Dronacharya
-
మహిళా మిలటరీ పోలీస్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది!
ఇండియన్ ఆర్మీలోని పోలీస్ సేనాదళం.. ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ (సీఎంపీ) తొలిసారి మహిళల్ని విధుల్లోకి తీసుకుంది! శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు 83 మంది కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. సీఎంపీలో ఇప్పటివరకు ఆఫీసర్స్ కేటగిరీలో మాత్రమే మహిళలు ఉంటూ వస్తున్నారు. సాధారణ సైనికులుగా మహిళలు ప్రవేశించడం మాత్రం ఇదే మొదటిసారి. బెంగళూరులోని ద్రోణాచార్య పరేడ్ గ్రౌండ్లో శనివారంనాడు చాలా నిశ్శబ్దంగా ఒక ప్రతిష్టాత్మకమైన ‘పాసింగ్ అవుట్ పరేడ్’ జరిగిపోయింది! కోవిడ్ నిబంధనలు లేకుంటే పరేడ్‌ను చూసేందుకు యువ సైనికుల తల్లిదండ్రులు కూడా వచ్చేవారు. పైగా ఆ పరేడ్ మన దేశానికే ప్రథమమైనది, ప్రత్యేకమైనది. ఇండియన్ ఆర్మీలోని పోలీస్ సైనిక విభాగం అయిన ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్’ (సీఎంపీ) లో చేరేందుకు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళలు వాళ్లంతా. బెంగళూరు ద్రోణాచార్య పరేడ్ గ్రౌండ్లో మే 8న జరిగిన మహిళా మిలటరీ పోలీస్ ‘పాసింగ్ అవుట్ పరేడ్’. సీఎంపీ ఆవిర్భావం తర్వాత ఈ ఆర్మీ విభాగంలో మహిళలకు ప్రవేశం లభించడం ఇదే తొలిసారి! నేటి నుంచి ఈ మహిళా మిలటరీ పోలీసులు తమ విధులకు హాజరవుతారు. ఏం చేస్తారు ఈ మహిళా మిలటరీ పోలీసు లు? కండబలం, గుండె బలం ఉన్న పనులు చేస్తారు. మిలటరీ, పోలీస్ క్వార్టర్స్‌ని కనిపెట్టుకుని ఉంటారు. యుద్ధ ఖైదీల కదలికలపై ఒక కన్నేసి ఉంచుతారు. ఆర్మీ సైనికులు క్రమశిక్షణను, ఆదేశాలను అతిక్రమించకుండా చూస్తారు. త్రివిధ దళాలలోని మూడు పోలీసు విభాగాలకు, పౌర రక్షణ పోలీసు విభాగాలకు సమన్వయకర్తలుగా ఉంటారు. ఆర్మీ సిబ్బందికి సంబంధం ఉన్న కేసులలో విచారణలకు హాజరవుతారు. ఆర్మీల చీఫ్‌లు ఎవరైతే ఉంటారో వాళ్లకు భద్రతగా ఉంటారు. ఇంకా అనేకం ఉన్నాయి. చొరబాటు ‘దారులలో’ శత్రువు సృష్టించిన కృత్రిమ ట్రాఫిక్ జామ్‌లను క్లియర్ చేస్తారు. టెలీ కమ్యూనికేషన్ తెగిపోయినప్పుడు రంగంలోకి దిగి సమాచారాన్ని పునరుద్ధరిస్తారు. ఇవన్నీ చేయడానికి సీఎంపీ విభాగం అరవై ఒక్క వారాల శిక్షణ ఇస్తుంది. తాజాగా ఈ శిక్షణ పూర్తి చేసిన ఎనభై మూడు మంది మహిళా అభ్యర్థులు ఆర్మీ పొదిలోకి అస్త్రాలుగా పదును తేలారు. బెంగళూరులోని ‘కోర్స్ ఆఫ్ మిలటరీ పోలీస్ సెంటర్ అండ్ స్కూల్’ శిక్షణను ఇచ్చింది. ఆర్మీ తొలిసారి మహిళల కోసం ‘సోల్జర్ జనరల్ డ్యూటీ’ కేటగిరీ ఉద్యోగాలకు గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ చూసి ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నవాళ్లలో శిక్షణకు అర్హులైన వాళ్లే.. ఈ ఎనభై మూడు మంది. భారత రక్షణదళంలో కేవలం ఆర్మీకి మాత్రమే ‘ఆఫీసర్’ ర్యాంకు కన్నా దిగువన ఉండే హోదాలలో మహిళల్ని నియమించుకునే అధికారం ఉంది. నావిక, వైమానిక దళాలకు ఆ అవకాశం లేదు. అయినప్పటికీ ఆర్మీలోని సీఎంపీకి మహిళా సోల్జర్లను తీసుకోడానికి 82 ఏళ్లు పట్టింది. సీఎంపీ ఆవిర్భవించింది 1939లో. మహిళా ఆఫీసర్లను తీసుకుంటున్న ఆర్మీకి కానీ, ఆర్మీలోని సీఎంపీ విభాగానికి కానీ ఇంతకాలం సాధారణ మహిళా సైనికులను తీసుకోడానికి ఉన్న అభ్యంతరం ఏమిటి?! జటిల సమస్య లు, కఠిన పరిస్థితులు ఉండే విధుల్లో మహిళల్ని తీసుకోవడం సరికాదు అన్న ఆలోచనా ధోరణే. అయితే అలవాటు లేని రంగాలలో సైతం మహిళ లు రాణిస్తుండటంతో ఆ ధోరణి మారింది. అదొక్కటే కాదు దేశ భద్రత విభాగాలలో ఆర్మీకి మహిళా సైనికుల చేయూత అవసరం అవుతోంది. అందుకే సీఎంపీలోకి మహిళల్ని తీసుకునేందుకు ఆర్మీ 2019 జనవరిలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందింది. ఏడాదికి వంద మంది చొప్పున 2036 నాటికి 1700 మంది మహిళల్ని సీఎంపిలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎంపీలో ప్రస్తుతం సుమారు 9000 మంది సిబ్బంది ఉండగా, మొత్తం ఆర్మీలో రిజర్వు సిబ్బంది కాకుండా 12 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో మహిళా అధికారులు 1672 మంది, సాధారణ స్థాయి మహిళలు సుమారు ఏడు వేల మంది. -
ఆర్చరీ కోచ్ జీవన్‌జ్యోత్ రాజీనామా
చండీగఢ్: ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారం ‘ద్రోణాచార్య’ జాబితా నుంచి తనను తొలగించినందుకు నిరసనగా భారత ఆర్చరీ కాంపౌండ్ విభాగం జట్టు కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ తేజ తన పదవికి రాజీనామా చేశారు. అవార్డుల సెలెక్షన్ కమిటీ తొలుత జీవన్‌జ్యోత్ పేరును నామినీల జాబితాలో చేర్చినా... 2015లో ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర క్రీడా శాఖ అతని పేరును తొలగించింది. ‘భారత ఆర్చరీ జట్టు కోచ్ పదవికి నేను రాజీనామా చేశాను. 2015లో నాపై భారత ఆర్చరీ సంఘం విధించిన ఏడాది కాలం నిషేధాన్ని పూర్తి చేసుకున్నాను. నాటి ఉదంతంలో నా పాత్ర లేదని విచారణలోనూ తేలింది’ అని జీవన్ జ్యోత్ తెలిపారు. ఇటీవల ముగిసిన జకార్తా ఆసియా క్రీడల్లో కాంపౌండ్ టీమ్ విభాగంలో రజత పతకాలు గెలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు జీవన్‌జ్యోత్ కోచ్‌గా ఉన్నారు. -
నిరాదరణకు గురవుతున్న ఆలయం!
గురుగ్రామ్, హరియాణ: కురు, పాండవులకు విలువిద్య నేర్పిన గురు ద్రోణాచార్యుడి ఆలయం నిరాదరణకు గురవుతోంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉంది. అయితే, నగరంలోని సుభాష్ నగర్లో ఉన్న ఈ ఆలయం ఇరుకు వీధుల్లో, చుట్టూ చెట్లతో నిండిన ప్రదేశంలో ఉండడంతో జనాదరణకు నోటుకోవడం లేదు. దేశంలో ద్రోణుడికి ఉన్న ఏకైక ఆలయంపట్ల అటు ప్రభుత్వం, ఇటు పాలకుల చిన్న చూపు తగదని స్థానికులు అంటున్నారు. 1872లో సింఘా భగత్ అనే భూస్వామి ఈ ఆలయాన్ని నిర్మించారని స్థానికులు చెప్తున్నారు. ద్రోణాచార్యుడికి నిత్య పూజలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. ధూపదీప నైవేద్యాలు నిర్విఘ్నంగా సాగాలని వందల ఎకరాలు ఆలయానికి మాన్యంగా దానం ఇచ్చాడని అంటున్నారు. కాలక్రమంలో ఆ భూములు అన్యాక్రాంతం అయ్యాయని వారు తెలిపారు. ఆమె గుడికి వైభవం.. ద్రోణాచార్యుడి భార్య శీత్లాదేవికి కూడా గురుగ్రామ్‌లో ఆలయం ఉంది. 18వ శతాబ్దానికి చెందిన రాజస్థాన్ మహారాజు దీనిని నిర్మించారు. హరియాణాలో భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా శీత్లాదేవి ప్రాచుర్యం పొందారు. ‘కురు, పాండవుల గురువు ద్రోణాచార్యుడి గుర్తుగా ఈ ప్రాంతం పేరును ఇటీవలే గురుగ్రామ్‌గా మార్చారనీ, అయినా సందర్శకుల సంఖ్యకు నోచుకోవడం లేదని గుడి పూజారి శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ సహాయ, సహకారాలు కోరతామని అన్నారు. సుభాష్ నగర్ ప్రాంతానికి ‘గురు ద్రోణాచార్య నగర్’గా నామకరణం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన చెప్పారు. ఆలయ పునరుద్ధరణకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఆలయం నిర్మితమైన ప్రదేశానికి గురు ద్రోణాచార్యుడికి ఏ విధమైన సంబంధాలు లేవని చరిత్రకారులు వాదిస్తున్నారు. -
ద్రోణాచార్యుడు రమేష్
-
ద్రోణాచార్యుడు
పూర్వుల ఆచారాన్ని గ్రహింపజేసేవాడు ఆచార్యుడు. మనిషికి పూర్వులు అతని మునపటి కర్మలే. ఆ పనులకు మూలం అతను చేసిన మునపటి ఆలోచనలు. అంటే, ఆచార్యుడనే మాటకు సంస్కార మని అర్థమన్నమాట. ఈ సంస్కారాలు మంచివీ గావచ్చు, చెడ్డవీ గావచ్చు. అంచేతనే ఇటు పాండవులకూ అటు కౌరవులకూ కూడా ఆచార్యుడు ద్రోణుడే. ‘ద్రోణ’ అనే పేరు ‘ద్రు-గతౌ’ అనే క్రియ నుంచి వచ్చింది. అంటే, ద్రవంలాగ కరిగిన స్థితిలో ప్రవహిస్తూన్నట్టు ఉండేది అని అర్థం. చేసిన ఆలోచనగానీ చేసిన పనిగానీ ఇక లేకుండా పోదు. అది మన చేతనత్వంలో ఆ ఫలానా ఆలోచన జాడగానూ ఆ ఫలానా పనిముద్రగానూ సూక్ష్మ రూపంలో, అంటే, ద్రవీభూత రూపంలో ఉంటుంది. వీటినే సంస్కారాలని అంటాం. ఆ ముద్రలు అంతస్సులో బలీయమైన మొగ్గుదలల్ని ఏర్పరుస్తాయి. అవి ఆ ఆలోచనల్నీ ఆ పనుల్నీ మళ్లీ మళ్లీ చేసేలాగ మన బుద్ధిని నిర్బంధపెడతాయి. మాటి మాటికీ జరిగే ఆ పనులు నిర్బంధించే అలవాట్లుగా తయారవుతాయి. అంటే, సంస్కారం, ఒకలాగ చెప్పాలంటే, లోపలి మొగ్గుదలా, లేక, అలవాటూ అన్నమాట. ద్రోణుడు చెక్కదొన్నెలోంచి పుట్టాడని పురాణం కథ చెబుతుంది. ఈ దొన్నె ద్రవీభూతమైన సంస్కారాలతో నిండి ఉన్నది. చెక్కదొన్నెను పగలగొట్టడం సాధ్యం గనకనే, ప్రయత్నం చేసేవాడికి ఈ పూర్వసంస్కారాల నిర్బంధం నుంచి బయటపడడం అసాధ్యమేమీగాదు. యజ్ఞాల్లో ద్రోణకలశం అనే గ్రహం, అంటే, పాత్ర ఒకటి ఉంటుంది. అది ప్రజాపతి సంబంధమున్నది. ప్రజాపతి అంటే సృష్టించే బ్రహ్మ. సృష్టి అంతా వాసనల విలాసమే. భరద్వాజుడు ఘృతాచి అనే అప్సరసను చూసి చలించి పోవడం వల్ల ద్రోణుడు పుట్టాడని ఆ కథ చెబుతుంది. వాజమంటే స్పందన. స్పందనలతో నింపి పోషించేవాడు (భరత్) భరద్వాజుడు. ఘృతాచి అంటే, ప్రవాహంగా (ఘృ=క్షరణం, ప్రవహిం చడం) ప్రకటమవుతూ సాగిపోయేది. (‘అంచు’ = గమనం) అని అర్థం. ఈ ఇద్దరికీ పుట్టిన ద్రోణుడు అంచేత, ‘మునపటి ఆలోచనా స్పందనలనూ క్రియల కదలికల్నీ ప్రవహింపజేసి ప్రకాశింపజేసేవాడ’న్న మాట. ఈ విధంగా పురాణకథలో ఇమిడి ఉన్న అర్థం కూడా ద్రోణుడంటే సంస్కారమూ అల వాటూ అనే తెలుస్తోంది. ఎలాగైతే కాకి తన తలను తిప్పుతూ ఒక్కొక్కసారీ ఒక్కొక్క కంటిని మాత్రమే ఉపయోగించి, తనకు కావలసిన వస్తువును చూస్తుందో అలాగే, అలవాటుకు అమ్ముడుపోయిన బుద్ధి, ఏకాక్షిలాగ, ప్రబలమైన సంస్కా రాలకే కొమ్ముకాస్తుంది తప్ప, మంచీ చెడూ అనే రెండు రకాల సంస్కారా లనూ సరిసమానంగా చూడలేదు. మనిషిలో దుష్టమైన సంస్కారాలు ఎచ్చులో ఉన్నప్పుడు, అతనిలోని ‘ద్రోణుడు’ కౌరవులవైపే చేరతాడు. చిన్ననాటి నేస్తం ద్రుపదుడి మీద ద్రోణుడికున్న కక్ష సాధిద్దామన్న బుద్ధే అతనిలోని చెడు సంస్కారానికి అద్దం పడుతుంది. ద్రోణుడికి కృపాచార్యుడి చెల్లెలు కృపితో పెళ్లి అయింది. వాళ్లకు అశ్వత్థామ అనే కొడుకు పుట్టాడు. భరద్వాజుడు అగ్నికి కొడుకైన అగ్ని వేశుడికి ఆగ్నేయాస్త్రాన్ని చెప్పాడు. ఆ అగ్ని వేశుడు తిరిగి ఆ అస్త్రాన్ని భరద్వాజుడి కొడుకైన ద్రోణుడికి చెప్పి, గురువు రుణం తీర్చుకొన్నాడు. భరద్వాజుడికి పృషతుడనే రాజు స్నేహితుడు. పృషతుడికి ద్రుపదుడనే కొడుకున్నాడు. ద్రుపదుడికీ ద్రోణుడికీ అగ్నివేశుడే గురువు. ద్రుపదుడు రోజూ భరద్వాజుడి ఆశ్రమానికి వచ్చి, ద్రోణుడితో కలిసి ఆడుకొంటూ ఉండే వాడు. చదువుకొనేవాడు కూడాను. ఆ విధంగా ఇద్దరూ సహాధ్యాయులయ్యారు. పృషతుడు చనిపోగానే పార్షతుడు, అంటే ద్రుపదుడు పాంచాల దేశానికి రాజయ్యాడు. భరద్వాజుడు కూడా పోయిన తరవాత, ద్రోణుడు ఆ ఆశ్రమం లోనే ఉంటూ తపస్సు చేసుకొనేవాడు. మొదట వేదాన్ని చదువుకొన్నాడు. ఆమీద ధనుర్వేదాన్ని అభ్యసించడం ప్రారంభిం చాడు. పిల్లవాడికి పాలను కొనడానికి కూడా డబ్బులేని దారిద్య్రం అతనిది. అశ్వత్థామ, ఎవరో అబ్బాయి పాలు తాగుతోంటే ‘నాకూ పాలు కావాల’ని ఏడ్చాడు. ఎంత ప్రయత్నించినా ఆవు దొరకలేదు ద్రోణుడికి. గోధుమపిండిలో నీళ్లు కలిపి అవి పాలని చెప్పి అశ్వత్థామను ఊరుకోబెట్టారు తల్లిదండ్రులు. మహేంద్ర పర్వతం మీద ఉన్న పరశురాముడు దానాలు చేస్తున్నాడని విని ద్రోణుడు వెళ్లాడు. కానీ ఇతను చేరేసరికి అతని దగ్గర ఏ రకమైన భౌతిక ధనమూ మిగల్లేదు; అస్త్రధనం మాత్రం ఉంది. దాన్నే కోరు కొన్నాడు ద్రోణుడు. అక్కణ్నించి సఖుడు గదా అని ధనం కోసం ద్రుపదుడి దగ్గరికి గంపెడాశతో పోయి ‘సఖుడా!’ అని పిలిస్తే అది ద్రుపదుడికి గిట్టలేదు. ద్రోణుడనే మాటలోనూ ద్రుపదుడనే మాటలోనూ ఒకే ‘ద్రు’ అనే ధాతువు ఉంది. కానీ ఇద్దరి స్వభావాన్ని బట్టి అది వేరు వేరు అర్థాల్ని సంతరించుకొంటుంది. ద్రుపదుడంటే, త్వరత్వరగా (‘ద్రుతగతితో’) ఆధ్యాత్మి కంగా పురోగమించేవాడని అర్థం. ప్రతి సాధకుడూ మొదట్లో తన ఆధ్యాత్మికమైన కోరికలూ లోపలి వాసనలూ కలిసిమెలిసే ఉంటున్నాయనుకొంటాడు. కానీ సంస్కా రమెప్పుడైతే తన భౌతికమైన మొగ్గు దలల్ని కనబరుస్తుందో అప్పుడు ఆధ్యా త్మికమైన కామన దాని సంగాన్ని కాల దన్నుతుంది. ఇదే ద్రుపదుడు చేసిన పని. ఆ మీద బావమరిదింటికి వచ్చి ప్రచ్ఛన్నంగా ఉండడం మొదలుపెట్టాడు ద్రోణుడు. ఒకరోజున హస్తినాపురం నుంచి బయటకు వచ్చి రాజకుమారులందరూ ఒకచోట గిల్లిదండా ఆడుతున్నారు. అకస్మా త్తుగా ఆ గోటీబిళ్ల నీళ్లులేని బావిలో పడిపో యింది. దాన్ని బయటికి తీయడం చేత కాలేదు ఆ కౌరవరాజకుమారులందరికీను. అక్కడికొచ్చిన ద్రోణుడు వాళ్లను చూసి నవ్వాడు: ఉంగరాన్ని వేసి ‘దాన్ని కూడా తీస్తాను, నాకు భోజన సదుపాయం చేయండ’ని అడిగాడు. గుప్పెడు గడ్డి పోచల్ని కోసి, వాటిని అభిమంత్రించి, ఒక పోచను ఆ బిళ్లమీద గురిపెట్టి వేశాడు. ఆ పోచకు మరో పోచను కలిపాడు. ఇలాగ మంత్రించిన పోచలతో ఆ గోటీ బిళ్లను పైకి తీశాడు. ‘మరి ఆ ఉంగరాన్ని కూడా తీయండి’ అనడిగారు పిల్లలు. అప్పుడు బాణాలను సంధించాడు. మొదటి బాణంతో ఉంగరాన్ని గుచ్చాడు. ఆ మీద బాణంమీద మరో బాణాన్ని గుచ్చుతూ నిలువు కట్టెలాగ చేసి ఉంగరాన్ని పైకి లాగాడు. ఆనందంతో పిల్లలు ‘మేము మీకేం చేసిపెట్టాలి?’ అనడంతో ‘మీ భీష్ముడి తాతకు నా గురించి చెప్పండి చాలు’ అన్నాడు. భీష్ముడు అతని విలు విద్యాపాండిత్యాన్ని గుర్తించాడు. కౌరవ పాండవులందరికీ విలువిద్యను నేర్పమని నియోగించి, ఆయనకు ఏ లోటూ లేకుండా చేశాడు భీష్ముడు. ఈ విలువిద్యను నేర్పడాన్ని పురస్క రించుకొని ఈ వాసనలకాపు వైరాగ్యానికి అందరిలోనూ అర్జునుడి గొప్పతనాన్ని గమనించాడు: అతన్ని పెద్దగా చేద్దామని ఏకలవ్యుడి వింటినేర్పనే కుడిబొటనవేలిని దక్షిణగా తీసుకొనే క్రూరత్వానికి ఒడి గట్టాడు. అర్జునుణ్ని దన్నుగా చేసుకొని, ద్రుపదుడి మీద దండెత్తాడు ఈ బ్రాహ్మ ణుడి రూపంలో ఉన్న ప్రతీకారి ద్రోణుడు. ద్రుపదుడి ఛత్రవతీపురాన్ని కైవసం చేసు కొని, ‘నీతో మళ్లీ స్నేహంగానే ఉందామను కొంటున్నాను. రాజుకు రాజుతో సఖ్యం కుదురుతుందని చెప్పావుగనక, నేనూ రాజునయ్యాను. నేను ఉత్తర పాంచాలాన్ని ఉంచుకొని నీకు దక్షిణ పాంచాలాన్ని ఇస్తాను’ అని ద్రుపదుణ్ని చిన్నబుచ్చాడు. ఇంత కక్ష తీర్చుకొన్నా, తనను చంప డానికి పుట్టిన ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడికి విలువిద్యను ద్రోణుడే చెప్పాడు. సంస్కారస్వరూపుడైన ద్రోణుడు మంచీ చెడూ రెండు సంస్కారాలకూ ప్రతి నిధే. ధృష్టద్యుమ్నుడు మంచి సంస్కా రానికి ప్రతీక. అంచేత అతనికీ ద్రోణుడు గురువే అవుతాడు. భీష్ముడి తరవాత ద్రోణుడే కౌరవుల సేనానాయకు డయ్యాడు. ఐదురోజులు యుద్ధం చేశాడు. ఈ ఐదురోజుల్లోనూ చాలా ముఖ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ‘ధర్మరాజును బంధిస్తే, యుద్ధం అయి పోతుంది. మీరు అది చెయ్యగలిగీ చెయ్యట్లేదు. మీకు పాండవ పక్షపాతం ఉంది’ అని దుర్యోధనుడు ఎత్తిపొడిచి నప్పుడు, ‘అర్జునుణ్ని సంశప్తకులు దూరంగా తీసుకెళితే దీన్ని సాధ్యం చేయవచ్చు. నేను అప్పుడు చక్రవ్యూహం పన్ని విజృంభిస్తాను’ అని ద్రోణుడు అభిమన్యుడి చావుకు బీజం వేశాడు. ఒంటరివాణ్ని చేసి, ఆరుగురు యోద్ధలొక్క సారిగా మీదపడి అభిమన్యుణ్ని చంప డానికి పథకం వేసినవాడూ ఇతనే. అభి మన్యుడు చావగానే, అతని సహాయానికి భీముడూ నకులసహదేవులూ ఎవరూ వెళ్లకుండా ఆపిన దుశ్శల మొగుడు జయ ద్రథుణ్ని చంపుతానని అర్జునుడు శపథం చేశాడు. చంపలేకపోతే అగ్నిప్రవేశం చేస్తా నని చెప్పడంతో సైంధవుడైన ఆ జయ ద్రథుణ్ని కాపాడడానికి వ్యూహం పన్నాడు ద్రోణుడు. లోపల ఉన్న అర్జునుడికి సాయంగా భీముడు వెళ్దామని చూస్తే అతనికి అడ్డంగా ద్రోణుడే నిలుచున్నాడు. కానీ భీముడు ద్రోణుడి రథాలను ఎత్తెత్తి కుదేస్తూ అతని బాణాలను, వర్షాన్ని ఎదిరించి ఎద్దు ముందుకు సాగిపోయి నట్టు, సహిస్తూనే లోపలికి వెళ్లాడు. ఘటో త్కచుడితో జరిగిన రాత్రియుద్ధం కూడా ద్రోణుడి హయాంలోనే జరిగింది. కర్ణుడి శక్తి అతనిమీద ప్రయోగించక తప్ప నంతగా ఘటోత్కచుడు విజృంభించాడు. తెల్లారిన తరవాత, అశ్వత్థామ పోయాడన్న పుకారును ధర్మరాజు నోట విని ద్రోణుడు అస్త్ర సన్యాసం చేశాడు. ధ్యాన ముద్రలో కూర్చొని ప్రాణాన్ని వదిలేసిన ద్రోణుడి తలను ధృష్టద్యుమ్నుడు వరప్రభావం కొద్దీ నరికేశాడు. ధృష్టద్యుమ్నుడంటే నిబ్బరమైన కాంతి అనర్థం. ప్రశాంతమూ నిర్దుష్టమూ అయిన ఈ కాంతే నిర్బంధించి ఏడిపించే అలవాటును కాల్చివేయగలదు: ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ని వధించడంలో ఉన్న అంతరార్థం ఇదే. ఇబ్బందిపెట్టే అల వాటును నశింపజేయడానికి, అబద్ధాన్నైనా చెప్పడమనే ఉపాయం పన్నడంలో ఏ రకమైన తప్పూ ఉండదు. -
ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే
న్యూఢిల్లీ : ద్రోణాచార్య అవార్డులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కాగా శనివారం రాష్ట్ర ప్రతి భవన్ లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా అవార్డుల పంపిణీ కార్యక్రమం జరగనున్న తరుణంలో ఈ తీర్పును వెలువరించింది. ఎక్కువ అర్హత ఉన్న జాతీయ రెజ్లింగ్ మాజీ చీఫ్, కోచ్ వినోద్ కుమార్‌ను విస్మరించిన ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీ రెజ్లింగ్ మరో కోచ్ అనూప్ సింగ్ దహియా పేరును ప్రకటించడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వినోద్ కుమార్ ఈనెల 18న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు రాజీవ్ ఖేల్ రత్న పురస్కారం అందించడానికి కేంద్రం అనుకూలంగానే ఉంది. కర్ణాటక హైకోర్టుకు జవాబిస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. -
రెజ్లింగ్ కోచ్ వినోద్ కుమార్‌కు ద్రోణాచార్య
జాతీయ రెజ్లింగ్ మాజీ చీఫ్, కోచ్ వినోద్ కుమార్ కు ఢిల్లీ హై కోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకు ప్రతిష్టాత్మక ద్రోణా చార్య అవార్డు అందించాలని కోర్టు కేంద్రాన్ని నిర్ధేశించింది. ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయక పోవడాన్ని సవాల్ చేస్తూ వినోద్ కుమార్ ఈనెల 18న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై వినోద్ కుమార్ స్పందిస్తూ.. తన అభ్యర్థనను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈనెల ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీ మరో రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్ దహియా పేరును సిఫార్సు చేసింది. దీంతో తన కంటే జూనియర్‌ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎలా ఎంపిక చేస్తారని వినోద్ కుమార్ కోర్టుకెక్కారు. కోర్టు ఆదేశం సకాలంలో వచ్చిందని వినోద్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా శనివారం రాష్ట్ర ప్రతి భవన్ లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా ఆవార్డుల కార్యక్రమం జరగ నుంది. -
‘ద్రోణాచార్య’కు మరో ఐదుగురు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం’ కోసం మరో ఐదుగురి పేర్లను సిఫారసు చేశారు. సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆర్చరీ కోచ్ పూర్ణిమా మహతో, మహిళా హాకీ కోచ్ నరేంద్ర సింగ్ సైనీలతో పాటు రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్), మహావీర్ సింగ్ (బాక్సింగ్)లను ఈ అవార్డు కోసం ప్రతిపాదించారు. ప్రస్తుతం ఈ జాబితాను కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ఆమోదం కోసం పంపారు. ఈనెల మధ్యలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడొచ్చు. సునీల్ గవాస్కర్ (క్రికెట్), విజయ్ అమృత్‌రాజ్ (టెన్నిస్)ల పేర్లను కూడా ఈ పురస్కారం కోసం ప్రతిపాదించినా వీళ్లకు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం ‘అర్జున’ అవార్డును తీసుకున్న క్రీడాకారులను ‘ధ్యాన్‌చంద్’కు పరిగణనలోకి తీసుకోరు.