
చెన్నై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ మహమ్మారి సామాన్య ప్రజానీకం నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ వైరస్ బారిన పడగా తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె.పీ అన్బళగన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మద్రాస్ ఇన్‌స్టిటూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామాటాలజీ వెల్లడించింది. (తమిళనాడులో లాక్‌డౌన్..జూలై 31 వరకు)
కరోనాకు సంబంధించిన లక్షణాలు ముందుగా మంత్రికి లేవని వైద్యులు తెలిపారు. ఆయనకు సిటీ స్కాన్ పరీక్ష చేసినప్పటికీ ఎటువంటి లక్షణాలు కనిపించలేదనన్నారు. అయితే ముందు జాగ్రత్తగా మంత్రి అన్బళగన్‌ను పర్యవేక్షణలో ఉంచామని పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా మంత్రికి సంబంధించిన రెండో శాంపిల్ ద్వారా కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు తెలిపారు. ఆయన జూన్ 29 నుంచి స్వల్ప దగ్గుతో ఆస్పత్రికి వస్తే చికిత్స అందించినట్లు తెలిపారు. ప్రస్తుతం మంత్రి పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు దామోదరన్ కరోనా వైరస్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. (కరోనా నుంచి కోలుకున్న బండ్ల గణేష్)
Comments
Please login to add a commentAdd a comment