saloons
-
ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి
సాక్షి, హైదరాబాద్: క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తలు, ఇతర కులాలు తమ వృత్తిలోకి ప్రవేశించి నాయీబ్రాహ్మణుల జీవనోపాధికి గండికొడుతున్నాయని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు యం. లింగం నాయీ ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ సహా పలు బడా సంస్థలు మోడ్రన్ సెలూన్స్ పేరుతో తమ పొట్ట కొడుతున్నాయని.. ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మోడ్రన్ సెలూన్స్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనకు కేసీఆర్ అండగా నిలబడ్డారని.. ప్రత్యేక రాష్ట్రం రాగానే క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ జీవో ఇస్తానని మాటిచ్చినట్టు గుర్తు చేశారు. ఇతర కులవృత్తులను కాపాడటానికి జీవోలు ఇచ్చినట్టుగానే తమకు కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థించారు. నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ద్వారా క్షౌరవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించాలని పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కాగా, రిలయన్స్ సెలూన్స్ వ్యాపారంలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు ఆందోళనలకు దిగుతున్నారు. -
గుండుతో హీరోయిన్ రష్మిక!.. ఫోటోలు వైరల్
చెన్నై : రష్మిక మందన్నా.. అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో నేషనల్ క్రష్‌గా మారిన రష్మికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతుండగా,ఊహించని పరిణామంతో రష్మిక ఫ్యాన్స్ షాకవుతున్నారు. అసలు నిజంగానే రష్మిక గుండు కొట్టించుకుందా అని ఆమె ఫాలోవర్స్ నెట్టింట సెర్చ్ చేయగా, అసలు విషయం బయటపడింది. రష్మికకు షాకిచ్చిన తమిళ తంబీలు తమిళనాడులోని కొన్ని సెలూన్ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రష్మిక గుండు ఫోటోలతో ఫన్నీ మీమ్స్ సృష్టిస్తూ మీమర్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నారు. గతంలోనూ కీర్తి సురుష్, నయనతార సహా పలువురు టాప్ హీరోయిన్ల గుండు ఫోటోలు నెట్టింట దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఇక తమిళంలో రష్మిక నటించిన తొలి చిత్రం సుల్తాన్ బాక్స్‌ఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. చదవండి : అందుకే ఆ హీరోతో నటించలేదు : రష్మిక రష్మిక, పూజా హెగ్డే.. ఎవరు టాలీవుడ్ నెంబర్ 1? -
సెలూన్లు, లాండ్రీలకు 100 యూనిట్లు ఫ్రీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ప్రతి నెలా 100 యూనిట్లలోపు విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేయాలని సర్కార్ భావిస్తోంది. సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీ షాపులకు గత డిసెంబర్ నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విద్యుత్ పంపిణీ సంస్థలు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి వివరాలను సేకరించాయి. ఇందులో ఏసీ సెలూన్లు, స్పాలు, వాషింగ్ మెషీన్లు వంటి యంత్రాలు వినియోగించే డ్రైక్లీనింగ్ షాపులు, లాండ్రీలకు మినహాయింపు ఇచ్చాయి. మిగిలిన సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లలో 85 శాతం వరకు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నట్టు సర్వేలో తేలింది. రాష్ట్రంలో 10,800 సెలూన్లు.. రాష్ట్రవ్యాప్తంగా 10,800 నాన్ ఏసీ సెలూన్లు ఉండగా, వీటికి ప్రతి నెలా రూ.90 లక్షల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఎలాంటి యంత్రాలు వినియోగించని ధోబీ ఘాట్లు, లాండ్రీలు రాష్ట్రం మొత్తం మీద కేవలం 900లోపు మాత్రమే ఉన్నట్టు సర్వేలో తేలింది. వీటన్నింటికి కలిపి నెలకు రూ.30 లక్షల లోపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. నాన్ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఏటా రూ.14.4 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నట్టు డిస్కంల పరిశీలనలో తేలింది. సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ సరఫరాపై ఇటీవల సీఎం కేసీఆర్‌కు పంపించిన నివేదికలో డిస్కంలు ఈ వివరాలను పొందుపర్చాయి. 85 శాతం నాన్ ఏసీ సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నాయని ఈ నివేదికలో పొందుపర్చాయి. ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెలూన్లు, లాండ్రీలు, ధోబీ ఘాట్లు కలిపి మొత్తం 12 వేల విద్యుత్ కనెక్షన్లను గుర్తించినట్టు నివేదించాయి. ఈ కేటగిరీల వినియోగదారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఏటా రూ.15 కోట్లను డిస్కంలకు సబ్సిడీగా ఇవ్వాల్సి ఉంటుంది. సీఎంతో సీఎండీల సమావేశంలో తుది నిర్ణయం.. విద్యుత్ సంస్థల సీఎండీలతో త్వరలో సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమీక్షలో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇటు గత డిసెంబర్ నుంచి చెల్లించిన విద్యుత్ బిల్లుల మాఫీ అంశంపై సైతం ప్రకటన వచ్చే అవకాశముంది. రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఉన్నికలు, మలి విడత మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత డిస్కంలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి 2021–22 సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపా దనలు, వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)ను సమర్పించే అవకాశముంది. టారిఫ్‌లో సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలను పొందుపర్చనున్నారు. -
‘సీఎం ఆదేశాలను పక్కదారి పట్టిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను విద్యుత్ అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ ఆరోపించారు. నాయీ బ్రాహ్మణులు నిర్వహిస్తున్న క్షౌరశాలలకు ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వగా... అవగాహనలేమితో అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ఇతర కులాలు, మతాల వారు నడుపుతున్న క్షౌరశాలలు, బ్యూటీపార్లర్లను కూడా ఈ పథకం కింద నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై అధికారులను ప్రశ్నించగా.. నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక ఆదేశాలు అందలేదని జవాబిచ్చారని తెలిపారు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే క్షౌరవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న క్షురకులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నాయీ బ్రాహ్మణులు నడుపుతున్న క్షౌరశాలలను మాత్రమే ఉచిత విద్యుత్ పథకంలో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. -
ఇస్మార్ట్ బార్బర్..
ముంబై : కరోనా కట్టడికి విధించిన సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం సెలూన్లు, బ్యూటీపార్లర్లకు అనుమతించడంతో కొల్హాపూర్‌కు చెందిన ఓ సెలూన్ ఓనర్ తన తొలి కస్టమర్‌కు బంగారు కత్తెరలతో హెయిర్ కట్ చేశారు. మూడు నెలల లాక్డౌన్ అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం మిషన్ బిగెన్ అగైన్ పేరిట సెలూన్లు, బార్బర్ షాపులు, బ్యూటీ పార్లర్లను ఈనెల 28 నుంచి అనుమతించింది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బార్బర్ షాపులు తిరిగి తెరిచేందుకు అనుమతి లభించడంతో కొల్హాపూర్‌కు చెందిన బార్బర్ షాపు యజమాని రాంభూ సంకల్ప్ ఖుషీ అయ్యారు. లాక్డౌన్ అనంతరం ఆదివారం తన సెలూన్‌కు వచ్చిన తొలి కస్టమర్‌కు సంకల్స్ బంగారు కత్తెరలతో హెయిర్ కట్ చేశారు. లాక్డౌన్ కారణంగా మూడు నెలలకు పైగా రాష్ట్రంలో సెలూన్ బిజినెస్ మూతపడటంతో సెలూన్ నిర్వాహకులు, సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని, ఇబ్బందులను అధిగమించలేని కొందరు బార్బర్ షాపు యజమానులు తనువు చాలించిన ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సెలూన్లకు అనుమతించడంతో తమ వ్యాపారం తిరిగి గాడినపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంతోషాన్ని తాను వినూత్నంగా వ్యక్తం చేయాలనుకున్నానని చెప్పారు. ఇప్పటివరకూ తాను దాచుకున్న డబ్బుతో పది తులాల బరువైన రెండు జతల బంగారు కత్తెరలను కొనుగోలు చేశానని తెలిపారు. తమ సెలూన్ తిరిగి తెరుచుకోవడంతో పాటు తోటి సెలూన్ నిర్వాహకుల సంతోషాన్ని వ్యక్తం చేసేందుకే తొలి కస్టమర్‌కు హెయిర్ కట్ చేసేందుకు బంగారు కత్తెర్లను ఉపయోగించానని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగానే ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నానని మాస్క్‌లు, శానిటైజర్లు వాడటంతో పాటు సీట్లను శానిటైజ్ చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి : జూలై 31 వరకు లాక్డౌన్ పొడిగింపు -
అక్కడ బ్యూటీ పార్లర్, సెలూన్లకు అనుమతి
సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి బ్యూటీ పార్లర్లను, సెలూన్లను తిరిగి తెరవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం గ్రామాల్లోని సెలూన్లను తెరవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వం తాజాగా తమిళనాడుకు చెందిన సెలున్లు, బ్యూటీ పార్లర్లకు కూడా తెరిచేందుకు అనుమతించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉండే రాష్ట్రాలలో తమిళనాడు రెండవ స్థానంలో ఉన్నందున చెన్నై, కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని వీటికి మాత్రం ప్రభుత్వం అనుమంతించలేదు. (బోయిన్పల్లి ఠాణాలో కరోనా కలకలం..) ఈ దుకాణాలు పాటించాల్సిన నియమాలు: దుకాణాల్లో ఎయిర్ కండిషనింగ్‌ను వాడకూడదు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దుకాణాలు తెరిచి ఉంచాలి. సిబ్బంది, కస్టమర్లు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి. సామాజిక దూరం పాటించడంతో పాటు కనీసం 5 సార్లు క్రిమిసంహారక మందును షాపులో స్ర్పే చేయాలి. ఇక కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బందిని కానీ కస్టమర్లను కానీ లోనికి అనుమతించకూడదు. కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బంది లేదా కస్టమర్‌ను లోపలికి అనుమతించకూడదు. సెలూన్లలో పనిచేసే సిబ్బంది ఎవరైనా కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తే వారికి పనిచేయడానికి అనుమతి లేదు. -
సేవకు కాదేది అనర్హం..
సేవా గుణం ఉండాలే కానీ, సేవకు కాదేది అనర్హం అని నిరూపిస్తున్నారు సిటీకి చెందిన హెయిర్ స్టైలిస్ట్స్..తాము చేసే వృత్తినే సేవకు అనుసంధానం చేశారు. తమ సేవల కోసం తమ దగ్గరకు రాలేని వారి దగ్గరకు తామే స్వయంగా వెళుతూ... ‘‘వి ఫర్ ఆర్ఫన్స్’’ పేరుతో సిటీలోని ఆర్ఫాన్హోమ్స్, వృద్ధాశ్రమాలు... వంటి చోట్లకు వెళ్లి ఉచితంగా హేర్ కటింగ్ చేస్తూ మనసుంటే సేవా మార్గాలెన్నో అని నిరూపిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ‘‘అనాథలకు తనకు తోచిన, నిరంతరాయంగా సాగే సహయం ఏదైనా చేయాలనే తపనతో ఉండేవాడినని, అందులోంచి పుట్టిన ఆలోచనే ‘‘వి ఫర్ ఆర్ఫన్స్’’ అని అంటున్నాడు ముషీరబాద్లో సెలూన్‌ని నిర్వహించే రాజేష్. 2018 నుంచి ఈ కార్యక్రమంలో భాగంగా సిటీలోనే దాదాపు 30 వరకు అనాథ ఆశ్రమాలు,స్వచ్చంద సేవా సంస్థల్లోని పిల్లలకు, వృద్ధులకు అంతేకాకుండా అంధులకు,రోడ్లపైన ఉండే మానసిక వికలాంగుల వద్దకు స్వయంగా తన టీంతో వెళ్ళి ఉచితంగా కటింగ్ చేస్తామని చెప్పాడు. సిటీలోనే కాకుండా చౌటుప్పల్, స్టేషన్ ఘన్పూర్, నర్సాపూర్ తదితర ప్రాంతాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నాడు. ఇప్పటి వరకు 40 ఆశ్రమాల్లో 3500 మందికి పైగా తమ సేవలు అందించామన్నారు. సెలవుకు బదులు సేవ.. తను చేస్తున్న కార్యక్రమాలు నచ్చి సిటీలోని ప్రముఖ హేర్ సెలూన్స్‌లో పనిచేసే దాదాపు 40 మంది సభ్యులుగా చేరారని రాకేష్ చెప్పారు. వీరంతా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ సేవలు అందిస్తున్నారన్నారు. తమకు సెలవు దినమైన మంగళవారం రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ప్రతీ ఆశ్రమానికి నెలలో కనీసం ఒకసారైనా వెళ్ళి ఈ సేవలు అందిస్తామని తెలిపాడు. ప్రతీ ఆదివారం తన సెలూన్లో వచ్చే పూర్తి ఆదాయాన్ని ఈ కార్యక్రమ నిర్వాహణకు ఉపయోగిస్తానని,ఈ కార్యక్రమ నిర్వాహణకు ఒక ఆశ్రమానికి 1500 వరకు ఖర్చువుతుందని, ఎవరి దగ్గరా నిధులు సేకరించమని రాకేష్ తెలిపాడు. -
ద్వితీయ శ్రేణికీ బ్యూటీ, వెల్నెస్ సేవలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇపుడు సౌందర్య పోషణ అనేది ఎగువ తరగతికే కాదు!! మధ్య తరగతికి... ఇంకా చెప్పాలంటే దిగువ మధ్య తరగతికీ విస్తరిస్తోంది. మెట్రో నగరాల నుంచి ద్వితీయ శ్రేణి పట్టణాలకూ పాకింది. కాకపోతే ఎక్కడికక్కడ సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు విడి విడిగానే ఉంటున్నాయి. చెయిన్లు నిర్వహించేవన్నీ పెద్ద పెద్ద సంస్థలే!! వారి ఫ్రాంఛైజీ అంటే మాటలు కాదు!. ఇదిగో... సరిగ్గా ఈ అంశమే తమను ‘వసుంధర సెలూన్స్’ ఏర్పాటు చేయటానికి పురి గొల్పిందంటారు నాగేశ్, అరుణ కుమారి. దిగువ మధ్య తరగతి మహిళలనూ సహ యజమానులుగా చేస్తూ ఆరంభించిన తమ స్టార్టప్ గురించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే... ‘‘ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ వ్యవస్థీకృతమైన బ్యూటీ, వెల్నెస్ సేవలందించాలన్నదే మా ఉద్దేశం. దీనికోసమే డాజిల్ సెలూన్ అండ్ స్పా ప్రై.లి, వసుంధర బ్యూటీ అండ్ స్పా పేరిట రెండు బ్రాండ్లను మార్కెట్‌కు పరిచయం చేశాం. వసుంధర బ్రాండ్ పూర్తిగా మహిళల కోసమే. నేను అమెరికాలో పలు కంపెనీల్లో పని చేసి 2007లో ఇండియాకు తిరిగొచ్చా. ఇక్కడ పలు బ్యూటీ అండ్ వెల్నెస్ కంపెనీలకు ఈఆర్పీ వంటి ఐటీ సొల్యూషన్స్ అందించేవాణ్ణి. అప్పుడే సొంతంగా బ్యూటీ సెలూన్ పెట్టాలని నిర్ణయించుకొని 2012లో డాజిల్ సెలూన్స్‌ను ప్రారంభించాం. మహిళలకు హెయిర్ వాష్, ఫేషియల్, బాడీ మసాజ్ వంటి ఇతరత్రా బ్యూటీ సేవలందిస్తున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో బ్యూటీ సేవలు, అది కూడా అందుబాటు ధరలకు అందించడమే వసుంధర లక్ష్యం. ప్రస్తుతం విశాఖపట్నం, రాజమండ్రి, భీమవరం, కాకినాడ, హైదరాబాద్‌లలో 8 బ్రాంచీలున్నాయి. వచ్చే మూడేళ్లలో 100 బ్రాంచీలకు చేర్చడం లక్ష్యం. మూడు నెలల్లో కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో సెలూన్లను ప్రారంభించనున్నాం. ఆయిల్స్, క్రీములు ఇతరత్రా బ్యూటీ ఉత్పత్తులను ముంబై నుంచి తెస్తాం. శ్రీలంక నుంచి ప్రత్యేకంగా ఆయుర్వేద ఫేషియల్ ఆయిల్స్‌లను దిగుమతి చేసుకుంటున్నాం. విదేశీ ఉత్పత్తులు వినియోగిస్తున్నప్పటికీ స్థానిక సెలూన్లతో పోలిస్తే మా దాంట్లో ధర 30–40 శాతం తక్కువే ఉంటుంది. హైదరాబాద్‌లో మహిళలకు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాం. ప్రస్తుతానికైతే వసుంధరలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ సేవలను విస్తరిస్తాం. వసుంధర సెలూన్ల ఏర్పాటుతో ఔత్సాహిక మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నాం. పెట్టుబడుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడాతో (బీఓబీ) ఒప్పందం చేసుకున్నాం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.30 లక్షల వరకు ముద్ర రుణాలను మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం మా సంస్థలో 52 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు రూ.1.5 కోట్ల పెట్టుబడులు పెట్టాం. విస్తరణ, బ్రాండింగ్ కోసం రూ.4.5 కోట్ల పెట్టుబడులు అవసరం. 60 శాతం నిధుల కోసం బీఓబీతో చర్చలు జరిపాం. ఏడాదిలో నిధులను సమీకరిస్తాం’’ అని నాగేశ్, అరుణ కుమారి ధీమా వ్యక్తంచేశారు. -
సెలూన్లకు టర్కీ మగాళ్ల పరుగులు
అంకారా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారనే భయంతో టర్కీలోని మగవాళ్లంతా తమ గడ్డాలను తీయించుకుంటున్నారు. ఆగస్టు 7న పెద్ద గడ్డాలతో ఉన్న 19 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఎగీనా రాష్ట్రం మనీసాలో పట్టుబడ్డారు. గడ్డాలు పెంచుకుంటున్న వారిని ఉగ్రవాదులుగా ప్రజలు అనుమానిస్తున్నారని, దీంతో వీరంతా సెలూన్లకు వస్తున్నారని అక్కడి హెయిర్ డ్రెస్సెర్స్ అసోసియేషన్ తెలిపింది. గతంలో ఇక్కడి వారంతా కొత్త స్టైల్ కోసమని సుదీర్ఘకాలంగా గడ్డాలు పెంచేవారని, దీనివల్ల తమ సెలూన్ల వ్యాపారాలు సన్నగిల్లాయని వివరించింది.