జాతీయ రెజ్లింగ్ మాజీ చీఫ్, కోచ్ వినోద్ కుమార్ కు ఢిల్లీ హై కోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకు ప్రతిష్టాత్మక ద్రోణా చార్య అవార్డు అందించాలని కోర్టు కేంద్రాన్ని నిర్ధేశించింది. ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేయక పోవడాన్ని సవాల్ చేస్తూ వినోద్ కుమార్ ఈనెల 18న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై వినోద్ కుమార్ స్పందిస్తూ.. తన అభ్యర్థనను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
ఈనెల ద్రోణాచార్య అవార్డు ఎంపిక కమిటీ మరో రెజ్లింగ్ కోచ్ అనూప్ సింగ్ దహియా పేరును సిఫార్సు చేసింది. దీంతో తన కంటే జూనియర్ను ప్రతిష్టాత్మక అవార్డుకు ఎలా ఎంపిక చేస్తారని వినోద్ కుమార్ కోర్టుకెక్కారు. కోర్టు ఆదేశం సకాలంలో వచ్చిందని వినోద్ తన సంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా శనివారం రాష్ట్ర ప్రతి భవన్ లో ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా ఆవార్డుల కార్యక్రమం జరగ నుంది.