ఒక్కొసారి నిరాశగా అన్న మాటలు కూడా ఆయుధంగా మారతాయి. అవి వరంగా మారి గెలిచే ఆసక్తిని రేపుతాయి కూడా. బహుశా అందుకేనేమో పెద్దలు విమర్శిస్తున్నారని కూర్చొకు వాటినే ఎదిగేందుకు ఉపయోగపడే మెట్లుగా భావిస్తే విజయం నీ పాదాక్రాతం అని అన్నారు. ఇది జరిగే అవకాశమే లేదు అన్నవి, ఒక్క శాతం కూడా గెలిచే అవకాశం లేనివి కూడా ఏదో ఒక ఊహించని మలుపులో గెలుపు తీరం అందుతుంది, ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. అచ్చం అలాంటి అద్భుత ఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విషయంలో ఈ అద్భుతం జరిగింది.
యూఎస్‌లో అలెగ్జెండర్ అనే వ్యక్తి 1946లో జన్మించాడు. ఆ టైంలో యూఎస్ అంతట పోలియో ప్రబలంగా ఉంది. అతను కూడా ఈ పోలియో బారినే పడ్డాడు. అయితే ఇతని కేసు మాత్రం యూఎస్ చరిత్రలో పిల్లలకు సోకిన 58 వేల పోలియో కేసుల్లో ఘోరమైనది. అలెగ్జెండర్ ఆరేళ్ల ప్రాయంలో ఈ పోలియో బారిన పడ్డాడు. ఎంత ఘోరంగా అంటే.. అతడి వెన్నుపాముని చచ్చుపడేలా చేసి ప్రాణాంతకంగా మారింది. దీని కారణంగా అలెగ్జాండర్ ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నాడు. నిజానికి ఈ పోలీయో వ్యాధి పోలియోన్ లేదా పోలియోమైలిటిస్ అనే పోలియో వైరస్ వల్ల వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడమో లేదా ప్రాణాంతకంగా మారవచ్చు. పోలియో వ్యాక్సిన్‌ని యూఎస్ 1955లోనే ఆమోదించింది. పిల్లలందరికీ అందించింది కూడా. 1979 కల్లా దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది కూడా.
అప్పటికే అలెగ్జాండర్‌కి జరగకూడని నష్టం జరిగిపోయింది. శరీరం అంతా చచ్చుబడి శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న అలెగ్జాండర్‌కి ట్రాకియోటమీ అనే ఇనుప ఊపిరితిత్తులు అమర్చారు. అది అతని మెదడు నుంచి కాలి వరకు కవర్ అయ్యి ఉంటుంది. అది అతన్ని కదలడానికి లేదా దగ్గడానికి అనుమతించదు. నిజం చెప్పలంటే అతను ఎప్పటి వరకు బతుకుతాడనేది కూడా చెప్పలేం. ఏ క్షణమైన చనిపోవచ్చు. ఏదో వైద్యులు అతన్ని కాపాడేందుకు అమర్చిన పరికరమై తప్ప అతని లైఫ్ టైం పెంచేది మాత్రం కాదు. వైద్యులు కూడా అతను బతకడు, బతికే అవకాశం లేదనే భావించారు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడనే అన్నారు. అయితే అతడు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 70 ఏళ్లు అలానే కదలకుండా ఆ ఇనుప యంత్రంతో బతికాడు. ఐతే అత్యాధునిక యంత్రాలు వచ్చినప్పటికీ అతడి శరీరం ఆ భారి ఇనుమ మెషిన్‌కి అలవాటుపడటంతో ఈ తేలికపాటి ఆధునిక యంత్రాలు అమర్చడం అసాధ్యమయ్యింది.
అసలు చెప్పాలంటే అతడు ఉన్న పరిస్థితి తలుచుకుని దిగులుతో చనిపోతారు. కానీ అతడు ఎంతో గుండె నిబ్బరంతో ఆ సమస్యతో పోరాడుతూనే బతికి చూపించాడు. పైగా పాఠశాల విద్యను పూర్తి చేశాడు. న్యాయశాస్త్రంలో పట్టుభద్రుడవ్వడమే గాక చాలా ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశాడు కూడా. కదలేందుకు వీలు లేకపోయినా నిరాశ చెందలేదు. కాలు మెదపకుండా జీవితాంత ఆ బరువైన ఇనుప మెషిన్‌తో అలానే బెడ్‌కి పరిమితమైన కూడా.. "జీవించాలి" అనే ఆశను వదులుకోలేదు. ఎలాగో చనిపోతాడని తెలిసి కూడా ఏదో ఒకటి చేస్తూ.. బతకగడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మొత్తం మిషన్‌తో ఓ డబ్బాలో ఉన్న మొండెలా కనిపిస్తాడు అలెగ్జాండర్.
ఏ క్షణంలోనూ కొద్దిపాటి నిరాశకు, నిస్ప్రుహను దరిచేరనివ్వకుండా బతికి చూపడు. అతడి ఈ తెగువే అత్యంత పొడవైనా ఐరన్ ఊపిరితిత్తులు కలిగినా వృద్ధ రోగిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కేలా చేసింది. అతడికి వైద్యం చేసిన వైద్యులే చనిపోయారేమో కానీ అత్యంత దయనీయ స్థితిలో బతకీడుస్తూ కూడా తాను పూర్ణాయుష్కుడినే అని నిరూపించాడు. వైద్యులు సైతం అతడు ఇప్పటి వరకు జీవించి ఉండటం అద్భుతమని చెప్పారు. క్షణికావేశంలో అకృత్యాలకు పాల్పడే యువతకు, అనుకున్నది జరగలేదన్న వ్యథతో బతుకు ముగించుకోవాలన్న వ్యక్తులందరీకి అతడు స్ఫూర్తి. ఓపికతో ఎలా వ్యవహిరించాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా సంయమనంతో ఉండి అందరూ ముక్కున వేలేసుకునేలా ఎలా జీవించాలో అతడు చేసి చూపించాడు.
(చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!)
Comments
Please login to add a commentAdd a comment