ఇన్ గ్రోయిన్ హెయిర్ అమెరికాలో ఒక వ్యక్తిని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. తీవ్రమైన బ్లడ్ ఇన్‌ఫెక్షన్ సెప్పిస్ బారిన పడ్డాడు. వైద్యులు కూడా చేతులెత్తేశారు. బతికే అవకాశం చాలా తక్కువని చెప్పారు.చివరికి బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. కానీ అనూహ్యంగా.. కోలుకోవడం విశేషంగా నిలిచింది..
వివరాలు ఇలా ఉన్నాయి
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అమెరికాటెక్సాస్ రాష్ట్రానికి చెందిన36 ఏళ్ల స్టీవెన్ స్పైనాల్ గజ్జల వద్ద ఉన్న ఇన్‌గ్రోన్ హెయిర్‌ను తొలగించుకున్నాడు. దీనికి ఇన్‌ఫెక్షన్ సెప్సిస్ సోకి చివరికి సెప్సిస్‌షాక్‌కు దారి తీసింది. రక్తం గడ్డకట్టడం, డబుల్ న్యుమోనియా, అవయవ వైఫల్యం, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కి దారితీసింది. ఇన్ఫెక్షన్ అతని గుండెకు కూడా చేరింది. దీంతొ కోమాలోకి వెళ్లి పోయాడు. ఇక కష్టం అని ప్రకటించిన వైద్యులు చివరి ఆశగా వెంటిలేటర్‌పై ఉంచి దాదాపు నెల రోజుల పాటు చికిత్స అందించారు. అదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించిన స్టీవెన్ కొద్దిగా కోలుకున్నాడు. మెదడుకు ఎలాంటి నష్టం జరగకుండా, పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
అతని సోదరి మిచెల్ పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో సమాచారం ప్రకారం 2022 ఏడాది చివరల్లో అనారోగ్యానికి గురైన స్టీవెన్ 2023 చివరినాటికి కొద్దిగా బలం పుంజు కున్నాడంటూ స్టీవెన్ రికవరీ జర్నీనీ షేర్ చేసింది. ఇందు కోసం 8వేల డాలర్లు ఖర్చు అయినట్టు తెలిపింది. గోఫండ్‌మీ ద్వారా విరాళాలకోసం అభ్యర్థించింది.
(ఇన్ గ్రోయిన్ హెయిర్: పురుషులు ఛాతీ, చంకలు, వీపు, గజ్జలు తదితర ప్రదేశాల్లో ముఖ్యంగా వ్యతిరేకదిశలో(ఎదురు) షేవ్ చేసుకున్నా, కట్ అయినా వెంట్రుకల కుదుళ్ల వద్ద ఎరుపు దురద గడ్డలు వస్తాయి. ఇవి చాలా నొప్పిగా ఉంటాయి. అలాగే వీటిమీద రాంగ్ డైరెక్షన్‌లో వెంట్రుకలొస్తాయి. దీనికి సాధారణంగా వైద్య చికిత్స అవసరం లేదు. వాటికవే తగ్గిపోతాయి. ఇన్ఫెక్షన్ షేవింగ్ జెల్ లేదా క్రీమ్ లాంటివి వాడతారు. ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం ప్రమాదం. నిర్లక్ష్యం చేస్తే సెప్సిస్ అనే ప్రాణాంతక వ్యాధికి దారితీస్తుంది. దీన్నే " సైలెంట్ కిల్లర్" అని పిలుస్తారు. మహిళలల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంచనా ప్రకారం ప్రతీ ఏడాది 1.7 మిలియన్ల అమెరికన్లు సెప్సిస్ బారిన పడుతున్నారు. ఏటా దాదాపు 270,000 మంది మరణిస్తున్నారు.)
Comments
Please login to add a commentAdd a comment