shaves head
-
ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్ చేసి గుండుకొట్టించిన తల్లిదండ్రులు
సాక్షి, జగిత్యాల: కన్న కూతురు అని కూడా చూడకుండా తల్లిదండ్రులు హద్దు మీరారు. కోడలూ అనే విషయం మరచి మేన మామ మరింత కఠినంగా ప్రవర్తించారు.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడు నెలల తరబడి అక్కసు బయట పడింది.. తమ ఇష్టాన్ని కాదని వేరే యువకుడిని పెళ్లి చేసుకుందని కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరచి ఆమెను అత్తింటి నుంచి కిడ్నాప్ చేశారు.. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంగా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు. కన్నోళ్లు ఎన్ని హింసలు పెట్టినా కడకు కట్టుకున్నోడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది జగిత్యాలలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి కిడ్నాప్ చేశారు.. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషషన్‌కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది.ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.. -
గుండు కొట్టించుకోవడానికి రెమ్యునరేషన్ పెంచిన హీరో
Suhas Demands More Remuneration For His Next Movie: ‘కలర్ ఫోటో’ఫేమ్ సుహాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలె ‘ఫ్యామిలీ డ్రామా’ మూవీలో నటించి ప్రశంసలు అందుకున్న సుహాస్ ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇవి కాకుండా మరో సినిమాకు కూడా రీసెంట్గా సైన్ చేశాడు. అయితే ఈ సినిమా కోసం సుహాస్ తన రెమ్యునరేషన్‌ను పెంచాడట. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ. 40 లక్షలు పారితోషికం అందుకుంటున్న సుహాస్ ఇప్పడు దానికి మరో రూ.5లక్షలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దీనికి కారణం ఏంటంటే..ఈ సినిమా మొత్తం సుహాస్ గుండుతోనే కనిపించాలట. దీంతో గుండుతో ఇతర సినిమాలు చేసే అవకాశం లేకపోవడంతో ఆ నష్టాన్ని భరించాలని మేకర్స్‌ని కోరడంతో వాళ్లు కూడా సుహాస్ అడిగినంత ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. -
ఇదేం విడ్డూరం: మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాల్సిందే
కేప్‌టౌన్: వివాహం అంటే ఇద్దరు వ్యక్తులను మాత్రమే కాదు.. రెండు కుటుంబాలను ఒక్కటి చేస్తుంది. వివాహం అంటే ఓ ప్రమాణం. జీవితాంతం నీ చేతిని విడవను.. అన్ని వేళలా నీకు తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం. ప్రపంచవ్యాప్తంగా పెళ్లి అంటే ఇదే భావన కనిపిస్తుంది. విశ్వవ్యాప్తంగా వివాహ బంధానికి ఒక్కటే అర్థం ఉన్నప్పటికి.. పెళ్లి తంతు మాత్రం ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. వివిధ దేశాల్లో.. వేర్వేరు సమూహాల్లో వేర్వేరు ఆచారాలను పాటిస్తారు. వీటిలో కొన్ని చాలా వింతగా ఉంటాయి. పాటించడం కూడా చాలా కష్టం. అలాంటి ఓ వింత ఆచారం గురించి ఇప్పుడు మీరు చదవబోతున్నారు.ఆ వివరాలు.. మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాలి పెళ్లి అనగానే ఎక్కువ ప్రాధాన్యత అలంకరణకే ఇస్తారు. మరీ ముఖ్యంగా కేశాలంకరణకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక జుట్టు అంటే ఆడవారికి కాస్త ఎక్కువ అభిమానం. ఎంతో జాగ్రత్తగా కేశాలను సంరక్షించుకుంటారు. అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టును పెళ్లి కోసం కత్తిరించడం.. గుండు చేయించడం వంటివి చేయాలంటే.. వినడానికే చాలా బాధగా ఉంది కదా. కానీ దక్షిణాఫ్రికాకు చెందిన కొన్ని తెగల్లో ఆడవారు పెళ్లి తర్వత జుట్టు పెంచడానికి వీల్లేదు. వివాహానికి ముందే కత్తిరించడం, గుండు చేయించుకోవడం చేయాలి. (చదవండి: అరుదైన వ్యాధి: వృద్ధురాలిగా జన్మించిన చిన్నారి) బొరానా తెగ వాసుల వింత ఆచారం దక్షిణాఫ్రికాలోని ఇథోపియా, సోమాలియా దేశాల్లో స్థిరపడిన బొరానా తెగ ప్రజల్లో ఈ వింత ఆచారం ఉంది. ఈ తెగ ప్రజలు మొత్తం 500 మంది ఉంటారు. పితృస్వామ్య వ్యవస్థ. గ్రామం, జంతువులు, పరివారం బాధ్యతలన్నింటిని పురుషులే చూసుకుంటారు. ఆడవారు కేవలం ఇంటిని అలంకరించడం.. సంప్రదాయాలను పాటించడం మాత్రమే ఆడవారి బాధ్యత. (చదవండి: రివర్స్ జూ: బోనులో మనం.. స్వేచ్ఛగా సింహాలు) ఎంత ఎక్కువ జుట్టు కత్తిరిస్తే.. అంత మంచి భర్త ఇక ఈ తెగలో ఉన్న వింత ఆచారం ఏంటంటే.. పెళ్లికి ముందు వరకు మాత్రమే ఆడపిల్లలకు జుట్టు పెంచుకునే అవకాశం కల్పిస్తారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయంటే.. ఇకఅమ్మాయిలు వారి జుట్టును కత్తిరించుకోవాల్సిందే. ఇదేం విడ్డూరం అంటే.. మంచి భర్త కోసం ఇలా చేయక తప్పదంటారు ఇక్కడి ప్రజలు. ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి వరుడు దొరుకుతాడని.. ఏకంగా గుండు చేయించుకుంటే.. వారికి మంచి భర్త, అత్తింటి వారు లభిస్తారని బొరానా ప్రజల విశ్వాసం. అందుకే ఇక్కడ పెళ్లైన ఆడవారు గుండుతో.. లేదంటే పొట్టి జుట్టుతో దర్శనమిస్తారు. (చదవండి: కొన్ని క్షణాలపాటే నిల్చుంది.. క్లిక్‌మనిపించాడు!) ఎంత పొడవు జుట్టుంటే అంత అదృష్టవంతుడు ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. ఫోటోలు దిగకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారి శరీరం అంతా రక్తంతో తడిసిపోతుందని భావిస్తారు. ఇక్కడ మరో వింత ఆచారం ఏంటంటే.. మంచి భర్త కోసం ఆడవారు గుండు చేయించుకుంటే.. పొడవు జుట్టు ఉన్న వ్యక్తిని ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తారు ఇక్కడి జనాలు. చదవండి: 41 మంది మహిళలపై అత్యాచారాలు.. వెయ్యేండ్ల జైలు శిక్ష -
గుండుతో హీరోయిన్ రష్మిక!.. ఫోటోలు వైరల్
చెన్నై : రష్మిక మందన్నా.. అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతుండగా,ఊహించని పరిణామంతో రష్మిక ఫ్యాన్స్ షాకవుతున్నారు. అసలు నిజంగానే రష్మిక గుండు కొట్టించుకుందా అని ఆమె ఫాలోవర్స్ నెట్టింట సెర్చ్ చేయగా, అసలు విషయం బయటపడింది. రష్మికకు షాకిచ్చిన తమిళ తంబీలు తమిళనాడులోని కొన్ని సెలూన్ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రష్మిక గుండు ఫోటోలతో ఫన్నీ మీమ్స్ సృష్టిస్తూ మీమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. గతంలోనూ కీర్తి సురుష్, నయనతార సహా పలువురు టాప్ హీరోయిన్ల గుండు ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తమిళంలో రష్మిక నటించిన తొలి చిత్రం సుల్తాన్ బాక్స్‌ఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. చదవండి : అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక రష్మిక, పూజా హెగ్డే.. ఎవరు టాలీవుడ్ నెంబర్ 1? -
పూడ్చిపెట్టిన శవానికి గుండుగీశారు
సాక్షి, పటాన్చెరు టౌన్: పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి గుండు గీసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం పోచారం గ్రామపరిధిలోని గణపతిగూడెంకు చెందిన ఓ వృద్ధురాలు (65) ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సమాధి చేశారు. మంగళవారం మూడోరోజు కావడంతో కుటుంబ సభ్యులు సమాధి దగ్గరికి వెళ్లగా.. మృతురాలి తల వెంట్రుకలు బయట ఉన్నాయి. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీసి చూడగా శవానికి గుండు గీసి ఉంది. దీంతో పటాన్చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండుకొట్టాడు
ఢాకా: టిఫిన్‌లో వెంట్రుక వచ్చిందన్న కారణంతో ఓ వ్యక్తి భార్య(23)ను తీవ్రంగా అవమానించాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి.. బలవంతంగా గుండుకొట్టాడు. తీవ్ర విచారణమైన ఈ ఘటన బంగ్లాదేశ్‌ని జోయపుర్హట్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. బాబుల్ మండల్ వ్యక్తి తన భార్యను టిఫిన్ పెట్టమని కోరాడు. దీంతో ఆమె అప్పుడే చేసిన అల్ఫహారాన్ని భర్తకి వడ్డించింది. అయితే వంట చేసే సమయంలో ప్రమాదవశాత్తు దానిలో వెంట్రుక పడింది. ఇది గమనించని భార్య.. అలాగే వడ్డించింది. వెంట్రుకను చూసిన బాబుల్ భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై దాడికి దిగాడు. అప్పటికీ కసి తీరకపోవడంతో.. బ్లేడ్ తీసుకుని బలవంతంగా ఆమెకు గుండు చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే దీనిపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మహిళలకు కనీసం రక్షణ లేకుండా పోయిందని ఆందోళన చేపట్టారు. భార్యను ఇలా అవమానపరిచిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం అతనికి 14 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసు అధికారి తెలిపారు. -
గుండు చేయించుకుని.. భక్తితో నమస్కరిస్తూ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం మరోసారి వెలుగు చూసింది. దాదాపు 150 మందికి పైగా జూనియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. సీనియర్లకు సెల్యూట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సైఫాయ్ గ్రామంలోని ఉత్తర ప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ వీడియోలో 150 మంది వరకు ఫస్టియర్ విద్యార్థులు గుండు చేయించుకుని.. వరుసలో నడుస్తూ.. సీనియర్లకు భక్తితో నమస్కరిస్తున్నారు. ఆ సమయంలో ఓ సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్నాడు. కానీ అతడు దీన్ని ఆపడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం. దీని గురించి కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. ‘మా కళశాలలో ర్యాగింగ్‌ని నిషేధించి చాలా కాలమవుతుంది. కాలేజీలో ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నాం. ఇందుకు కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని కూడా నియమించాం. ప్రస్తుతం జరిగిన సంఘటన గురించి పూర్తిగా విచారణ జరుపుతాం. ఇందుకు బాధ్యులైన వారిమీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
గుండు చేయించుకున్నందుకు శిక్ష!
లండన్:ఓ 14 ఏళ్ల బాలుడు చేపట్టిన సేవా కార్యక్రమం కాస్తా అతనికి శాపంగా మారింది. యూకేకు చెందిన స్టాన్ లాక్ అనే బాలుడు ప్రాణాంతక క్యాన్సర్ కు నిధులు సమీకరించాలని తలపెట్టాడు. అందులో భాగంగానే తన తలపై జట్టును తొలగించుకుని నున్నటి గుండుతో ఫండ్స్ సమీకరించే పనిలో పడ్డాడు. ఆ బాలుడు అలా దర్శనమివ్వడం అతను చదువుతున్న స్కూల్ నిబంధనలను అతిక్రమించడమేనట. దీంతో బాలునిపై స్కూల్ యాజమాన్యం క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. ఆ బాలున్ని ఒక గదిలో బంధించి ఉంచింది. తిరిగి జట్టు పెరిగే వరకూ ఆ బాలుడు స్కూల్ పిల్లలకు దూరంగా ఉండాలని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆ బాలుడు క్యాన్సర్ పై అవేర్ నెస్ ను తీసుకురావడానికి చేసిన ప్రయత్నం అతని చదువుకి తీవ్ర అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగా ఆ బాలుడు క్యాన్సర్ నిధులను దాదాపు 500 డాలర్లు(రూ.ముప్ఫై వేలు) లను సేకరించడం గమనార్హం. -
బన్నీకి వైజాగ్, మరి మహేష్‌కు?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్‌ను ఫాలో అయితే సినిమా మంచి విజయం సాధిస్తుందని వారి నమ్మకం. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు వరకూ ఇందుకు అతీతులు కాదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే అల్లు అర్జున్‌కు 'వైజాగ్' సెంటిమెంట్ ఉంది. తన ప్రతి చిత్రంలో ఏదో ఒక సన్నివేశాన్ని అయినా విశాఖ బీచ్‌లో తీస్తే మంచి హిట్ వస్తుందని నమ్ముతాడు. వైజాగ్ సెంటిమెంట్ కూడా బన్నీకి వర్క్ అవుట్ అయ్యింది. ఇక మహేష్ తన ప్రతి చిత్రం విడుదలకు ముందు అజ్మీర్ దర్గాను సందర్శించుకోవటం ఆనవాయితీ. ఇటీవల విడుదలైన 'ఆగడు' కు ముందు కూడా మహేష్ ఈ దర్గాను సందర్శించుకున్నాడు. అలాగే తన చిత్రాలకు మూడు అక్షరాల టైటిల్ సెంటిమెంట్‌ను కూడా ఈ మిల్కీబాయ్ విశ్వసిస్తాడు. మంచు విష్ణు కూడా సినిమా టైటిల్ 'డి'తో మొదలయ్యేలా చూసుకుంటాడు. మెగాస్టార్ చిరంజీవికి కూడా వైట్ ప్యాంట్ సెంటిమెంట్ ఉంది. ఆయన తన చిత్రంలో కనీసం ఒక పాటలో అయినా వైట్ ప్యాంట్‌తో కనిపిస్తే ఆ సినిమా హిట్ అయినట్లే. ఇక నిర్మాతలు, దర్శకుల విషయానికి వస్తే సినిమా అయ్యేవరకూ ఒకరు గడ్డం తీయకపోతే, మరొకరు సినిమా విడుదలకు ముందు వెంకన్నకు తలనీలాలు అర్పించటం ఆనవాయితీ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తాను దర్శకత్వం వహించే సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు తన గడ్డం, మీసాన్ని కూడా ట్రిమ్ చేయరట. షూటింగ్ అయ్యాక తిరుమల వెంకన్న దర్శనం చేసుకుని గడ్డం తీస్తారట. పూరీ జగన్నాథ్ కూడా సెంట్మెంట్ను ఫాలో అవుతాడు. తన సినిమా స్టోరీలు రాసుకునేందుకు అతడు ఏకంగా బ్యాంకాక్ వెళ్లటం విశేషం. వినటానికి విడ్డూరంగా ఉన్నా అక్కడైతే మంచి ఆలోచనలు వస్తాయని అందుకే బ్యాంకాక్ వెళతానని పూరీ చెప్పటం విశేషం. దర్శకుడు శ్రీను వైట్లకు కూడా సింహాచలం అప్పన్న సెంటిమెంట్ ఉంది. తన ప్రతిసినిమా విడుదలకు ముందు సింహాచలం దర్శించుకోవటం ఆనవాయితీ అని శ్రీను వైట్ల తెలిపాడు. దర్శకుడు వీఎన్ ఆదిత్య తన సినిమా పూర్తయ్యాక పశ్చిమ గోదావరి జిల్లా ద్వారక తిరుమల ఆలయాన్ని దర్శించుకుని గుండు చేయించుకోవటం తెలిసిందే. నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఫేవరెట్ పుణ్యక్షేత్రం తిరుమల. తన ప్రతి సినిమా ఆడియో విడుదలకు ముందు తప్పనిసరిగా వెంకన్నను దర్శించుకుంటాడు. తన తొలి సినిమా నుంచి ఇదే అనుసరించే అతడు సినిమా విడుదలైన తర్వాత రోజు స్వామివారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకుంటాడు. ఇక అగ్ర నిర్మాత రామానాయుడుకి తన సినిమా తొలి కాపీని వెంకటేశ్వరుని పాదాల చెంత ఉంచటం ఆనవాయితీ. దిల్ సినిమాతో దిల్‌ను ఇంటిపేరుగా మార్చుకున్న నిర్మాత దిల్ రాజు కూడా సినిమా విడుదలయ్యే ముందురోజు వెంకన్నను దర్శించుకుని గుండు చేయించుకుంటాడు. అలాగే బెల్లంకొండ సురేష్ కూడా జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.