
చెన్నై : రష్మిక మందన్నా.. అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతుండగా,ఊహించని పరిణామంతో రష్మిక ఫ్యాన్స్ షాకవుతున్నారు. అసలు నిజంగానే రష్మిక గుండు కొట్టించుకుందా అని ఆమె ఫాలోవర్స్ నెట్టింట సెర్చ్ చేయగా, అసలు విషయం బయటపడింది.
రష్మికకు షాకిచ్చిన తమిళ తంబీలు
తమిళనాడులోని కొన్ని సెలూన్ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రష్మిక గుండు ఫోటోలతో ఫన్నీ మీమ్స్ సృష్టిస్తూ మీమర్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. గతంలోనూ కీర్తి సురుష్, నయనతార సహా పలువురు టాప్ హీరోయిన్ల గుండు ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తమిళంలో రష్మిక నటించిన తొలి చిత్రం సుల్తాన్ బాక్స్‌ఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే.
చదవండి : అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక
రష్మిక, పూజా హెగ్డే.. ఎవరు టాలీవుడ్ నెంబర్ 1?
Comments
Please login to add a commentAdd a comment