పొడవాటి జుట్టు పోయిందని బోరున విలపించిన మహిళ.. వీడియో వైరల్.. | Husband Shaves Off Wife Long Hair Viral Video | Sakshi
Sakshi News home page

పొడవాటి జుట్టు పోయిందని బోరున విలపించిన భార్య.. భర్త చేసిన పనికి హ్యాట్సాఫ్‌..!

Published Fri, Mar 3 2023 9:32 PM | Last Updated on Fri, Mar 3 2023 9:43 PM

Husband Shaves Off Wife Long Hair Viral Video - Sakshi

మహిళలకు ఒత్తైన, పొడవాటి జుట్టంటే అమితమైన ఇష్టం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శిరోజాలను సంరక్షించుకుంటారు. అప్పుడప్పుడు జుట్టు కాస్త ఎక్కువ జుట్టు ఊడిపోతేనే విలవిల్లాడిపోతారు. అలాంటిది అందమైన జుట్టును మొత్తం క్షణాల్లో షేవ్ చేస్తే ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి..

ఓ మహిళ విషయంలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఆమె అందమైన జట్టును భర్తే దగ్గరుండి ట్రిమ్మర్‌తో షేవ్ చేశాడు. క్షణాల్లో ఆమె జుట్టుమొత్తం మాయమైంది. పొడవాటి జట్టు పోయి తల బోడిగుండులా మారడంతో ఆ మహిళ కన్నీటి పర్యంతమైంది. ఆమెను భర్త తన కౌగిలిలోకి తీసుకుని  ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది.

దీంతో చలించిపోయిన భర్త.. భార్య జుట్టు పోయిందని బాధపడటం చూసి తన జుట్టును కూడా ట్రిమ్మర్‌తో క్లీన్ షేవ్ చేసుకున్నాడు. ఆమె వద్దని చెబుతున్నా వినలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

అయితే ఈమె జుట్టును భర్తే షేవ్ చేయడానికి బలమైన కారణమే ఉంది. ఆమె క్యాన్సర్ బారినపడటంతో కీమో థెరపీ చికిత్స కోసం జుట్టును మొత్తం తీసేయాల్సి వచ్చింది. దీంతో భర్తే స్వయంగా ఈ పని చేశాడు.

వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఈ అందమైన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు చలించిపోయారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉందంటూ కొనియాడారు. క్యాన్సర్‌పై పోరాటంలో భార్యకు తోడుగా ఉంటున్న భర్తను అభినందించారు.
చదవండి: 48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఇది కదా మనకు కావాల్సింది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement