5 Transgenders Arrested For Shaving Man Head And Urinated On Him In Uttar Pradesh Kasganj - Sakshi
Sakshi News home page

అమానవీయం: వ్యక్తిపై ట్రాన్స్‌జెండర్ల దాడి.. గుండు కొట్టించి.. ఆపై మూత్ర విసర్జన చేసి..

Published Sun, Jul 30 2023 7:56 PM | Last Updated on Mon, Jul 31 2023 11:43 AM

Transgenders Arrested For Shaving Man Head Urinating On Him - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్‌ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఐదుగురు ట్రాన్స్‌జండర్లు కలిసి ఓ వ్యక్తికి గుండు కొట్టింటారు. అనంతరం అతనిపై మూత్రం పోశారు. అంతేకాకుండా బాధితుని వద్ద నుంచి రూ.10 వేలు దోచుకెళ్లారు. జులై 26న ఈ ఘటన జరిగింది. కాగా.. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రాఫికుల్.. నిందితురాలి ఇంట్లో పనిచేసేవాడు. ఇటీవల అక్కడ పని మానేసి మరో ట్రాన్స్‌జండర్ ఇంట్లో పనిచేయడం ప్రారంభించాడు. ఈ మార్పుపై కోపాన్ని పెంచుకున్న నిందితురాలు.. రాఫికుల్‌ని మార్గమధ్యలో పట్టుకుని గుండు కొట్టించింది. అనంతరం అతనిపై మూత్రం పోశారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాకుండా మూత్రం తాగాలని ఒత్తిడి చేసినట్లు వెల్లడించాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. పోలీసుల దృష్టికి వెళ్లింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి: అమానవీయం: నీళ్లు అడిగాడని.. దివ్యాంగుడ్ని పోలీసులు చితకబాదారు.. వీడియో వైరల్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement