Jagtial: Parents Kidnapped Daughter, Shaved Her head Over Love Marriage - Sakshi
Sakshi News home page

వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్‌ చేసి గుండుకొట్టించి

Nov 15 2022 7:03 PM | Updated on Nov 15 2022 7:49 PM

Jagtial: Parents Kidnapped Daughter Shaved Her head Over Love Marriage - Sakshi

సాక్షి, జగిత్యాల: కన్న కూతురు అని కూడా చూడకుండా తల్లిదండ్రులు హద్దు మీరారు. కోడలూ అనే  విషయం మరచి మేన మామ మరింత కఠినంగా ప్రవర్తించారు.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడు నెలల తరబడి అక్కసు బయట పడింది.. తమ ఇష్టాన్ని కాదని వేరే యువకుడిని పెళ్లి చేసుకుందని కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరచి ఆమెను అత్తింటి నుంచి కిడ్నాప్ చేశారు.. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంగా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు.

కన్నోళ్లు ఎన్ని హింసలు పెట్టినా కడకు కట్టుకున్నోడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది జగిత్యాలలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి కిడ్నాప్ చేశారు.. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషషన్‌కు  చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది.ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement