ak singh
-
పెట్రోనెట్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ద్రవ రూపంలోని సహజ వాయువు (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్/ఎల్ఎన్జీ) తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయిన పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే 4–5 ఏళ్లలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. విదేశాల్లోని ప్లాంట్లపై కలిపి ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నట్టు సంస్థ సీఈవో ఏకే సింగ్ వెల్లడించారు. ’’పెట్రోనెట్ ఎల్ఎన్జీ రూ.12,500 కోట్లతో ప్రొపేన్ డీహైడ్రోజెనరేషన్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి ప్రవేశించనుంది. దిగుమతి చేసుకున్న ముడి సరుకు నుంచి ప్రాపీలేన్‌ను ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. అలాగే, ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద రూ.1,600 కోట్లతో ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం’’ అని సింగ్ తెలిపారు. తాము ఎప్పటికప్పుడు విదేశీ పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తుంటామని, దేశానికి ప్రయోజనకరం, మెరుగైనది అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళతామని చెప్పారు. విద్యుత్, ఫెర్టిలైజర్, సీఎన్జీ అవసరాలను దేశీయంగా ఉత్పత్తి అయ్యే సహజవాయువు సగం మేరే తీరుస్తోంది. మిగిలినది దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ‘‘రూ.600 కోట్లతో గుజరాత్‌లోని దహేజ్ ఎల్ఎన్జీ దిగుమతి టర్మినల్ సామర్థ్యాన్ని ప్రస్తుత 17.5 మిలియన్ టన్నుల (వార్షిక) నుంచి 22.5 మిలియన్ టన్నులకు పెంచుకుంటాం. రూ.1,245 కోట్లతో అదనపు స్టోరేజీ ట్యాంకు సమకూర్చుకుంటాం’’ అని సింగ్ తెలిపారు. దేశీయంగా ఎల్ఎన్జీ దిగుమతి సామర్థ్యం, పెట్రోకెమికల్ వ్యాపారం కోసం ∙రూ.17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. -
తీర్పుపై మాజీ సీబీఐ డైరెక్టర్ షాక్
సాక్షి,న్యూఢిల్లీ: 2జీ స్కామ్ కేసులో నిందితులందరినీ నిర్ధోషులుగా కోర్టు ప్రకటించడం పట్ల మాజీ సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు.ఏ రాజాతో పాటు కార్పొరేట్ల అరెస్ట్‌కు నేతృత్వం వహించిన సింగ్ తీర్పుపై షాక్‌కు గురయ్యానన్నారు. 2జీ స్పెక్ర్టమ్ కేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నట్టు సీబీఐ సాక్ష్యాధారాలతో ముందకొచ్చిందని విచారణలో ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు 2జీ కేసులో ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు అసత్యమని తేలిందని మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు.2జీ తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు. 2జీ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన కాగ్ క్షమాపక్షలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీర్పు వెలువడిన అనంతరం కనిమొళి, రాజా హర్షం వ్యక్తం చేశారు.కష్టసమయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో చత్తీస్గడ్ సీఎం రమణ్‌సింగ్, అండమాన్ నికోబార్ గవర్నర్ ఏకే సింగ్, గాయని పి.సుశీల, సినీ నటి కవితతో పాటు పలువురు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో వీరు స్వామిని దర్శించుకున్నారు. అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
కేంద్ర హోంశాఖ సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం వాదన విభజన చట్టంలోని నిబంధనను ఎత్తిచూపిన సీఎస్ రాజీవ్ శర్మ పదో షెడ్యూల్లోని సంస్థలను ఉమ్మడిగా ఉంచాలన్న ఏపీ సీఎస్ హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని విజ్ఞప్తి అన్నింటిపై న్యాయ సలహా తీసుకుంటామన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పీటముడి పడిన విభజన అంశాలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాలతోపాటు విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ఎవరికీ కేటాయించని సంస్థలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పదో షెడ్యూల్లోని సంస్థలు ఉమ్మడి నిర్వహణ కింద ఉండాలని ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రతిపాదించగా.. రాష్ర్ట ప్రభుత్వం అందుకు విబేధించింది. భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలను ఆ ప్రాంతానికే కేటాయించాలని సీఎస్ రాజీవ్ శర్మ తన వాదన వినిపించారు. ఆయా సంస్థల పేర్లలో ‘ఏపీ’ పదం ఉన్నంత మాత్రాన.. వాటి నియంత్రణ, నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చేతిలోనే ఉంటుందని భావించరాదని స్పష్టం చేశారు. భౌగోళికంగా అవి ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికే కేటాయించాలని విభజన చట్టమే చెబుతోందని ప్రస్తావించారు. చట్టంలో ఎలాంటి నిబంధన లేనందున ఉమ్మడి నిర్వహణ అన్నదే ఉత్పన్నం కాదని తోసిపుచ్చారు. చట్టంలో లేని ఏ విషయంలోనూ టీ సర్కారు హక్కులు కోరడం లేదని గుర్తు చేశారు. షెడ్యూలు తొమ్మిదిలోని సంస్థలకు సంబంధించి ప్రధాన కార్యాలయం ఎక్కడుంటే అక్కడున్న ఆస్తులన్నీ హెడ్ క్వార్టర్ ఆస్తులుగా పరిగణించడం సరికాదన్నారు. మరోవైపు పదో షెడ్యూలులోని సంస్థలను ఉమ్మడి నిర్వహణలోనే ఉంచాలని.. ఉమ్మడి రాష్ట్రంలో ఆ సంస్థలకు సమకూరిన నిధులను న్యాయబద్ధంగా 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఉద్యోగుల విభజనను రెండు ప్రభుత్వాల పరస్పర సంప్రదింపులతో చేయాలని, సమస్యల పరిష్కారానికి వీలుగా తటస్థ అథారిటీ ఏర్పాటుకు సెక్షన్ 8 కింద నిబంధనలు రూపొందించాలని కోరింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించాలని కూడా ఏపీ సీఎస్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్ 7లోని సంస్థలకు సంబంధించిన నిధులపై కూడా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల వాదనలను విన్న కేంద్ర హోంశాఖ బృందం.. ఈ వివరాలన్నీ కేంద్ర న్యాయ శాఖకు తెలియజేసి న్యాయసలహా తీసుకుంటామని చెప్పింది. సీఎస్ల మధ్య వాగ్యుద్ధం విభజన వివాదాల పరిష్కారంపై జరి గిన భేటీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికృష్ణారావు, తెలంగాణ సీఎస్ల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ సమక్షంలో ఇరువురు సీఎస్‌లూ వాడివేడిగా వాదించుకున్నారు. ఎవరు ఏమన్నారంటే.. ఏపీ సీఎస్ కృష్ణారావు 1. హైదరాబాద్ శాంతి భద్రతలను గవర్నర్‌కు అప్పగించండి. ఆంధ్ర ఉద్యోగుల్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు వివక్ష గురిచేస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిని నివారించేందుకుగాను శాంతి భద్రతలను గవర్నర్‌కే అప్పగించాలి. 2. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను టీ సర్కార్ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. అధికారులను నియమించుకుంది. 3. కాలుష్య నియంత్రణ మండలి, న్యాక్లను తెలంగాణ ఏకపక్షంగా స్వాధీనం చేసుకుంది. 4. పదో షెడ్యూల్లో సంస్థల నిర్వహణ, పరిశీలన ఉభయ రాష్ట్రాల యాజమాన్యంతో ఉండాలి. తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ 1. ఏపీ ఉద్యోగులకు ఎలాంటి వేధింపులూ లేవు. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించడంపై అభ్యంతరం. 2. అలా చేయలేదు. అభ్యంతరం చెబుతున్నాం. 3. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. 4. దీనిపైనా అభ్యంతరం చెబుతున్నాం. -
సింగ్‌గారూ.. త్వరగా పరిష్కరించండి
పునర్విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన సమస్యలకు త్వరగా పరిష్కారం చూపించాలని తెలంగాణ సర్కార్ ఏకే సింగ్ కమిటీని కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పాడిన అనంతరం నెలకొన్న వివాదాల పరిష్కారాల కోసం ఏర్పడిన ఏకే సింగ్ నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారుల బృందం శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శులతో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ అంశాలను కమిటీ దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్లింది. 9, 10 షెడ్యూల్లోని సంస్థల విభజన త్వరగా పూర్తి చేయాలని కోరింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పందంగ ఉన్న విద్యుత్, జల వివాదాలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేసింది. విభజన ఇబ్బందులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసిన దరిమిలా ఏకే సింగ్ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
విభజన వివాదాల పరిష్కారం కోసం కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం రెండు రాష్ట్రాలు ఏర్పాడిన అనంతరం నెలకొన్న వివాదాల పరిష్కారాలపై కేంద్ర దృష్టిసారించింది. ఈ నేపథ్యంలోనే ఏకే సింగ్ నేతృత్వంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారుల బృందం హైదరాబాద్ కు రానుంది. గురువారం రాత్రి ఉమ్మడి రాజధానికి చేరుకునే ఈ బృందం.. శుక్రవారం నుంచి ఏపీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ కానుంది. విద్యుత్, నీటి వాటాలు సహా విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై చర్చించనుంది. విభజన ఇబ్బందులపై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి ఫిర్యాదులు చేసిన దరిమిలా ఏకే సింగ్ బృందం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
సవాళ్లు..సౌకర్యాలు
రెండూ సమపాలు..అదే ఆర్మీ విశిష్టత పైరవీలకు చోటు లేదు..ప్రతిభకే పట్టం ఉన్నత విద్యావంతులకూ అవకాశాలు దేశమాత సేవలో తరించే అదృష్టం ఏటా నాలుగుసార్లు నియామక ర్యాలీలు ‘సాక్షి’తో ఆర్మీ అధికారులు సంగ్రాం దాల్వి, ఏకే సింగ్ రాత్రింబవళ్లు పహారా కాస్తాం. శత్రు దేశాల నుంచి మన సరిహద్దులను కాపాడతాం. దేశమాత సేవకు ఇంతకన్నా మంచి అవకాశం.. అదృష్టం ఇంకేముంటుంది.ఆ అవకాశాన్ని.. అదృష్టాన్ని ఆర్మీ కల్పిస్తోంది. అదీ అభ్యర్థుల వద్దకే వచ్చి కల్పిస్తోందని చెన్నైకి చెందిన ఆర్మీ డిప్యూటీ డెరైక్టర్ జనరల్(రిక్రూట్మెంట్) సంగ్రాం దాల్వి అన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన ఇక్కడి ప్రత్యేక అధికారి కల్నల్ ఎ.కె.సింగ్‌తో కలిసి ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. శ్రీకాకుళం : నెలల తరబడి కుటుంబాలకు దూరంగా కొండకోనల్లో విధులు నిర్వర్తించే ఆర్మీ ఉద్యోగం అంటేనే ఓ సవాల్. అయినా ఇందులో దేశసేవలో తరిస్తున్నామన్న తృప్తి ఉంటుంది.తక్కువ వయసులోనే ఉద్యోగానికి ఎంపికై పిన్న వయసులోనే పదవీ విరమణ తీసుకుంటాం. అయినప్పటికీ సైనికుల కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యాలు, రవాణా భత్యం, భోజనం ఇలా..అన్నీ కల్పించేందుకు దే శం ముందుకు వచ్చింది. ఉద్యోగ విరమణ తరువాత ఒక్క ఐడీ కార్డుతో మరెన్నో ఉద్యోగ అవకాశాలు. ఒక కుటుంబం జీవితాంతం హాయిగా ఉండే అవకాశం కల్పిస్తున్న ఉద్యోగం ఇది. సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఆర్మీ ఉద్యోగం వేల రెట్ల సంతృప్తినిస్తుంది. అందుకే ఆర్మీకి రండి.. దేశ సేవ చేయండి. వ్యాయామమే పెట్టుబడి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మార్చిలోపు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి 12 ర్యాలీల ద్వారా వెయ్యి మందికి తక్కువ కాకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటాం. ప్రతి జిల్లా అభ్యర్థులకూ ఏడాదికి రెండుసార్లు అవకాశం వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ లోపు కనీ సం 854 మందికి సోల్జర్ (జనరల్ డ్యూ టీ), టెక్నికల్ (నర్సింగ్), సోల్జర్ (ట్రేడ్స్‌మెన్).. ఇలా మూడు విభాగాల్లోఆర్మీ అవకాశం కల్పించింది. అంతకు మిం చిన అర్హతలున్న అభ్యర్థులున్నా తీసుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా క్లరికల్ విభాగంలో వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ విభాగంలో చాలామంది పరీక్ష రాశారు. రేపోమాపో ఫలితాలొస్తాయి. కానీ మా కోరిక ఒకటే. దయజేసి ఎవరెన్ని చెప్పినా, ఏం చేస్తామన్నా, ఉద్యోగాలిప్పిస్తామంటే మాత్రం పైసా కూడా ఇవ్వొ ద్దు. లంచం ఇచ్చి దేశానికి సేవ చేస్తారా? తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఏజెంట్ల చేతి లో పెట్టొద్దు. ఎవర్నీ నమ్మకండి. కష్టపడి రోజూ వ్యాయాయం చేస్తే ఉద్యోగం గ్యారెంటీ. మూడు నెలల్లోనే ఉద్యోగం రూపాయి ఖర్చు లేకుండా, కానీ లంచం లేకుండా, పైరవీలతో పని లేకుండా వచ్చే ఉద్యోగం ఆర్మీ ఉద్యోగమే. దేహ దారుఢ్యం, ఎత్తు, పరుగు, చదువుకు సం బంధించి అన్ని పత్రాలు ఉండి.. వైద్య పరీక్షలు, అర్హత పరీక్షల్లో విజయం సాధిస్తే మూడంటే మూడు నెలల్లో ని యామక పత్రం చేతిలోకొచ్చి వాలుతుంది. ఈ ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం మొదటి దశ ప్రక్రియ జరుగుతోంది. మార్చి 15నాటికి ఫలితాలొచ్చేస్తాయి. ఏప్రిల్ మొదటి వారంలో అన్ని పరీక్షలూ పూర్తయిపోతాయి. మొదటి నెల జీతమే కనీసం రూ.30వేలు (అన్నీ కలుపుకొని). అందుకే ఈ ఉద్యోగాల కోసం ప్రస్తుతం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా సహా కేంద్ర పాలిత ప్రాంతం అయిన యానాం నుంచీ అభ్యర్థులొచ్చారు. ఇంజినీరింగ్ అభ్యర్థులూ క్యూలో ఉన్నారు. ఏడెనిమిది వేల మంది అభ్యర్థులొస్తారని ఊహిస్తే 11వేలకు పైగా అభ్యర్థులు తమ భవిష్యత్తును వెతుక్కొంటూ వచ్చారు. మే మొదటి వారం లో వచ్చే ఏడాదికి సంబంధించి ఆదిలాబాద్‌లో మరో ర్యాలీకి సన్నహాలు చేస్తున్నాం. సమాచారం సేకరించండి ఈ ఉద్యోగం ఆశించేవారు ఇప్పటికే ఆర్మీలో పనిచేసి రిటైరైన వారి ద్వారా సమాచారం సేకరించవచ్చు. వాళ్లిచ్చే సలహాలతో రోజూ ప్రాక్టీస్ చేసుకుంటే ఉద్యోగం గ్యారెంటీ. మరిన్ని వివరాల కోసం ఏపీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే చాలామంది అభ్యర్థులు ఒకసారి ఫెయిలయ్యామని రెండోరోజో, మూడోరోజో వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అర్హతలేని అభ్యర్థులకు చేతి వేళ్లపై సిరా ఇంకు పెడుతున్నాం. కొంతమంది వాటిని సబ్బు, సర్ఫ్ ఇలా రకరకాలుగా చెరిపేసుకుని మళ్లీ వచ్చేస్తున్నారు. మేం వాళ్లను కోరేది ఒక్కటే.. ‘మరో చాన్స్ కోసం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. వచ్చే ర్యాలీలో ముందుండండి. ఏడాదిలోనే హిందీ నేర్పిస్తాం దేశంలో అత్యధికులు మాట్లాడేది, ఆర్మీలో సంభాషించేంది హిందీ భాషే. గ్రామీణ, వెనకబడిన ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు భాష రాక ఇబ్బందులు పడటం సహ జమే. అయితే ఒకసారి ఆర్మీకి ఎంపికైతే వివిధ దశల్లో భాష నేర్పుతారు. ‘స్ట్రక్చరల్ క్లాసెస్’ ద్వారా ఏ డాది వ్యవధిలో అందరికీ భాష వచ్చేస్తుంది. డిపార్ట్మెంటల్ అర్హత ఉద్యోగాల ద్వారా పదోన్నతులు సాధించొచ్చు. - కల్నల్ ఎ.కె.సింగ్, ఆర్మీ ఉద్యోగ నియామక ప్రక్రియ పరిశీలన అధికారి సాంకేతికత కూ విలువే పదోతరగతి, ఇంటర్ విద్యార్థులకే ఆర్మీ ఉద్యోగం అనుకుంటాం. కానీ బీటెక్ పూర్తయి, ఎంటెక్ చేస్తున్నవాళ్లూ వస్తున్నారు. బాధనిపిస్తుంది. కానీ వారికీ భవిష్యత్తు ఉంటుంది. వచ్చేదంతా సాంకేతిక కాలమే. సైన్యంలో కంప్యూటర్ల వినియోగం ఎక్కువైంది. ఆయుధ సంపత్తి వినియోగానికి ఇంజినీరింగ్ విద్య అవసరమే. కొత్త పరికరాలు డిజైన్ చేయడం, వాటి ప్రోగ్రామింగ్‌కు ఇప్పుడు ఈ తరహా అభ్యర్థులు అవసరం. -సంగ్రాం దాల్వి, డీడీజీ(రిక్రూట్మెంట్), చెన్నై