
సాక్షి, పటాన్‌చెరు టౌన్: పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి గుండు గీసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పటాన్‌చెరు మండలం పోచారం గ్రామపరిధిలోని గణపతిగూడెంకు చెందిన ఓ వృద్ధురాలు (65) ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సమాధి చేశారు. మంగళవారం మూడోరోజు కావడంతో కుటుంబ సభ్యులు సమాధి దగ్గరికి వెళ్లగా.. మృతురాలి తల వెంట్రుకలు బయట ఉన్నాయి. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీసి చూడగా శవానికి గుండు గీసి ఉంది. దీంతో పటాన్‌చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment