సాక్షి,న్యూఢిల్లీ: 2జీ స్కామ్ కేసులో నిందితులందరినీ నిర్ధోషులుగా కోర్టు ప్రకటించడం పట్ల మాజీ సీబీఐ డైరెక్టర్ ఏపీ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు.ఏ రాజాతో పాటు కార్పొరేట్ల అరెస్ట్‌కు నేతృత్వం వహించిన సింగ్ తీర్పుపై షాక్‌కు గురయ్యానన్నారు. 2జీ స్పెక్ర్టమ్ కేటాయింపుల్లో తీవ్ర అక్రమాలు చోటుచేసుకున్నట్టు సీబీఐ సాక్ష్యాధారాలతో ముందకొచ్చిందని విచారణలో ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు 2జీ కేసులో ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు అసత్యమని తేలిందని మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు.2జీ తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ స్పందించారు.
2జీ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన కాగ్ క్షమాపక్షలు చెప్పాలని డిమాండ్ చేశారు. తీర్పు వెలువడిన అనంతరం కనిమొళి, రాజా హర్షం వ్యక్తం చేశారు.కష్టసమయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment