న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం’ కోసం మరో ఐదుగురి పేర్లను సిఫారసు చేశారు. సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆర్చరీ కోచ్ పూర్ణిమా మహతో, మహిళా హాకీ కోచ్ నరేంద్ర సింగ్ సైనీలతో పాటు రాజ్ సింగ్ (రెజ్లింగ్), కేపీ థామస్ (అథ్లెటిక్స్), మహావీర్ సింగ్ (బాక్సింగ్)లను ఈ అవార్డు కోసం ప్రతిపాదించారు.
ప్రస్తుతం ఈ జాబితాను కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ఆమోదం కోసం పంపారు. ఈనెల మధ్యలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడొచ్చు. సునీల్ గవాస్కర్ (క్రికెట్), విజయ్ అమృత్‌రాజ్ (టెన్నిస్)ల పేర్లను కూడా ఈ పురస్కారం కోసం ప్రతిపాదించినా వీళ్లకు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే నిబంధనల ప్రకారం ‘అర్జున’ అవార్డును తీసుకున్న క్రీడాకారులను ‘ధ్యాన్‌చంద్’కు పరిగణనలోకి తీసుకోరు.
‘ద్రోణాచార్య’కు మరో ఐదుగురు
Published Fri, Aug 9 2013 1:42 AM | Last Updated on Fri, Sep 1 2017 9:44 PM
Advertisement
Advertisement