![Tamil Nadu Government Imposed Total Lockdown Two Weeks From May 10 Onwards - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/8/corona.jpg.webp?itok=0gl3pIH5)
సాక్షి, చెన్నై: దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడిలో భాగంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ విధిందిచిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లాక్‌డౌన్ ఎల్లుండి( సోమవారం) నుంచి అమల్లో ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల మే 10 నుంచి 2వారాలపాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. శుక్రవారం సీఎం స్టాలిన్ కలెక్టర్లతో కరోనాపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవటంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 10న ఉయదం 4 గంటల నుంచి మే 24 తేది ఉదయం 4 గంటల వరకు తమిళానాడులో పూర్తి లాక్‌డౌన్ కొనసాగనుంది. మధ్యాహ్నం 12వరకు అత్యవసర సేవలకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌లో బ్యాంకులు (50 శాతం సిబ్బందితో), రేషన్ షాపులకు అనుమతి ఉన్నట్లు తెలిపింది. రెస్టారెంట్లలో పార్సిల్ సౌకర్యం ఉంటుందని.. క్యాబ్‌లు, ఆటో సేవలు కేవలం ఆస్పత్రి, వివాహ, అంత్యక్రియకు మాత్రమే అనుమతిస్తున్నట్లు లాక్‌డౌన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
చదవండి: కరోనా నుంచి కోలుకున్నారా? ఇక వీటిని పాడేయాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment