
సినీరంగంలో రాణించాలనే లక్ష్యం ఉన్నంత మాత్రాన అకాడమిక్ జర్నీని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. అయితే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం అనేది పెద్ద కళ. ఆ కళలో రాషా ఆరితేరింది.
ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ(Rasha Thadani) ‘ఆజాద్’(Azzad) సినిమాతో బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేయనుంది. ‘ఆజాద్’ సెట్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో సినిమా సెట్స్‌లో మేకప్‌లో ఉన్న రాషా 12వ తరగతి ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతూ కనిపిస్తుంది.
జాగ్రఫీ పరీక్ష కోసం శ్రద్ధగా ప్రిపేరవుతున్న రాషా వీడియోను చూసి నెటిజెనులు ప్రశంసలు కురిపించారు. ‘ఎంతైనా చదువు చదువే. సినిమాల్లోనే కాదు అకడమిక్‌గా కూడా రాషా విజయం సాధించాలి’ అని ఆశీర్వదించారు.
(చదవండి: కలల మేఘంపై అనూజ..)