సింగిల్ బ్లేడే సురక్షితం! | single blade is safety | Sakshi
Sakshi News home page

సింగిల్ బ్లేడే సురక్షితం!

Published Tue, Feb 18 2014 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

సింగిల్ బ్లేడే సురక్షితం!

సింగిల్ బ్లేడే సురక్షితం!

 సలహా

 కోట్లాది మంది మగాళ్లకి గడ్డం గీసుకోవడం ఓ దినచర్య. మగాడి జుట్టుకోసం కనిపెట్టిన ఉత్పత్తుల కంటే... ఈ గడ్డం కోసం వస్తున్న ఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు. రేజర్లు-వాటిలో రకాలకు అయితే లెక్కే లేదు. కానీ, ప్రతి అడ్వాన్స్‌డ్ వెర్షనూ మంచిదనుకోవడం తప్పు. దేని విషయంలోనైనా కూడా ఉపయోగాలు, నష్టాలు... రెండూ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక విలువైన సలహా ఏంటంటే... గడ్డం గీసుకునేటప్పుడు సింగిల్ బ్లేడ్ రేజర్ వాడటం మంచిదట. ఇపుడు నాలుగైదు బ్లేడ్లున్న రేజర్లు కూడా వస్తున్నాయి. వీటిని తరచూ వాడటం వల్ల ముఖచర్మంపై అనవసర ఒత్తిడి పడుతుంది. చర్మంలో మృదుత్వం పోతుంది. మంట పుడుతుంది. అందులే సింగిల్ బ్లేడే సేఫంటున్నారు నిపుణులు. దాన్ని వాడటం కాస్త పాత పద్ధతే అయినా చర్మానికి మాత్రం మంచిది. కాబట్టి... సింగిల్ బ్లేడుకి షిఫ్టయిపోండి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement