'ఓ బాలిక మా మావయ్య ప్రాణాలు కాపాడింది' | Raveena's ill father in-law saved by 'brave soul' | Sakshi
Sakshi News home page

'ఓ బాలిక మా మావయ్య ప్రాణాలు కాపాడింది'

Published Sun, Dec 20 2015 4:51 PM | Last Updated on Sun, Sep 3 2017 2:18 PM

'ఓ బాలిక మా మావయ్య ప్రాణాలు కాపాడింది'

'ఓ బాలిక మా మావయ్య ప్రాణాలు కాపాడింది'

ముంబై: గుర్తుతెలియని ఓ సాహస బాలిక తన మావయ్య ప్రాణాలు కాపాడిందని బాలీవుడ్ నటి రవీనా టాంటన్ వెల్లడించింది. మానవత్వం ఇంకా బతికేవుందనడానికి ఈ ఘటన అద్దం పట్టిందని తెలిపింది. డిసెంబర్ 18న చోటుచేసుకున్న ఈ ఘటన గురించి ట్విటర్ ద్వారా వెల్లడించింది.

'మా మావయ్య, అత్తయ్య కలిసి కారులో సినిమాకు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక చీప్ జాక్ సమీంలోని జంక్షన్ లో ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అదే సమయంలో మా మావయ్య ఒంట్లో నలతగా అనిపించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. పక్కనే ఉన్న మా అత్తయ్య ఆయనకు సపర్యలు చేయసాగారు. ఆస్పత్రికి తీసుకెళదామంటే ట్రాఫిక్ లో కారు చిక్కుకుపోయింది.

తర్వాత లైన్ లో ఉండి ఇదంతా గమనించి ఓ బాలిక తన కారులోంచి దిగి వాహనదారులందరినీ అప్రమత్తం చేసింది. ట్రాఫిక్ తొలగించి వారిని ఆస్పత్రికి వెళ్లేలా చేసింది. సమయానికి ఆయనను ఆస్పత్రికి తరలించకుంటే ఏం జరిగేదో తలచుకుంటేనే భయమేస్తోంది. ఆయన ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారు. తన ప్రాణాన్ని నిలబెట్టిన సాహస బాలికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వంపై నా నమ్మకాన్ని నిలబెట్టిన సాహస బాలికకు ధన్యవాదాలు' అని రవీనా టాండన్ ట్వీట్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement