సాక్షి, చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి బ్యూటీ పార్లర్లను, సెలూన్లను తిరిగి తెరవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ను మే 31 వరకు పొడగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేవలం గ్రామాల్లోని సెలూన్లను తెరవడానికి అనుమతినిచ్చిన ప్రభుత్వం తాజాగా తమిళనాడుకు చెందిన సెలున్‌లు, బ్యూటీ పార్లర్లకు కూడా తెరిచేందుకు అనుమతించింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా ఉండే రాష్ట్రాలలో తమిళనాడు రెండవ స్థానంలో ఉన్నందున చెన్నై, కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని వీటికి మాత్రం ప్రభుత్వం అనుమంతించలేదు. (బోయిన్‌పల్లి ఠాణాలో కరోనా కలకలం..)
ఈ దుకాణాలు పాటించాల్సిన నియమాలు:
- దుకాణాల్లో ఎయిర్ కండిషనింగ్‌ను వాడకూడదు.
- ఉదయం 7 నుంచి సాయంత్రం 7 దుకాణాలు తెరిచి ఉంచాలి.
- సిబ్బంది, కస్టమర్లు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి.
- సామాజిక దూరం పాటించడంతో పాటు కనీసం 5 సార్లు క్రిమిసంహారక మందును షాపులో స్ర్పే చేయాలి.
- ఇక కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బందిని కానీ కస్టమర్‌లను కానీ లోనికి అనుమతించకూడదు.
- కరోనా లక్షణాలతో ఉన్న సిబ్బంది లేదా కస్టమర్‌ను లోపలికి అనుమతించకూడదు.
- సెలూన్‌లలో పనిచేసే సిబ్బంది ఎవరైనా కంటైన్మెంట్ జోన్‌లలో నివసిస్తే వారికి పనిచేయడానికి అనుమతి లేదు.
Comments
Please login to add a commentAdd a comment