razer
-
భారీ ర్యామ్‌తో రేజర్ ఫోన్ 2..ధర ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీదారు రేజర్ తన నూతన స్మార్ట్‌ఫోన్ రేజర్ ఫోన్ 2 ను తీసుకొచ్చింది. రేజర్ ఫోన్ సిరీస్ గేమింగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను అమెరికా, కెనడా, యూకే, యూరప్ మార్కెట్లలో విడుదల చేసింది. ఇతర దేశాల్లోనూ ఈ ఏడాది చివరి నాటికవ లభ్యం కానుంది. భారీ ర్యామ్, వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ , ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ లాంటి అద్భుత ఫీచర్లతో లాంచ్ చేసిన ఈస్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ.59,500 గా ఉండనుంది. రేజర్ ఫోన్2 ఫీచర్లు 5.72 ఇంచెస్ డిస్ప్లే 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 +12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీని -
నిర్లక్ష్యం ఆమె కాలును.. తినేసింది !
లండన్ : నిర్లక్ష్యం ఆమె పాలిట శాపంగా మారింది. మాంసం తినే ఓ క్రిమి ఆమె కాలును తీవ్రంగా తొలిచి తినేసింది. కుడికాలును షేవ్ చేసుకుంటుండగా అయిన చిన్నగాటు ప్రమాదకరంగా మారి కాలే తీసేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని బ్రీష్టన్‌కు చెందిన తాన్యా జెర్నోజుకో అనే మహిళ కొన్ని నెలల ముందు తన కుడికాలును రేజర్‌తో షేవ్ చేసుకుంటుండగా చిన్నగాయం అయ్యింది. అయితే చిన్న గాయమే కదా అని ఆమె ఊరకుండిపోయింది. కొద్దిరోజుల తర్వాత అది చిన్నపాటి నాణెం సైజులోకి మారింది. అయినా ఆమె పట్టించుకోకపోవటంతో అది ఏకంగా పెద్దసెల్‌ఫోన్ సైజులోకి పెరిగి చర్మానికి రంధ్రం చేసింది. ఇన్ఫెక్షన్ అలా పెరిగిపోవటంతో ఇక చేసేదేమీలేక ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్లు రాసిన మందులు,క్రీములు ఇలా అన్నీ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డాక్టర్లు చేసిన పరీక్షల్లో ఆమెకున్న క్రోనిక్ లెగ్ అల్సర్ కాస్తా గ్యాంగ్రెనే(దెబ్బతిన్న శరీర భాగం కుళ్లిపోయే స్థితి)గా మారిందని తేలింది. ఆమెకు డయాబెటిస్ ఉండటంతో గాయం మానటం కష్టమని, కాలును తీసేయటం మంచిదని డాక్టర్లు సలహాయిచ్చారు. డాక్టర్ల సలహా మేరకు ఆమె తన కుడి కాలును తీసేయించుకుంది. నిర్లక్ష్యమే తన ఈ పరిస్థికి కారణమని ఏ పరిస్థితిలోనూ నిర్లక్ష్యం కూడదని తాన్యా సలహా ఇస్తోంది. -
సింగిల్ బ్లేడే సురక్షితం!
సలహా కోట్లాది మంది మగాళ్లకి గడ్డం గీసుకోవడం ఓ దినచర్య. మగాడి జుట్టుకోసం కనిపెట్టిన ఉత్పత్తుల కంటే... ఈ గడ్డం కోసం వస్తున్న ఉత్పత్తులే ఎక్కువగా ఉన్నాయంటే ఆశ్చర్యమేమీ లేదు. రేజర్లు-వాటిలో రకాలకు అయితే లెక్కే లేదు. కానీ, ప్రతి అడ్వాన్స్డ్ వెర్షనూ మంచిదనుకోవడం తప్పు. దేని విషయంలోనైనా కూడా ఉపయోగాలు, నష్టాలు... రెండూ తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక విలువైన సలహా ఏంటంటే... గడ్డం గీసుకునేటప్పుడు సింగిల్ బ్లేడ్ రేజర్ వాడటం మంచిదట. ఇపుడు నాలుగైదు బ్లేడ్లున్న రేజర్లు కూడా వస్తున్నాయి. వీటిని తరచూ వాడటం వల్ల ముఖచర్మంపై అనవసర ఒత్తిడి పడుతుంది. చర్మంలో మృదుత్వం పోతుంది. మంట పుడుతుంది. అందులే సింగిల్ బ్లేడే సేఫంటున్నారు నిపుణులు. దాన్ని వాడటం కాస్త పాత పద్ధతే అయినా చర్మానికి మాత్రం మంచిది. కాబట్టి... సింగిల్ బ్లేడుకి షిఫ్టయిపోండి!