తెలుగు విద్యార్థులకు అండగా నిలుస్తాం
తిరుమల : ఉన్నత విద్యను భ్యసించేందుకు అమెరికాకు వచ్చిన, వస్తున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అండగా నిలుస్తామని అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం అన్నారు. బుధవారం ఆయ న టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తానా అధ్యక్షుడు వేమన సతీష్‌తో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థులకు తానా సంఘం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. ఇందుకోసం ప్రతి విద్యార్థీ మంచి విశ్వవిద్యాలయాన్ని ఎన్నుకోవటంతోపాటు అధికారులు అడిగే ఇంటర్వ్యూలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమై రావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. నార్త్ ఆమెరికాలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా తనను నియమించి నుందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ అభివృద్ధికోసం అమెరికాలోని ప్రవాస భారతీయుల ద్వారా మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి సాధించేం దుకు పెట్టుబడులు తెస్తామన్నారు.