Colour Photo Frame Suhas Hike Remuneration For Next Movie, Deets Inside In Telugu - Sakshi
Sakshi News home page

Suhas: గుండు కొట్టించుకోవడానికి పారితోషికం పెంచేసిన హీరో

Published Wed, Dec 15 2021 3:45 PM | Last Updated on Wed, Dec 15 2021 4:30 PM

Suhas Demands More Remuneration For Shaving Head - Sakshi

Suhas Demands More Remuneration For His Next Movie: ‘కలర్‌ ఫోటో’ఫేమ్‌ సుహాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలె ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీలో నటించి ప్రశంసలు అందుకున్న సుహాస్‌ ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇవి కాకుండా మరో సినిమాకు కూడా రీసెంట్‌గా సైన్‌ చేశాడు. అయితే ఈ సినిమా కోసం సుహాస్‌ తన రెమ్యునరేషన్‌ను పెంచాడట. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ. 40 లక్షలు పారితోషికం అందుకుంటున్న సుహాస్‌ ఇప్పడు దానికి మరో రూ.5లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశాడట.

దీనికి కారణం ఏంటంటే..ఈ సినిమా మొత్తం సుహాస్‌ గుండుతోనే కనిపించాలట. దీంతో గుండుతో ఇతర సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో ఆ నష్టాన్ని భరించాలని మేకర్స్‌ని కోరడంతో వాళ్లు కూడా సుహాస్‌ అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement