
న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. కన్హయ్యతో పాటు మరో 14 మంది విద్యార్థులపై విశ్వవిద్యాలయం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తప్పుపడుతూ ఇది సహజ న్యాయ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్ వి.కామేశ్వర్‌రావు వ్యాఖ్యానించారు. ఈ అంశంపై వర్సిటీ అప్పిలేట్ అథారిటీ పునఃపరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థుల నుంచి వివరణ తీసుకుని ఆరువారాల్లోగా విద్యార్థులపై చర్యలకు తగు కారణాలను వెల్లడించాలని సూచించింది.