సింగ్గారూ.. త్వరగా పరిష్కరించండి | show us salvations as early as possible: ts govt | Sakshi
Sakshi News home page

సింగ్గారూ.. త్వరగా పరిష్కరించండి

Published Fri, Mar 20 2015 3:32 PM | Last Updated on Sat, Aug 18 2018 9:00 PM

show us salvations as early as possible: ts govt

పునర్విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించాలని తెలంగాణ సర్కార్ ఏకే సింగ్ కమిటీని కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పాడిన అనంతరం నెలకొన్న వివాదాల పరిష్కారాల కోసం ఏర్పడిన ఏకే సింగ్ నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారుల బృందం శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు.

విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ అంశాలను కమిటీ దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజన త్వరగా పూర్తి చేయాలని కోరింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పందంగ ఉన్న విద్యుత్, జల వివాదాలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేసింది. విభజన ఇబ్బందులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసిన దరిమిలా ఏకే సింగ్ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement