట్లకు భయపడకుండా ఆ అక్క చేసిన సాహాసం అందరినీ ఆకట్టుకుంటోంది. -
ఆమె పట్టుతో దొంగ చిక్కక తప్పలేదు
చండీగఢ్: మొబైల్ ఫోన్ స్నాచింగ్‌ను సమర్థంగా అడ్డుకుని, ఓ దొంగను కటకటాల్లోకి నెట్టిన పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన కుసుమ్ కుమారి (15) పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కుసుమ్ కుమారి ధైర్యం ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శమని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను సాహస బాలికగా పేర్కొన్న జలంధర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ ఆమె పేరును జాతీయ, రాష్ట్రస్థాయి సాహస అవార్డులకు పంపిస్తామని చెప్పారు. ఇక కుసుమ్ కుమారి సాహసానికి మెచ్చిన సిటీ డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ తోరీ ఆమెకు రూ.51 వేల నజరానా ప్రకటించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద ఈ సాయం చేస్తున్నానని తెలిపారు. ‘బేటీ బచావో- బేటీ పడావో’ కార్యక్రమానికి సంబంధించి కుసుమ్ కుమారి ఫొటోను వాడుకుంటామని చెప్పారు. దొంగకు మూడు రోజుల రిమాండ్ కాగా, కుసుమ్ కుమారి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా దొంగలు అవినాష్ కుమార్ (22) అలియాస్ అషు, వినోద్ కుమార్ బైక్‌పై ఆమెను వెంబడించారు. చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కుసుమ్ కుమారి వారిపై సివంగిలా దూకి.. దొంగలకు చుక్కలు చూపించింది. ఫోన్ లాక్కుని బైక్‌పై కూర్చున్న అవినాష్ కుమార్‌ను అమాంతం పట్టేసుకుంది. ఈక్రమంలో ఆ దొంగ కుసుమ్ కుమారి చేతిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అయినా, ఆమె వెనకడుగు వేయలేదు. అంతలోనే దారినపోయేవారు అక్కడకు చేరుకుని దొంగను పట్టుకున్నారు. మరో దొంగ బైక్‌పై ఉడాయించాడు. సీసీటీవీలో రికార్డయిన ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక నిందితుడు అవినాష్ కుమార్‌కు న్యాయస్థానం మూడు రోజుల రిమాండ్ విధించిందని జలంధర్ డివిజన్ నెంబర్-2 ఎస్ఐ జితేంతర్ పాల్ సింగ్ చెప్పారు. రెండోవాడి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం, దొంగతనం కేసులు పెట్టామని తెలిపారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉండగా.. గాయాలపాలైన సాహస బాలికకు జోషి ఆస్పత్రి ఉచితంగా చికిత్స అందిస్తుండటం అభినందనీయం. #Punjab: 15-year-old girl fights snatchers to save her mobile phone in #Jalandhar pic.twitter.com/MTqYvwiXPr — The Tribune (@thetribunechd) September 1, 2020 -
'సీఎంగారు రక్షించండి.. వేధిస్తున్నారు'
ఆగ్రా: నజియా అనే ఆ అమ్మాయి గొప్ప సాహసికురాలుగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది కిడ్నాపర్ల చెర నుంచి ఓ ఆరేళ్ల బాబును రక్షించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేతుల మీదుగా ఆగస్టులో వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయి అవార్డును అందుకుంది. కానీ, అలాంటి బాలిక ఇప్పుడు మాత్రం అదే ముఖ్యమంత్రికి 'తనను రక్షించండి' అంటూ వరుసగా ట్వీట్లు చేసింది. గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ల ఆకృత్యాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని ఆమె సీఎం అఖిలేశ్ కు విజ్ఞప్తి చేసింది. ఆగ్రాలోని మంటోలా ఏరియాలో ఓ గ్యాంబ్లింగ్ బ్యాచ్ మట్కా గ్యాంబ్లింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. దీంతో వారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా ఫిర్యాదుచేసినప్పటి నుంచి వారి వేధింపులు మొదలయ్యాయి. పోలీసులు, గ్యాంబ్లర్స్ కలిసి తనను వేధిస్తున్నారని, తనకు అపఖ్యాతి తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని సీఎంకు ట్వీట్ ద్వారా తెలిపింది. తనను ఈ వేధింపుల నుంచి రక్షించాలని సీఎంను వేడుకుంది. అలాగే, ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారని, అతడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడంతో అతడి వల్ల తమ కుటుంబానికి ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 'ఇలాగే తన పోరాటం కొనసాగించమని ముఖ్యమంత్రి నా భుజం తట్టి చెప్పారు. ఎప్పుడు నా గొంతు విప్పినా నా జీవితాన్ని ఓ సమస్యల సుడిగుండంలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఫిర్యాదు చేసినవారిని కాకుండా పోలీసులు నన్ను పిలిచి విచారిస్తున్నారు. నేను జూలైలో ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు' అని ఆ బాలిక నేరుగా సీఎం అఖిలేశ్‌కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేసింది. -
'ఓ బాలిక మా మావయ్య ప్రాణాలు కాపాడింది'
ముంబై: గుర్తుతెలియని ఓ సాహస బాలిక తన మావయ్య ప్రాణాలు కాపాడిందని బాలీవుడ్ నటి రవీనా టాంటన్ వెల్లడించింది. మానవత్వం ఇంకా బతికేవుందనడానికి ఈ ఘటన అద్దం పట్టిందని తెలిపింది. డిసెంబర్ 18న చోటుచేసుకున్న ఈ ఘటన గురించి ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'మా మావయ్య, అత్తయ్య కలిసి కారులో సినిమాకు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక చీప్ జాక్ సమీంలోని జంక్షన్ లో ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అదే సమయంలో మా మావయ్య ఒంట్లో నలతగా అనిపించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. పక్కనే ఉన్న మా అత్తయ్య ఆయనకు సపర్యలు చేయసాగారు. ఆస్పత్రికి తీసుకెళదామంటే ట్రాఫిక్ లో కారు చిక్కుకుపోయింది. తర్వాత లైన్ లో ఉండి ఇదంతా గమనించి ఓ బాలిక తన కారులోంచి దిగి వాహనదారులందరినీ అప్రమత్తం చేసింది. ట్రాఫిక్ తొలగించి వారిని ఆస్పత్రికి వెళ్లేలా చేసింది. సమయానికి ఆయనను ఆస్పత్రికి తరలించకుంటే ఏం జరిగేదో తలచుకుంటేనే భయమేస్తోంది. ఆయన ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారు. తన ప్రాణాన్ని నిలబెట్టిన సాహస బాలికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వంపై నా నమ్మకాన్ని నిలబెట్టిన సాహస బాలికకు ధన్యవాదాలు' అని రవీనా టాండన్ ట్వీట్ చేసింది. A brave soul,a girl driving next lane saw my mum in law trying to massage dads heart,jumped out of her car realising emergency,cleared 3/4 — Raveena Tandon (@TandonRaveena) December 20, 2015 -
బుద్ధిచెప్పిన యువతి సాహసానికి రివార్డు
తైక్వాండో, వుషులలో జాతీయస్థాయి క్రీడాకారిణి అయిన ఓ యువతి.. తనను వేధించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొని, అతడిని పోలీసులకు కూడా పట్టించింది. దాంతో ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్న ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆమెకు రూ. 10 వేల రివార్డు అందజేశారు. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమెకు ఓ పతకం కూడా బహూకరించారు. ఈ యువతి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచిందని బస్సీ ప్రశంసించారు. అమ్మాయిలు ఆత్మరక్షణ కోసం ఇలాంటి విద్యల్లో శిక్షణ పొందాలని, అప్పుడే ఏమైనా ఆపద వచ్చినప్పుడు వాళ్లు తమను తాము కాపాడుకోగలరని ఆయన అన్నారు. మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్, రెడ్ బెల్టులు పొందిన ఆ యువతి.. పలు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా, రాజేష్ గుప్తా (28) అనే యువకుడు ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. దాంతో ఆమె అతగాడికి నాలుగు పంచ్‌లు బహూకరించి, తన ట్రైనర్ అమిత్ గోస్వామి సాయంతో పోలీసులకు అప్పగించింది.